
సాక్షి, అమరావతి : మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ పార్టీ లక్ష్యమని ఆయన మండిపడ్డారు. గురువారం సజ్జల తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తమ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రసారం చేసుకుంటున్నారని, కుట్రపూరితంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఢిల్లీ కరుణ కోసం కాషాయవాదిగా అవతారం)
హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉందని సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. హిందూ మతంపై విశ్వాసంతో కాదని, అధికారంలో లేమనే బాధతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. అత్యంత భక్తి భావంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయమే ప్రతిపక్షాల్లో కనిపిస్తోందని, ఇలాంటి చర్యలతో ప్రజల్లో ప్రతిపక్షాలే చులకనవుతున్నాయని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారే అభాసుపాలయ్యారన్నారు. (‘బురద జల్లేందుకే ఆ పిచ్చి రాతలు’)
Comments
Please login to add a commentAdd a comment