సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిట్టల దొరలా మారి ప్రజలను, అమరావతి రైతులను కూడా మోసం చేస్తున్నాడు. కట్టలేనటువంటి రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించి మోసం చేశాడు. అందుకే ప్రజలు చంద్రబాబు పళ్లు రాలగొట్టారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు.
కాగా, కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతులతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే. వినేవాడుంటే చంద్రబాబు ఏదైనా చెప్తారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టిన వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు 23 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదు. అమరావతిని మహానగరాలతో పోల్చి చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఎయిర్‌పోర్ట్ నిర్మించడమేంటి?.
విశాఖ పరిపాలనా రాజధానిగా రాష్ట్రానికి ఎంతో సంపదను సృష్టిస్తుంది. 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ? 29 నియోజకవర్గాలున్న నగరాలెక్కడ?. ఈ విషయంలో ప్రభుత్వంపై బురదజలుతున్నారు. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. పరిపాలనా రాజధానిగా విశాఖ తథ్యం. విశాఖలో రూ. 10వేల కోట్లు ఖర్చుపెడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తుంది. మూడు రాజధానులకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. మాకు అమరావతి, కర్నూలు, విశాఖ అన్నీ సమానమే. 2024లోపే 3 రాజధానులపై బిల్లు పెడతాము. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు జరిగి తీరుతాయి. రెచ్చగొట్టేందుకే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. విశాఖలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి స్కామ్ చేసుకునే అవసరం చంద్రబాబుకే ఉంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: మూడు రాజధానులపై మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment