MAVIGUN
-
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్‌ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్‌కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్‌ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
MAVIGUN దెబ్బకు మంత్రులు సింగపూర్ కు పరుగో పరుగు
-
టార్చి లైట్ మినిస్టర్ ఎవరు..?
-
‘ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబే’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతే దీనికి కారణమని చెప్పారు. అవినీతి కోసమే అమరావతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.‘రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరదీశారు. ఇప్పటివరకు రాజధాని కోసం రూ.45 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా?మావిగన్ ప్రతిపాదనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మావిగన్‌పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని అంబటి రాంబాబు చెప్పారు.అమరావతి అసాధ్యమనే మావిగన్ ప్రతిపాదనహైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని అంబటి రాంబాబు అన్నారను. ‘తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్ హోటల్ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా? అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్ మీద బూతులతో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది’ అని చెప్పారు. -
‘చంద్రబాబు టెన్షన్ అదే’
సాక్షి, తాడేపల్లి: మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు ప్రభుత్వంలో భయం మొదలైందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులపై కూడా వేధింపులు పెరిగాయి’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రావటం లేదు. ఈ అరాచకాలపై జనమే తిరగపడే రోజు వస్తోంది. పూడి శ్రీహరి, తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్‌పై వేధింపులు అన్యాయం. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరపడి దాడులు జరిగినప్పుడు ఈ పోలీసులు ఏం అయ్యారు?. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగినా ఎందుకు నిలువరింవలేదు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులను ఆపాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహాటీవీ వంశీ వ్యాఖ్యలపై వీడియో చేశాడని తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఏపీ పోలీసులు అతన్ని తీవ్రంగా వేధించారు. ఇప్పుడు మళ్ళీ విజయనగరంలో కేసు పెట్టించి వేధించారు. తెలంగాణ జర్నలిస్టులు నిలదీస్తే ఏపీ పోలీసులు నీళ్లు నమిలారు. నారా లోకేష్ పదేపదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడినందుకు కేవిఆర్‌పై కేసు పెడతారా?. సవీంద్ర కేసులో సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇలా అనేక కేసుల్లో కోర్టులు తీవ్రంగా స్పందించినా పోలీసుల్లో మార్పు రాలేదు..పూడి శ్రీహరి జర్నలిస్టు జీవితంలో ఎప్పుడూ ఎక్కడా కేసుల్లేవు. కానీ మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. జగన్‌కు సన్నిహితుడనే కారణంతోనే అరెస్టు చేశారు. టీడీపీ అధికార పేజీల్లో వైఎస్సార్ సీపీపై పెడుతున్న అడ్డగోలుగా పోస్టులపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. 2 వందలకు పైగా ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణ మీద 62 చోట్ల ఫిర్యాదులు ఇచ్చినా ఎందుకు కేసు నమోదు చేయలేదు?. పైగా నిరసన తెలిపిన మా పార్టీ నేతలపై అక్రమ కేసు పెట్టారు. వైఎస్ జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదన జనంలోకి బాగా వెళ్లింది. దీంతో డైవర్షన్ కోసం మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి’’ అని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. -
ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్
-
YS జగన్ మావిగన్ ప్రతిపాదన బాగుందని ప్రజలు చెబుతున్నారు
-
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్‌కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
అమరావతి VS మావిగన్.. జగన్ విజన్ వర్సెస్ బాబు శకుని బుద్ది
-
మావిగన్ వారియర్స్.. అమరావతి గ్రాఫిక్స్!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని ‘మావిగన్’ ఓవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు..! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా మావిగన్... రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి...! రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండటం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతుండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా ‘మావిగన్’ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు కుట్రలను వైఎస్సార్సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా ‘మావిగన్’ ఏ విధంగా మెరుగైనదో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దుర్బుద్ధి, కుట్రలను ఎండగడుతూ ఆయన మామ ఎన్టీ రామారావుతోపాటు ఆయన తోడల్లుడు దగ్గుబాటి, బావమరిది నందమూరి హరికృష్ణతోపాటు పలువురు నేతలు స్వయంగా చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి తదితరులు గతంలో చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలను ప్రస్తావిస్తున్నారు. ‘అమరావతి’ అవినీతిపై సమాధానం చెప్పలేకే... టీడీపీ కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నా వడ్డీ పథకానికి అతీ గతీ లేదు.. నాడు – నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి ఏ రూ.10 లక్షల కోట్లు అవుతుందో అంతే చిక్కడం లేదన్నారు. చంద్రబాబు 2014–19లో, 2024 నుంచి ఇప్పటివరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.8 వేల కోట్లేనని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. ఇక అమరావతి నిర్మాణం పేరిట యథేచ్ఛగా పాల్పడుతున్న అవినీతిని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలు, గణాంకాలతో సహా ఎండగట్టారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇటాలియన్ మార్బుల్స్‌తో అధునాతనంగా నిర్మించే భవనాలకే చ.అడుగుకు రూ.4,500 ఖర్చు అవుతోంది. కానీ అమరావతిలో మాత్రం చ.అడుగుకు ఏకంగా రూ.14 వేలు దాకా చెల్లిస్తూ పనులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) దేశంలో కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున ఆరు లేన్ల రహదారులు నిర్మిస్తుంటే... అమరావతిలో మాత్రం కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేయడం ఏమిటని నిలదీశారు. అమరావతి దోపిడీ కుట్రలో భాగస్వాములైన ఈనాడు కిరణ్ వియ్యంకుడు, చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు తదితరులకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని.. రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. అమరావతి పేరిట భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిర్గతమైంది. ‘మావిగన్’కు ప్రజామోదం.. రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల పరంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కి.మీ. అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందరు పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా... కేవలం రూ.20వేల కోట్లతో మావిగన్‌ను పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది. ‘మావిగన్’కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు... వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు ‘దుష్ప్రచార’ కుతంత్రం... అమరావతిపై తన కట్టుకథలు బెడిసికొడుతుండటం... మావిగన్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కపట నైజాన్ని గుర్తు చేస్తున్నాయి. ‘2009 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను..!’ అని హెచ్చరించడం గమనార్హం. అనంతరం అనుమానాస్పద రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం సందేహాలను బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన మార్కు దుర్బుద్ధిని ప్రదర్శించారు. అమరావతి పేరిట తాము సాగిస్తున్న అవినీతి బట్టబయలు కావడంతో మరోసారి తన పన్నాగానికి పదును పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మొదటగా ఈ కుట్రను లేవనెత్తగా... మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆ కుట్రలో పాత్రధారులుగా మారారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు, బరితెగించి సాగించిన అవినీతి గురించి గతంలో పలువురు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వైస్రాయ్ కుట్ర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడులతోపాటు పలువురు సీనియర్ నేతలు గతంలో చేసిన విమర్శలను సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. బాబు నైచ్యానికిదే నిదర్శనం! 2009 ఆగస్టులో వైఎస్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైచ్యానికి అద్దంపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’’ అని చంద్రబాబు హెచ్చరించడం, ఆ తర్వాత రోజే అనుమానాస్పద రీతిలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే డర్టీయెస్ట్ రాజకీయ నాయకుడు.. ఆయన నాయకుడు కాదు.. మేనేజర్ మాత్రమే.. కాపీ క్యాట్..! ఆయనకు ఆదర్శాలు లేవు.. స్వార్థం మాత్రమే ⇒ డిసెంబర్ 30, 2018 ప్రెస్ మీట్లో ‘హైదరాబాద్‌ను ప్రపంచ మ్యాప్‌పై పెట్టానని చంద్రబాబు అంటాడు.. మెంటల్..! అంత సమర్థుడైతే అమరావతి ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్ తప్ప నిజమైన భవనాలు ఏవీ రాలేదు. ⇒ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబర్ 25, 2018 పరిగి (వికారాబాద్) బహిరంగ సభ, ప్రెస్మీట్లో.. హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివ ప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్‌పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ.. విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారులు పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్‌ను విజయవాడలో నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్‌లో నెల రోజులపాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు..!-నాదెండ్ల భాస్కర్‌రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవినీతిపరుడు. దిగజారుడు వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక రాజకీయాల్లోకి వస్తే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తాడో ఊహించుకోండి. చంద్రబాబు అలానే దిగజారుడు, అవినీతి రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాడు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం...-పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి(గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు) చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ పేరుతో అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుక కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. లోకేశ్ నా తల్లిని దూషించారు. ఖబడ్దార్...! చంద్రబాబు ఔరంగజేబ్... గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీరామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. కుటుంబాన్నీ, ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు -దగ్గుబాటి వెంకటేశ్వర రావు‘అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఇటు కుటుంబాన్ని, అటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అధికారం, అవినీతే చంద్రబాబు లక్ష్యాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇప్పించి యథేచ్చగా అవినీతికి పాల్పడేవారు. 1985ృ89 ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యం డిస్టిలరీల లైసెన్సు ఇప్పిస్తానని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి గోనె సంచిలో కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్ల లైసెన్సుల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎన్టీ రామారావు తీవ్రంగా మందలించారు. అయినా సరే గోతికాడ నక్కలా కాచుకుని వెన్నుపోటు పొడిచారు. రంగా హత్య వెనుక చంద్రబాబు-మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో పేర్కొన్నారు) ప్రజా నాయకుడు, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా హత్య వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయన ప్రోద్బలంతోనే రంగాను హత్య చేశారు. రంగా జీవించి ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించారు. అందుకే రంగా హత్యకు పచ్చ జెండా ఊపారు.’ చంద్రబాబు అరాచక శక్తి-దేవినేని నెహ్రూ, మాజీ మంత్రి‘అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అరాచకానికైనా పాల్పడతారు. 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును, ఆయన కుమారుడు హరికృష్ణను మా ముందే పచ్చి బూతులు తిట్టారు. ఇక వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నిర్వహించే ధర్నాల సందర్భంగా బస్సులను దహనం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. సామాన్య ప్రయాణికులు చనిపోతారని కార్యకర్తలు చెప్పినా సరే ఆయన వినిపించుకునేవారు కాదు. సామాన్యులు చనిపోతే మనకేం... బస్సులు తగలబెట్టకపోతే పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయినట్టు కాదు అని చంద్రబాబు చెప్పేవారు. అంతటి అరాచక శక్తి చంద్రబాబు. అవినీతి, అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి(2019 ఎన్నికల సందర్భంగా గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ) ‘అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు అక్రమ సంపాదన ఆర్జనలో బిజీ అయిపోయారు. ఆయన చేస్తోంది రాజధాని నిర్మాణం కాదు.. కూలి పోతున్న టీడీపీ నిర్మాణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిలోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత హెరిటేజ్ కంపెనీ కోసమే ఆయన తపన అంతా. పోలవరం ప్రాజెక్టును తన అవినీతికి ఏటీఎంగా చేసుకున్నారు. ప్రజల్ని మోసగించేందుకు డేటా చోరీకి పాల్పడ్డారు. చంద్రబాబు తాను సీనియర్‌నని చెప్పుకుంటారు. కానీ సొంత మామకే వెన్నుపోటు పొడవటంలో ఆయన సీనియర్. తెలుగు ప్రజలను మోసం చేయడంలో సీనియర్. నేడు తిట్టిన పార్టీ ఓళ్లోనే రేపు కూర్చోవడంలో సీనియర్. కేంద్ర పథకాలను తనవిగా స్టిక్కర్ వేసుకోవడంలోనే సీనియర్.’ -
'మావిగన్'లో అమరావతి పదిలం!
ఒక రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర పరిధికి చెందిన అంశం. సంబంధిత ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం గుర్తిస్తుంది. ఇది ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఏపీలో ఈ అంశాన్ని అసాధారణ అంశంగా మార్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇంత ప్రయాస ఎందుకు? అమరావతి ఏకైక రాజధాని స్థానంలో మూడు రాజధానుల ఆలోచనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం! జగన్ కోసమే రాజధానికి చట్టబద్ధత అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ సందర్భంగా జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సీట్ రాజధాని అనీ, అంతకుమించి రాజ్యాంగంలో రాష్ట్ర రాజధానిపై ఎలాంటి వ్యాఖ్యానాలూ లేవని కేంద్ర ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. అంతెందుకు, 2014 నుంచి 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్. నిత్యం అమరావతి రాజధాని అంటున్నారు కానీ ప్రభుత్వ ఆదేశాలు, జీఓలు అన్నీ వెలగపూడి పేరుతో వచ్చాయి. వెలగపూడి రాజధాని కాదు కానీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సీట్ సచివాలయం వెలగపూడిలో ఉన్నది కాబట్టి ఆ పేరుతోనే ఆదేశాలు జారీ అయ్యాయి.రాజధాని వేరు, నూతన నగరం వేరు!అమరావతి రాజధాని మారకూడదు అంటే చట్టంతో సాధ్యం కాదు. నిజంగా అమరావతి రాజధానిని మార్చకూడదు అనుకుంటే జగన్ మావిగన్ ప్రతిపాదన గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అమరావతి రాజధానిలో విజయవాడ, గుంటూరు లేవు. కానీ మావిగన్‌లో అమరావతి ఉన్నది. అంటే జగన్ అధికారంలోకి వచ్చాక మావిగన్ అమలు చేసినా అమరావతికి ఎలాంటి నష్టం ఉండదు. రాజధానినీ, నూతన నగరాన్నీ మిళితం చేయడం వల్లే ఏపీలో రాజ[node:field_tags]ధాని అంశం వివాదం అవుతున్నది. రాజధాని అంటే పరిపాలనా కేంద్రం, అందుకు కావాల్సిన కార్యాలయాలు ఏర్పాటు. కానీ ఏపీ ప్రభుత్వం రాజధాని చుట్టూ నూతన మహానగర నిర్మాణానికి పూనుకున్నది. ఇది ఆచరణలో సాధ్యమా? నూతన నగరాల అనుభవాలు ఏమి చెబుతున్నాయి అన్నది ముఖ్యం.దేశంలో మొదటి ప్రణాళికబద్ధ నగరం చండీగఢ్. పంజాబ్, హరియాణాలకు ఉమ్మడి రాజధాని. కేంద్ర పాలిత ప్రాంతం. 60 సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. ప్రస్తుత జనాభా 11 లక్షలు. ఇది గుంటూరు జనాభాతో సమానం. మరో నూతన నగరం నయా రాయపూర్ 25 సంవత్సరాల క్రితం ప్రారంభం అయితే ప్రస్తుత జనాభా 5.6 లక్షలు. పుణెకు సమీపంలో ఏఇఇ కంపెనీ వారు 25 వేల ఎకరాలలో నూతన నగర నిర్మాణం, భవనాలు పూర్తి చేశారు. 3 లక్షల జనాభా అంచనాతో నిర్మించిన లవాసా నిర్మాణం పూర్తయినా ప్రస్తుత జనాభా రెండు వేలు మాత్రమే. స్థూలంగా నూతన నగరాలు రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. నిర్మాణం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. ఒక వేల నిర్మాణం చేసినా ప్రజలు రావడానికి పరిమితులు ఉన్నాయి. రాజధానితో సంపద సృష్టి భ్రమే!అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, నూతన నగరం. అదికూడా ప్రపంచంలో ఐదో స్థానం, దేశంలో మొదటి స్థానం అంటే హైదరాబాద్, ఢిల్లీకి మించిన నగర నిర్మాణం. రాజధానికి కావలసిన కార్యాలయాల ఏర్పాటు వరకే పరిమితం అయితే ఒక లెక్క. రాజధాని కార్యాలయాల నిర్మాణం అంతా కలిపి సాధారణ స్థాయిలో చేసినా రూ. 1.5 లక్షల కోట్లు అవుతుంది. అదే ప్రభుత్వ అంచనా అయితే 2 లక్షల కోట్లు అవుతుంది. పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ తదితర వాగుల వరద ముప్పు నుంచి నూతన ప్రతిపాదిత నగర రక్షణ కోసం దాదాపు 10 వేల కోట్లు ఖర్చు చేయాలి. రాజధానిలో కొంత భూమి విక్రయం ద్వారా ఆదాయం పొందాలి అనుకున్నా మొదట 1.5 నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. కాలం జరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. మరి లక్షల కోట్లు పెట్టుబడి భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నదా? అప్పు చేయకపోతే జీతాలు ఇవ్వలేని ఆర్థిక స్థితిలో ఉన్న ప్రభుత్వం ఇంత భారంతో నూతన నగర నిర్మాణానికి పూనుకోవడం శ్రేయస్కరమా? అప్పు చేసి నగర నిర్మాణం చేసినా ప్రతిపాదిత నగరానికి అత్యంత సమీపంలో విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఈ రెండు నగరాలకు సంబంధం లేకుండా కొత్త నగర నిర్మాణం చేసినా నోయిడా, లవాసాల పరిస్థితి ఉత్పన్నం కాదా?రాజధాని ద్వారా సంపద సృష్టి అనేది ఊహాజనితం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను పరిశీలిస్తే అవి రాజధానులు కావడం వల్ల సంపద వస్తున్నదా? అక్కడ ఉన్న ఐటీ, తదితర సంస్థల వల్ల సంపద వస్తున్నదా? రాజధాని నగరాలే సంపదకు మూలం అయితే గాంధీనగర్, చండీగఢ్, భోపాల్ నుంచి సంపద ఎందుకు రాలేదు? కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి మాత్రమే సంపద సృష్టి జరుగుతుంది తప్ప రాజధాని వల్ల కాదు. ఏపీలో ఐటీ రంగంలో పెట్టుబడులు ఈ ప్రభుత్వంలో కూడా విశాఖలోనే వస్తున్నాయి. మరి అమరావతిలో ఏ సంస్థలు వస్తాయి? కంపెనీలు రాకుండా రాజధాని ఎంత పెద్ద స్థాయిలో నిర్మాణం చేసినా సంపద సృష్టి ఎలా సాధ్యం?నిధుల సమస్య తీరే ప్రతిపాదనజగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు... మధ్యలో మంగళగిరి, తాడేపల్లితో పాటు నూతన ప్రతిపాదిత అమరావతి నగరం కలిసే ఉంటాయి. మావిగన్ ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 10–15 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాజధాని కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయవచ్చు. నూతన రాజధాని నగరం 40 లక్షల జనాభాతో ప్రారంభం అవుతుంది. సమీపంలో ఉన్న ప్రాంతాలు క్రమేణా రాజధానిలో కలిసిపోతాయి. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా మారిన తర్వాత వాటికి ఆనుకునివున్న కూకట్పల్లి, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, శంషాబాద్, గచ్చిబౌలి కలిసిపోవడంతో హైదరాబాద్ మహా నగరంగా విస్తరిస్తూనే ఉన్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ కన్నా చుట్టూవున్న ప్రాంతాలే అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయి. మావిగన్ కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో ప్రారంభమై క్రమేణా అమరావతితో సహా మిగిలిన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేకంగా నగర నిర్మాణం అవసరం ఉండదు. మావిగన్‌లో అమరావతి కూడా అంతర్భాగంగా ఉంటుంది. కనుక రాజధాని మార్పు అంశం ముగిసిన అధ్యాయంగా మారుతుంది. ఆ రకంగా మావిగన్‌లో అమరావతి పదిలం!ఇక అమరావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర వనరులు, అప్పులతో చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రతో సహా ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధుల సమస్య తలెత్తుతుంది. అదే మావిగన్ అయితే స్వల్ప వనరులతో రాజధానికి కావలసిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మిగిలిన వనరులను ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మావిగన్ ప్రతిపాదనను పరిశీలించాలి. ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరగాలి. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
అమరావతి x మావిగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచననుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని అంటున్నారు.. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్‌తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్‌తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలనూ సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్‌కు ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువయ్యింది. ఎల్లో మీడియా సహకారంతో, మందీ మార్బలం ప్రోద్బలంతో మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో మరణ మృదంగం కథనాలు వస్తున్నాయి. వైఎస్ మరణానికి జగనే కారణమనే దిగజారుడు రాతలకు ఎల్లో పత్రికలు దిగజారాయి. చంద్రబాబు ఉసిగొల్పడంతోనే ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్న వందిమాగధ బృందాలు గార్దభాల్లా గొంతు విప్పుకుని ఓండ్రపెడుతున్నాయి. అసలు నరహంతక చరిత్ర చంద్రబాబుదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా, చివరకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తినాయుడి వరకు ఏ మరణాన్ని చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబువైపే వేళ్లన్నీ చూపిస్తాయన్న సంగతి తెల్సిందే.. అవేవీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఉంది ఈ ఎల్లో సిండికేట్ వీరంగం చూస్తుంటే.. మావిగన్ అంటే వీళ్లెంత భయపడుతున్నారో ఈ డైవర్షన్ రాజకీయాలను చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మొదట మావిగన్ అంటే జోక్ అన్నారు.. ప్రజల్లో మద్దతు పెరుగుతుండడంతో ఆ తర్వాత అది సీఆర్డీఏ పరిధిలోనే ఉంది అంటున్నారు.. ఎవరేమన్నా ప్రజలు మాత్రం మావిగన్ ప్రజా రాజధాని అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రచారం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్న విషయం అందరికీ అర్థమవుతోంది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన మావిగన్.. చంద్రబాబు ఆచరణసాధ్యం కాని ఊహాజనితమైన అమరావతిని పోల్చుకుంటూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలి రోజు నుంచే పరుగులుఇప్పటికే అన్ని మౌలికవసతులు ఉండి 110 కి.మీ జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి వంటి నాలుగు కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో రెండు మున్సిపాల్టీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజునుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకుపైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజన్‌గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలవలు దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, లక్ష ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్‌లో అన్ని మౌలికవసతులు ఉండటంలో తొలిరోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదంటున్నారు. ఆచరణసాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని విమర్శకులంటున్నారు.అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో?అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లలో స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే తొలి దశలో 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు, ఇప్పుడు రెండో దశ కింద సేకరిస్తున్న మరో 50 వేల ఎకరాలు కలుపుకుంటే మొత్తం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయడం, కరెంట్, డ్రైనేజీ పనులకే అవసరం అవుతాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న రూ. 2లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచేకొద్దీ రూ.4 లక్షల కోట్లు అవుతుందో, రూ. 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్‌లో అయితే ఇందులో కేవలం పదోవంతు అంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదని, రానున్న కాలంలో రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.అందుబాటులో అన్ని మౌలిక వసతులుమావిగన్ పూర్తిగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించి ఉండటం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధానంగా కలిసివచ్చే అంశం. 110 కి.మీ పైగా ఆరులైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్‌తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్ ఉన్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం వేల కోట్లు వ్యయం చేయాల్సి రావడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. పోర్టు, ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి అన్ని కీలక మౌలికవసతులు మావిగన్‌లో ఉండటంతో ఎటువంటి అదనపు వ్యయాలు లేకుండా తొలి రోజు నుంచే పెద్ద నగరాలతో పోటీపడ వచ్చంటున్నారు.పోర్టు నగరాల్లో శరవేగంగా అభివృద్ధిచెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని.. వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది.. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్‌ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలుపడటం ఖాయమంటున్నారు. అదే అమరావతి విషయానికి వస్తే మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు కేటాయించడంతోపాటు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. -
జగన్ విజన్ భేష్ ..మంత్రివర్గంలో మావిగన్.. చంద్రబాబు అసంతృప్తి
-
నిన్న జగన్ గారిని కలిశాను.. మావిగన్ పై ఆయన చెప్పింది ఒక్కటే
-
360 లక్షల కోట్లు..! వాటే విజన్
-
మంత్రివర్గంలో మావిగన్!
సాక్షి, అమరావతి : మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్‌గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మావిగన్‌పై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. దీనివల్ల అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన అంశానికి పెద్దగా ప్రచారం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మంత్రులు వెనుకబడ్డారని, మావిగన్‌ను తిప్పికొట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసి.. వ్యతిరేకంగా పని చేయించినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మాత్రం దీటైన స్పందన రాలేదని అన్నట్లు తెలిసింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని, అందుకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారని సమాచారం. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలని.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు అన్నిచోట్లా పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. కనీసం ఆయా పనులు మొదలయ్యేలా అయినా చర్యలు తీసుకుంటేనే అర్బన్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఏబీఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడారనే విషయంతో సంబంధం లేకుండా పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అజెండా, అందులో చర్చించే అంశాలు ముందుగానే లీక్ అవుతున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుసుకోవడం పెద్ద పని కాదని, కానీ అలా జరక్కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. లీకులు మంత్రుల నుంచి జరుగుతోందా, అధికారుల నుంచా అని ఆరా తీసినట్లు తెలిసింది. అదే సమయంలో తమకు కేబినెట్ అజెండా ఇప్పటి వరకు అందలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్లో జరుగుతున్న అవినీతిపై సాక్షిలో ప్రచురితమైన కథనంపైనా చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి, తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్
-
‘చంద్రబాబు.. అన్ని రూ. లక్షల కోట్లు ఎందుకు?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి చత్తీస్‌గఢ్‌లో నిర్మించిన నవ రాయ్‌పూర్ ఉదాహరణ అని ఆయన తెలిపారు. నవ రాయపూర్‌లో బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయని.. కానీ జనం లేరని సజ్జల పేర్కొన్నారు. ‘చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేవలం పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే కడుతున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిలు.. వీరికి బంగ్లాలు మాత్రం కడుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల్సి ఉంది. అది ఎప్పటికి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేని చోట అంతంత డబ్బు పెట్టి ప్రజలు ఎలా ఉంటారు?, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ రేట్లు పెట్టి ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారు?, ప్రజలు భరించలేని రేట్లతో, ఏ సదుపాయాలూ లేని చోట ఎందుకు ఉంటారు?, మౌలిక సదుపాయాల కోసమే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?, ప్రజలు రాకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది. మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని..‘మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మావిగన్ అలా కాదు.. అమరావతిలో 10 శాతంతో ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుంది. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయ్యింది. త్వరలో పోర్టుకూడా వస్తుంది. జగన్ చెప్పినదానికీ, చంద్రబాబు చెప్పిన దానికీ తేడా ఇది’ అని తెలిపారు. ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారు?చంద్రబాబు నాయుడు ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారని సజ్జల ప్రశ్నించారు. రాని క్యాపిటల్ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?, హెరిటేజ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?, రాజధాని పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, దానికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీశారు.చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం‘భావితరాలకు అన్యాయం చేస్తున్నారని జగన్ చెప్తున్నారు. మావిగన్ ఆలోచనను పలు దఫాలుగా జగన్ చెప్పారు. జగన్మోహన్రెడ్డి వేసిన ప్రశ్నలకు సూటిగా చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పడంలేదు. చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం ఉంది. భూములు ఇప్పుడు అమ్మితే రేట్లు రావని చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పడు అమ్మితే వస్తాయో చెప్పగలరా?, అమ్మేంతవరకూ ఎన్ని డబ్బులు పెడతారు?, అప్పటివరకూ పెట్టే డబ్బు ఎంత? వడ్డీ ఎంత?, కాంట్రాక్టు కంపెనీలకు జీఎస్టీ సహా అనేక రాయితీలు ఇచ్చారు. ఇక పన్నుల ద్వారా ఏరకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు. అమరావతి ఆలోచన ఆసాధ్యమైనది. దీనిపై ప్రశ్నలు అడిగితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చంద్రబాబు అమరావతి ఏరకంగా ఆచరణాత్మకమో చెప్పగలరా?, అప్పు చేయకుండా ఏం కట్టినా తప్పు లేదు. అప్పులు చేస్తున్నప్పుడు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అవినీతికి తరగని గనిలా అమరావతి‘చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని కామధేనువులాగ, అక్షయపాత్ర లాగ చూస్తున్నారు. గ్రో ఇంజిన్‌లాంటి క్యాపిటల్‌ను తీసుకు రావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుంది. ఆ డబ్బును మావిగన్ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుంది. ఆరోజైనా, ఈరోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను సక్రమంగా నిర్వహించుకోవాలన్నదే మా ఆలోచన. వాటిని సహేతుకంగా ఖర్చు చేసి రాజధానిని అందుబాటులోకి సత్వరమే తీసుకు రావాలన్నదే వైయస్.జగన్ ఆలోచన. రూ.2-3లక్షల కోట్లు పెట్టినా చంద్రబాబు రాజధానిని పూర్తిచేయడం అసాధ్యం. పైగా అన్ని అప్పులు ఇచ్చేవారు ఎవరు ?, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. చంద్రబాబు, ఆయన మనుషుల కుబేరులు అవడానికే పనికి వస్తుంది. కోర్టుల ద్వారా తెచ్చిన చిక్కుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం ఆగింది. చంద్రబాబు విశాఖపట్నం, కర్నూలుకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టులు కోసమే ఆరాటపడుతున్నారు. చివరకు అమరావతి ప్రాంత ప్రజలనుకూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాలకోసం వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నారుమావిగన్ను ప్రజలు స్వాగతించారుమావిగన్ అనే నినాదం చంద్రబాబుకు తగాలాల్సిన చోట తగిలింది. అందుకనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతికోసం కేంద్రం నుంచి రూ.30-40వేల కోట్లు గ్రాంటు తెస్తే ఎవరు అడ్డుకుంటారు?, మావిగన్‌ను ప్రజలు స్వాగతించారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు:మావిగన్ పేరు అనగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో చర్చజరుగుతోంది. ఈ ప్రతిపాదన సహేతుకంగా ఉందని ప్రజలంటున్నారు’అని తెలిపారు.ఆ కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది..‘రాజధాని ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అన్న చంద్రబాబు సృష్టించిన కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది. అందుకనే ఈ ప్రాంత నాయకులు, ప్రజలుకూడా గట్టిగా చర్చిస్తున్నారు. మావిగన్ చాలా మంది ఆలోచన అని అందరూ అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని,మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబుకు అదురు, బెదురు పుట్టింది. అందుకనే ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. ఎల్లోమీడియా ద్వారా కూడా తిట్టిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తుంటే.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబుకు షర్మిల మద్దతు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహంఏబీఎన్లో దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా 30-40 మంది వైఎస్సార్సీపీ ప్రధాన నాయకులు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం. భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా?, మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ సమర్థించడం ఘోరం. పైగా మేం దాడిచేశామని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. పైగా ఏబీఎన్ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిగారిని ఏదో అన్నారని, ఏకంగా ఆ మీడియాను బ్యాన్ చేయాలన్నారు. ఇప్పుడు వేరేరకంగా మాట్లాడారు. గతంలో సాక్షిలో ఒక వక్త మట్లాడిన మాటలకు సాక్షిపై దాడులు చేశారు. దాడి అంటే అది. చాలా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మూడు రోజులుగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయిరాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే యజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి.మావిగన్ పేరు వింటనే చంద్రబాబుకు భయంమావిగన్ పేరు వింటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మావిగన్ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
అసలైన జోకర్ నువ్వు....చిలక జ్యోతిష్యం చూపిస్తూ షర్మిలను ఏకిపారేసిన రాచమల్లు
-
మావిగన్ బెటర్ ఆప్షన్ అంటున్న జగన్ మాటకు పెరుగుతున్న ప్రజా మద్దతు
-
MAVIGUN అనే పదం డిక్షనరీలో అర్ధమే లేదన్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది
-
టీడీపీ డైవర్షన్ కుట్రలు.. MAVIGUNను అడ్డుకోవడం కోసం టీడీపీ నీచపు రాజకీయం
-
MAVIGUNపై షర్మిళ వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
-
జై జగన్.. మావిగన్ కి జై కొట్టిన బాబు
-
సీఆర్డీఏనే మావిగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటున్నారని, తాము చేస్తున్నది కూడా అదేనని, అదే సీఆర్డీఏ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సైకో ప్రవర్తనలతో రౌడీయిజం బ్యాచ్ వితండవాదాలు చేస్తోందని.. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వెనుక రాజకీయ పార్టీ లేకపోతే ఇంటినుంచి బయటకు రాగలడా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వీరు సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. మనమంతా కలిసి కాపాడుకోవాలన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో గురువారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఇప్పటికే విభజనవల్ల, గత పాలకులవల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోతారు. ఇతను కూడా అంతే. ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దుష్ప్రచారం చేసి పారిపోతాడు. సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తాం. అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారు. అది సీఆర్డీఏ రీజియన్. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతిని కదపలేరు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికినాకు నిమిషం పట్టదు. కానీ, చట్టం తన పని తాను చేసుకుంటుంది. నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టుచేసి జైల్లో పెట్టారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం మేం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తిచేసి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేస్తాం. ‘22ఏ’ నుంచి 1.37 లక్షల ఎకరాలకు విముక్తి ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం. మరో లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములకు కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే, రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు. -
‘మావిగన్’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాజధాని ప్రతిపాదనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ, అన్ని వర్గాలలోనూ మద్దతు పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండానే ఒక మహానగరాన్ని అభివృద్ధి చేసుకునే మార్గమున్నప్పుడు ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల ఉపయోగమేమిటన్న చర్చ జరుగుతుండడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. మూడు నగరాలను కలుపుతూ హైవేలు ఉండడం, పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఉండడం.. తక్కువ ఖర్చుతోనే, తక్కువ కాలంలోనే మావిగన్‌ను ఓ మహానగరంగా అభివృద్ధి చేసుకునేందుకు కలసివచ్చే అంశాలుగా ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రతికూలాంశాలను, మావిగన్ సానుకూలాంశాలను జనం బేరీజువేసుకుంటున్నారు. ఇది మింగుడుపడని చంద్రబాబు వెంటనే డైవర్షన్ అస్రా్తన్ని బయటకు తీశారు. అచ్చెన్నాయుడుతో ఓ విలేకరుల సమావేశం పెట్టించి అవాకులు, చెవాకులు పలికించారు.. అచ్చెన్నాయుడి అసందర్భ ప్రేలాపనలు బాబుగారి డైవర్షన్ రాజకీయంలో భాగమేనన్న విషయం అందరికీ అర్థమైపోయింది.. రూ. 2 లక్షల కోట్లతో రోడ్లు, డ్రైనేజీలా.. ఇక రాజధాని ఎప్పుడు?అమరావతి కోసం మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి సౌకర్యాల కల్పనకు కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. అంటే లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగునీరు కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి.ఇంకా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? రాష్ట్రానికేమన్నా అంత ఆదాయముందా..? ఇది అదనంగా చేయాల్సిన అప్పే కదా.. అసలు ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అంత సుదీర్ఘ కాలంలో రూ.2 లక్షల కోట్లు వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. అసలు ఇదంతా సాధ్యమయ్యేదేనా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే దేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు భవనాలు కట్టగానే రాజధాని తయారైపోవడం మనం చూడలేదు.ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కువ అవకాశం ఉన్న నగరాలే రాజధానులుగా అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు అమరావతిలో సదుపాయాలు లేవు.. ప్రభుత్వం కడతానంటున్న బిల్డింగులూ లేవు.. ఇక ఆర్థిక కార్యకలాపాలెక్కడ? మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే అన్ని సదుపాయాలున్నాయి. పోర్టు, ఎయిర్‌పోర్టు, హైవేలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ బిల్డింగులు కట్టుకుంటే సరిపోతుంది.. ఇలాంటి విషయాలన్నీ జనం బేరీజు వేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ‘మావిగన్’ హోరు..అమరావతి కంటే మావిగన్ బెస్ట్ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మావిగన్‌లో ఇప్పటికే పోర్టు ఉంది, సముద్ర తీరం, విమానాశ్రయం ఉన్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, రహదారులు ఇలా అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతిలో ఏముంది? అని వారు నిలదీస్తున్నారు. అమరావతిలో కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, ఇందులో 10 శాతం అంటే కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేస్తే మావిగన్ అత్యుత్తమ రాజధాని అవుతుందని లెక్కిస్తున్నారు. అంతేకాదు అమరావతిలో నిర్మాణాలకు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు విషయంలో భారీ వ్యత్యాసం ఉండటం వెనుక అవినీతి దాగుందని ఉదాహరణలతో సహా బయటపెడుతున్నారు.అమరావతిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం భ్రమరావతి చేస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ వైఎస్ జగన్ ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అమరావతి కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బే.. అవన్నీ ఫేక్ వీడియోలని మంత్రి లోకేశ్ ట్వీట్ చేయడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో మావిగన్ రేపిన కల్లోలం అర్థమవుతూనే ఉందని విశ్లేషకులంటున్నారు. లోకేశ్ ట్వీట్‌ను ఖండిస్తూ నాడు చంద్రబాబు ప్రసంగించిన వీడియోలతో పాటు ఎకనమిక్ టైమ్స్ సహా పలు జాతీయ పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సమాధానాలు లేకే డైవర్షన్ కుట్రలు..తక్కువ ఖర్చుతోనే మావిగన్‌ను మహానగరంగా అభివృద్ధి చేసుకునే అవకాశమున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే రాజధానిని అభివృద్ధి చేసుకునే ప్రతిపాదనను పక్కనపెట్టేసి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతివైపు చంద్రబాబు ఎందుకు పరుగులు తీస్తున్నారని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అమరావతి ప్రాజెక్టు పనుల కోసం అయినవారికి అధిక ధరలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు వంటివన్నీ రోజుకొకటి బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, టీవీ చర్చలలోనూ ఇది ప్రధానాంశంగా మారడం చంద్రబాబు అండ్‌కో కు తలనొప్పిగా తయారయ్యింది. దాంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. అచ్చెన్నాయుడును రంగంలోకి దింపి అసందర్భంగా మాట్లాడించడం.. మావిగన్‌పై ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ..?⇒ పోర్టు, ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు ఉన్న మావిగన్ ప్రాంతంలో తక్కువ ఖర్చుతోనే, తక్కువ సమయంలోనే మహానగరాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్న మాట నిజం కాదా?⇒ అమరావతిలో లక్ష ఎకరాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు సదుపాయాలకు రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తేబోతున్నారు? ఇవి కాకుండా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎంత సమయంలో పూర్తి చేస్తారు? మొత్తం ఎన్ని దశాబ్దాలు పడుతుంది?⇒ ఆ రూ.2 లక్షల కోట్లలో పది శాతం అంటే రూ.20 వేల కోట్లతోనే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయవచ్చన్న ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన, బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్‌ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు?⇒ దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది?⇒ అమరావతి ప్రాంతంలో పనుల కోసం అధిక ధరలకు టెండర్లు పిలవడం, అయినవారికే అప్పగించడం.. ఎలాంటి పనులు చేయకుండానే ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేయడం, అందులో కమీషన్లు కాజేయడంపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఏమేమి కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? -
మావిగన్‌పై ఆగని టీడీపీ డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మావిగన్‌పై తెలుగుదేశం పార్టీ డైవర్షన్ కుట్రలకు తెరలేపింది. ప్రజలు పాజిటివ్‌గా చర్చిస్తుంటే అధికార పక్షం ఓర్వలేకపోతోంది. ఎలాగైనా మావిగన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెర తీసింది. వైఎస్ జగన్.. మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చిన రోజే సైకో అంటూ టీడీపీ నేత పట్టాభి చిందులు తొక్కారు. జగన్‌ను నంగనాచి అంటూ మంత్రి అనిత దుర్భాషలాడారు. వైఎస్సార్సీపీ నేతల భార్యల గురించి పచ్చపత్రిక అధినేత ఆర్కే రాతరోతలు రాశారు.ఇలా.. రోజుకో డైవర్షన్ స్కీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని తిడుతూ మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ కుట్రలు తెరతీసింది. ఇప్పుడు వైఎస్సార్ మరణంపై అచ్చెన్నాయుడు నీచపు మాటలు మాట్లాడుతూ.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణపై అభాండాలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. మహానేత కుమారుడిపై అభాండాలను తట్టుకోలేక బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న బొత్స.. భావోద్వేగానికి గురయ్యారు.అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలపై బొత్స మండిపడ్డారు. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్సార్ ఒకరని.. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నానని బొత్స అన్నారు. -
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు
-
వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతుగా ఫ్లెక్సీలు
-
‘రావాలి జగన్- కావాలి మావిగన్’
సాక్షి, గుంటూరు: ఏపీలో ‘మావిగన్’కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘రావాలి జగన్- కావాలి మావిగన్’ పేరుతో తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ ఏపీ గ్రోత్ ఇంజిన్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మావిగన్‌తోనే సాధ్యం. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే ‘మావిగన్’ కావాలి. మన రాజధాని- మన మావిగన్- మన ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ వల్ల ప్రయోజనాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.వైఎస్ జగన్ ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. -
'మావిగన్' తో ఇన్ని ఉపయోగాలా..! కళ్ళకు కట్టినట్టు వివరించిన జూపూడి
-
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మావిగన్.. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు: వైఎస్ జగన్
-
'మావిగన్' దెబ్బకు మైండ్ బ్లాంక్..
-
రాష్ట్ర ప్రయోజనాల కోసమే 'మావిగన్': వైఎస్ జగన్
చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడ రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్ల వంటి బేసిక్ వసతులు కల్పించడానికే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని నీ అంతట నువ్వే సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు డీపీఆర్‌లు ఇచ్చావు. మరోవైపు లక్ష ఎకరాల్లో అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అందుకే చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్‌గా 10 శాతం ఖర్చుతో ‘మావిగన్’ను సూచించాం. కూటమి పాలనలో సగం టర్మ్ అయిపోయింది. అన్ని రంగాల్లోనూ ఘోర వైఫల్యం. అంతటా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో ఏడాది దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్ అయిపోతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగబాధ పడిపోతున్నాడు. వైఎస్సార్సీపీ శ్రేణులందరిపై అన్యాయమైన, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా.. నువ్వన్న మాటలకు రేప్పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం. వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?వారికైనా భార్యలు ఉంటారు. వాళ్ల భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా అలా మాట్లాడితే వారికి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చనప్పుడు కనీసం అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా? ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు. ఈ లోకేశ్ చెప్పడు. ఈ దత్త పుత్రుడు చెప్పడు. సిగ్గు లేకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడితే.. వాటిని సమర్థిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. ఈ రోజు సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో కామెంట్లు పెట్టిన పిల్లలను తీసుకువచ్చి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. జైళ్లలో పెడుతున్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కొడుతున్నారు. రేప్పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. మహిళలను తక్కువగా చూసే.. తక్కువగా మాట్లాడే పరిస్థితులు ఎందుకొచ్చాయి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణ భారం పడదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందన్నారు. కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలని.. ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉన్నందున రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యే సరికి ఎన్నో ఏళ్లు, దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని.. దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని.. అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని.. అందుకే ప్లాన్ బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు. అయితే దీని వల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్దలవుతాయని చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్ రాధాకృష్ణ గతి తప్పి మన పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామని.. ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మావిగన్.. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ‘‘చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ‘మావిగన్’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికే నీ అంతట నువ్వే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు డీపీఆర్‌లు ఇచ్చావు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకే రూ.లక్ష కోట్లకు దిక్కులేదు అనుకుంటే మరో 50 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ భూ సమీకరణ చేపడుతూ.. లక్ష ఎకరాల అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేసూ్తనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్లు గడిచాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్లకే ఖర్చు అవుతుంది. ఆ రెండు లక్షల కోట్ల విలువ దశాబ్దాలకు రూ.4 లక్షల కోట్లు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో తెలియదు. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయ్యా చంద్రబాబూ.. ఇది మానుకో. ఆ రెండు లక్షల కోట్లలో 10 శాతం ఖర్చు చేస్తే చాలు మావిగన్‌తో మంచి రాజధాని తక్షణమే అందుబాటులోకి వస్తుంది.ప్లాన్–ఏ వద్దన్నారు.. ప్లాన్–బీ ఎందుకు ఆలోచించడం లేదు? ప్లాన్–ఏ వద్దన్నారు సరే.. మరి ప్లాన్–బీపై ఎందుకు ఆలోచన చేయడం లేదు? నేను ఇంతకు ముందు రాజధాని విషయంలో మంచి ఆలోచన చెప్పాను. ప్లాన్–ఏ కింద రాష్ట్రంలో అన్నింటి కన్నా పెద్ద నగరం విశాఖపట్నం. అందులో కార్యనిర్వాహక రాజధాని పెడితే ఎలాంటి ఖర్చు అవసరం ఉండదు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అప్పట్లో మనం కర్నూలుకు మాటిచ్చాం. అది నెరవేర్చుతూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ, ఇక్కడే అమరావతిలో శాసన రాజధాని తీసుకువస్తే బాగుంటుందయ్యా అని చెబితే.. నానాయాగీ చేసి, రాజకీయాలు చేసి అవి వద్దు అన్నారు. సరే పోనీ అనుకుంటే ఈ ప్రాంతంలో నీవు చేసే పనికి రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా ప్లాన్–బీ కింద మావిగన్ ప్రతిపాదన తెచ్చాం.10 శాతం ఖర్చు చేస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రాజధాని మచిలీపట్నంలో పోర్టు కట్టింది నీవు కాదు చంద్రబాబూ.. మేం కట్టాం. వైఎస్సార్ర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పోర్టుకు భూ సేకరణ చేపట్టాం. మా హయాంలోనే అనుమతులు తీసుకువచ్చాం. మా హయాంలోనే ఫైనాన్షియల్ క్లోజర్ చేశాం. అప్పట్లోనే బ్యాంకులతో నీట్‌గా టై అప్ చేసి 30–40 శాతం వర్క్ కూడా పూర్తి చేశాం. ఆ పోర్టు పూర్తవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు.. విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది. ఈ హైవేకు అటూ ఇటుగా అమరావతిలో కట్టే బిల్డింగ్లు ఇక్కడ కడితే బాగుంటుంది. మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వి), గుంటూరు నుంచి (గన్) అంటూ మావిగన్ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనావిుక్ కారిడార్‌ను కేపిటల్ కారిడార్‌గా డిక్లేర్ చేసి, ఆ కట్టే బిల్డింగ్లు ఇక్కడ కట్టండి. రూ.రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు.. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్‌లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.జగన్ ఏం చెప్పినా ససేమిరా..మనమంత బాగా, లౌక్యంగా చెప్పినా ఊహూ అంటున్నాడు. ఎందుకు అహం? ఎందుకు వద్దంటున్నారంటే.. కారణం అక్కడ రూ.రెండు లక్షల కోట్లలో మొబిలైజేషన్ వర్కుల పేరుతో 8 శాతం కమీషన్లు తీసుకోవచ్చు. మావిగన్‌లో ఈ ఆదాయాలు ఉండవు కదా.. కాబట్టి మావిగన్ వద్దు. అమరావతిలో అన్నీ స్కామ్‌లే. ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరంటే ఒకరు ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయలరఘు (ఆర్జీవీ), ఇంకొకరు బీఎస్ఆర్ (బలుసు శ్రీనివాసరావు). వీరు చంద్రబాబు బినావీులు. వారి సంస్థలకు కాంట్రాక్ట్‌లు. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. అమరావతి కాంట్రాక్టర్లు అంతా వీళ్లే. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకనే మావిగన్ అంటే అహం.. వైఎస్ జగన్ ఏం చెప్పినా ఊహూ అంటున్నారు. చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ⇒ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఇస్తాను.. ఇంకా అవి కాకుండా అంతకు మించి సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు కూడా ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ, ఈ రోజు బిర్యానీ పెట్టలేదు.. ఉన్న పలావు కూడా పోయిందని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడం కనిపిస్తోంది.⇒ విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. ఎక్కడా పలాన మంచి చేశామనే చెప్పే పరిస్థితి లేదు. మన ఐదేళ్ల పాలనలో మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2.73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి.. వారి ఆధార్ నంబర్లు సహా జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ⇒ కానీ ఇదే చంద్రబాబు రెండు సంవత్సరాలు కూడా తిరక్క ముందే రూ.3.52 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఈ అప్పు అంతా ఏమైంది? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జేబుల్లోకి పోతోంది? అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలు ఏం జరిగినా రైతులను ఆదుకునే నాథుడు లేడు ⇒ కూటమి పాలనలో ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అంతటా దళారీల వ్యవస్థ. మన హయాంలో ఆర్బీకే, – ఈ క్రాప్, సీఎం యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్) పెట్టి మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేసే వాళ్లం. ఆ రకంగా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి. నేడు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు.⇒ రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు కరువొచ్చినా, తుపాన్ వచ్చినా ఆదుకునే నాథుడు లేడు. వాళ్ల ఖర్మకు వదిలేసిన పరిస్థితి. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, మరుసటి సీజన్‌కి రైతును సన్నద్ధం చేసేవాళ్లం. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాడే లేడు. ఆక్వాదీ అదే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం ⇒ చదువుల పరిస్థితి ఇంకా ఘోరం. మన ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేసే వాళ్లం. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చే వాళ్లం. ఇప్పటికే రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఈ ఏడాది చేయాల్సిన చెల్లింపులు మరో రూ.2,600 కోట్లు కూడా చూస్తే మొత్తం రూ.10 వేల కోట్ల బకాయిలు అవుతాయి. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. అందులో ఎంత ఇస్తారో తెలియదు.⇒ పిల్లలతో తల్లిదండ్రులు చదువులు మాన్పించి పనికి పంపిస్తున్న పరిస్థితి. స్కూల్స్‌లో నాడు–నేడు పూర్తిగా ఆగిపోయింది. పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలనే ఆరాటంతో మనం గోరు ముద్ద అనే కార్యక్రమం తీసుకొస్తే, ఈ రోజు కనుమరుగైన పరిస్థితి. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించేవి. ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియం. ఆరో తరగతి నుంచి డిజిటలైజ్ క్లాస్ రూమ్‌లు. గవర్నమెంట్ స్కూళ్లు ప్రైవేటు స్కూల్స్‌తో పోటీ పడే పరిస్థితికి మన హయాంలో తీసుకొచ్చాం. ఈ రోజు ఆ స్కూల్స్ అన్నీ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మన కళ్లెదుటే కనిపిస్తోంది. వైద్యంపై ఆలోచన చేసే నాథుడే లేడు⇒ ఆరోగ్యశ్రీ పరిధి ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షలకు పెంచాం. ప్రొసీజర్లను దాదాపు 3,300కు పెంచాం. ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం కోసం పేద, మధ్య తరగతి వాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని చేయి పట్టుకుని నడిపించాం. రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు రూ.5 వేలు చేతిలో పెట్టి పంపించాం. ఈరోజు నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు వాటిని చెల్లించకపోతే చేతులు ఎత్తేస్తున్నాం.. మేం బోర్డు తిప్పేస్తాం.. అని ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. పేదవాడికి వైద్యం అందకపోయినా కనీసం ఆలోచన చేసే నాథుడే ఈ రోజు కనిపించడం లేదు. ⇒ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో తెలియదు. మూడు డీఏలు పెండింగ్. ఐఆర్ ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ కమిషన్‌ను రద్దు చేశారు. కొత్త కమిషన్‌ను ఎప్పుడేస్తారో తెలియదు.మిగిలినవి రెండే బడ్జెట్లు.. హామీల అమలు లేదు⇒ ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా నాకన్నా చక్కగా చెబుతారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఇటీవల మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మిగిలి ఉన్నది కేవలం రెండే బడ్జెట్లు. ఈ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు మనకు కనిపించేవన్నీ మోసాలే. ⇒ సూపర్ సిక్సులు.. సూపర్ సెవెన్లు అన్నాడు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్ల మీద ఈయన (చంద్రబాబు), పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు. త్రికరణ శుద్ధితో మేం ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తున్నాం.. జూన్ 2024 నుంచి ఇవన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చి మోసం చేసిన పరిపాలన చూస్తున్నాం.⇒ మేనిఫెస్టో అన్నది మన హయాంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్లుగా భావిస్తూ 99 శాతం హామీలను నెరవేర్చాం. ఈ మేరకు ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా తలెత్తుకుని చెప్పేలా మన పార్టీ హయాంలో జరిగింది. ఈ రోజు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్లీ చూస్తున్నాం. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి.. జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.అంతా దోచుకో పంచుకో తినుకో.. డీపీటీ⇒ జగన్ చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే దానిపై కూడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. కారణం ఒక్కటే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా వచ్చేవి. ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడ చూసినా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ). రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ వీళ్లు దోచుకోవడానికి, వీళ్లు పంచుకోవడానికి, వీళ్లు తినుకోవడానికే సరిపోతున్నాయి. ⇒ ఈ రోజు ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా వీధి వీధినా బెల్ట్ షాపులు. పోలీసులే దగ్గరుండి ఆ బెల్టు షాపుల్లో అమ్మించే కార్యక్రమం. ఎమ్మార్పీ కంటే రూ.10, రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అంతా వీళ్ల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్లకు రావాల్సింది వీళ్లకు ఇస్తేనే సరి. లేదంటే చికెన్ కూడా అమ్మనివ్వడం లేదు చాలా నియోజకవర్గాల్లో. ఆ స్థాయిలో దోచుకుంటున్నారు. ⇒ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. పీపీఏలు. మన హయాంలో మనం రూ.2.49కి యూనిట్ ఇచ్చేలా పీపీఏ చేసుకున్నాం. రైతులకు మరో 25–30 ఏళ్లపాటు ఉచిత కరెంటు అన్నది ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా అందించాలన్న ఆరాటంతో ఆ మేరకు పీపీఏలు చేస్తే ఆరోజు నానా యాగీ చేసిన వీళ్లు ఈ రోజు రూ.4.60తో పీపీఏ చేస్తున్నారు. ఎంత తేడా! కళ్ల ముందే కనిపిస్తున్నాయి వీరి అక్రమాలన్నీ. ⇒ ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి. కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా రూ.5 వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు తన సమీప బంధువు అయిన విశాఖపట్నం ఎంపీకి ఉచితంగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్ చేశారు. అమరావతిలో కళ్ల ఎదుటే యథేచ్ఛగా దోపిడీ ⇒ అమరావతి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత దారుణమైన స్కాములు జరుగుతున్నాయన్నది మనందరికీ ఇప్పటికే అర్థమైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ లెవెల్లో.. ఇటాలియన్ మార్బుల్ వంటి సదుపాయాలతో కట్టినా చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.4,500కు మించదు. కానీ అమరావతిలో మాత్రం అడుగుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతోంది. ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరు రోడ్డు రూ.20 కోట్లకు పూర్తవుతోంది. ఇక్కడ మాత్రం రూ.53 కోట్లవుతోంది. ఎక్కడా లేని స్కాములు.⇒ ఈ స్కాముల్లో భాగస్వాములు ఎవరంటే ఈనాడు కిరణ్ వియ్యంకుడు ఒకరు. ఇంకొకరు చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్). అంతా వీళ్లే. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఇంతకు ముందు వర్కులు చేస్తే బిల్లులు చెల్లించే వాళ్లం. చంద్రబాబు పాలనలో వర్కులు చేయాల్సిన పని లేదు. చంద్రబాబు మనుషులే కాబట్టి ముందుగానే 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు. ఒక్కొక్కరికీ రూ.6 వేల కోట్ల పనులు.. దానికి రూ.600 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. పనులు చేయడం కథ దేవుడెరుగు.. మొదట మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూ ఆ స్థాయిలో దోచేస్తున్నారు. ఇలా కొల్లగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి?రాక్షస పాలనలో ఇదీ యుద్ధం⇒ ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటి ప్రాజెక్టులు ఆపేయడం కనిపిస్తోంది. రైతులు, పిల్లలు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. స్కీముల కథ దేవుడెరుగు.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని దుస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. ⇒ రాష్ట్రంలో ఏ మాదిరిగా పరిపాలన సాగుతుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది. ప్రజల తరుఫున, మంచి తరఫున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్సార్సీపీ ఒకవైపున నిలుచుంటే.. మరోవైపు రాష్ట్రానికి అన్ని రకాలుగా చెడు చేస్తూ.. రాష్ట్రాన్ని దోచుకుని తింటున్న తెలుగుదేశం పార్టీ. ఈ యుద్ధంలో దేవుడు కచ్చితంగా మనపక్షానే నిలుస్తాడు. రేప్పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఫుట్ బాల్‌ను తన్నినట్టు తంతారు. సింగిల్ డిజిట్ కూడా చంద్రబాబుకు రాకుండా ఉండే పరిస్థితి అతి త్వరలోనే వస్తుంది. ⇒ వైఎస్సార్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే. కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ⇒ ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వీళ్లపై యాక్షన్ ఏదీ?రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని బాధితురాలు ఆందోళన చేస్తుంటే.. న్యాయం చేయమని కంప్లైంట్ ఇస్తే.. ఆమెనే కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కి తనకు అన్యాయం జరిగిందని చెబుతుంటే పోలీసుల సమక్షంలోనే కొడుతున్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి బాత్రూంలోకి పోయి డోర్ గడియ పెట్టుకున్నాడు. ఎస్పీ ఆఫీసులోకి పోవడమేంటి? బాత్రూంలోకి వెళ్లి డోర్ గడేసుకోవడమేంటి? గడేసుకుని స్ట్రైక్ చేయడమేంటి? తీసుకెళ్లి బొక్కలో వేయకుండా చంద్రబాబునాయుడు పంచాయితీ చేస్తున్నాడు.బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడో మనందరం చూసూ్తనే ఉన్నాం. టీటీడీ చైర్మన్‌గా ఉండి చేయకూడని తప్పులు చేస్తుంటే ఏం చేయాలి? ఆ మనిషిని టీటీడీ పదవిలో నుంచి ఊడబెరకాలా? వద్దా? చంద్రబాబు పక్కన పెట్టుకుని తిప్పుతున్నాడు. ఇంత దారుణంగా తయారయ్యారు.ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేస్తే నో యాక్షన్. పట్టించుకునేవాడు లేడు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహిళలకు వీడియో కాల్స్ చేసి అశ్లీలంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆడవాళ్లకు ఫోన్ చేసి అశ్లీలంగా వ్యవహరించాడు. అది బహిరంగంగా కనపడుతూనే ఉంది. ఎలాంటి యాక్షన్ లేదు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలపై దారుణంగా లైంగిక దాడులు చేసినా పట్టింపులేదు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీరంతా ఎమ్మెల్యేలు.. ఒకరు తప్పు చేస్తే ఏం యాక్షన్ లేదు.. ఆడి మీద యాక్షన్ లేదు కాబట్టి.. నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారులే అని ఇంకొకడు. ఇలా ఒకడిని చూసి ఇంకొకడు రాక్షసులవుతున్న పరిస్థితి. మహిళను లైంగికంగా వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ.. ఆ పీఏ మీద కూడా నో యాక్షన్. పైగా ఆ మహిళ మీదే ఎదురు కేసు. ఈ స్థాయిలో రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంటే.. చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకరు. -
జగన్ విధానం కాదనడానికి నువ్వెవడివి, బుడమేరు పొంగినప్పుడు హై కోర్ట్ 5 రోజులు సెలవు
-
మావిగన్‌పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్‌గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్‌ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్‌ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్‌లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్‌ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్‌స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
మావిగన్ పంచ్‌తో రాధాకృష్ణకు భయం పట్టుకుంది
సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. ‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్‌ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా. రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
రావాలి మావిగన్.. కావాలి ఏపీ విన్
-
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర, దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాధాకృష్ణ వివక్ష పూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముక లేని నాయకులు వైఎస్సార్సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కుట్రలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు దిగారు. మా పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలతో రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. కానీ, ఇటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకపోగా చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌లు మద్దతు ఇవ్వడం మహిళలపై వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల గురించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను ఉద్దేశించి అసహ్యకరమైన భాషను ఉపయోగించడం.. వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే. వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్న అనే దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘MAVIGUN’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను.. దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక బాబు, ఎల్లో మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకూ దిగారు. మేం శాంతియుతంగా నిరసనలు చేపట్టాం. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాం. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడలేదు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. అత్యంత సంయమనంతో వ్యవహరించారు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2026 -
నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..
-
అణువణువునా పచ్చ పైత్యం.. రోతగాడు
-
బాబులో మావిగన్ టెన్షన్..
-
LIVE : ABN ఆఫీస్ వద్ద టెన్షన్.. టెన్షన్..
-
ఎల్లో మీడియాకు నిద్ర లేకుండా చేస్తున్న మావిగన్..
-
మావిగన్ ప్రతిపాదనపై వణికిపోతున్న ఎల్లో మీడియా
-
శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
-
మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?
-
సమాధానాలు చెప్పలేకే ఎదురుదాడి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, నిర్వాకాలను నిలదీస్తూ... ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీస్తున్న వైనాన్ని నిగ్గదీస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలు అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ప్రాంతాలను అనుసంధానించి రాజధాని కారిడార్ ‘మావిగన్’గా ప్రకటించాలంటూ చేసిన ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆ మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. జాతీయ రహదారులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటి సదుపాయాలు ఉన్నందున ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా... అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు. అయితే సీఎం చంద్రబాబుకు అది నచ్చ లేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. ఇక రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజన్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం తాము ప్రతిపాదించిన ప్లాన్–బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం 10 శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పుడూ.. ఇప్పుడూ వైఎస్ జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించారని మేధావుల నుంచి సామాన్యుల వరకూ అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అమరావతిలో భవనాల చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తుండటం.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే, అదే తరహా రోడ్లకు రాజధానిలో కి.మీ.కు ఏకంగా రూ.53 కోట్లను ఖర్చు చేస్తుండటాన్ని బట్టి చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. ‘సిండికేటు’ కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకుంటుండటం వల్లే వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేకపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబు సర్కార్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దాంతో రాజధానిలో అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సీఎం చంద్రబాబు, మంత్రులు, కూటమి నేతలు మాటలతో దాడి చేస్తూ తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..?1. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారు. రాజధానికి తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, వరద నీటి మళ్లింపు లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. ఆ 50 వేల ఎకరాలకు అయ్యే రూ.లక్ష కోట్లకే దిక్కు లేదనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మరో 50 వేల ఎకరాలకు అదనంగా అయ్యే వ్యయం మరో రూ.లక్ష కోట్లు. అలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తోంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ సమయంలో.. ఆ 2 లక్షల కోట్ల వ్యయం ఇంకా ఎంతకు చేరుతుంది? రోడ్లు వేయటానికే దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి? 2. ఏడేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి (మొదటి విడత ఐదేళ్లు, ఇప్పుడు రెండేళ్లు) కూడా భూములిచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? రాజధానికి భూములిచ్చి 50–60 సార్లు సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగామని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 3. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నట్లు? అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే.. ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? లక్ష ఎకరాల అమరావతిలో ఇంత వరకు కట్టింది ఎంత? అమరావతి మానస పుత్రిక (పెట్ ప్రాజెక్టు) అంటూ ఇంతవరకు మీరు చేసిన పనులేమిటి? 4. అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు(ఎస్ఎఫ్టీ)కి రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఆరు వరుసలతో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే.. అమరావతిలో కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంత వ్యయం ఎందుకవుతోంది? ఏ స్కాముల వల్ల అది ఎగబాకుతోంది? 5. రాజధాని అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే.. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వారికి అవే పనులకు సంబంధించిన టెండర్లు దక్కాయి. ఇది గూడుపుఠాణి కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపు అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి అంచనా వ్యయాన్ని పెంచేస్తూ.. కాంట్రాక్టర్లను సిండికేటు చేస్తున్నారు. 2018లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కే మళ్లీ అధిక ధరలకు కట్టబెడుతున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? 6. రాజధానిలో కేవలం గవర్నమెంటు కాంప్లెక్స్‌లో సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు? దేశంలో ఎక్కడైనా డిజైన్లకు ఇంతలా ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇందులోనూ దోపిడీకి పాల్పడతారా? 7. బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదు.. ఎవరైనా నొక్కుతారని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. రెండేళ్లు పూర్తి కాకముందే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రూ.3.37 లక్షల కోట్లు. అప్పు చేస్తే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తారు? రైతులు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థుల సంక్షేమం మాటేంటి? శిథిలమవుతున్న స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? రాజధానికే ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఏం కావాలి?8. రాజధానికి 2015లో సమీకరించిన 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే గొప్పగా ప్రకటించారు. బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో డిజైన్లతో మాయ చేశారు. ఇప్పుడేమో 50 వేల ఎకరాలకే పరిమితమైతే అమరావతి మున్సిపాల్టిగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాటా? కాంట్రాక్టు పనులనూ అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించి.. భూములను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకోవడానికే కదా మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు! 9. తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు. అందులో ఇంకా స్థలం ఖాళీగా ఉంది. కానీ.. రాజధాని అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టే పనులను కాంట్రాక్టర్లకు చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తూ.. పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కమీషన్ల కోసమే కదా? 10. రాజ్యాంగంలో దేశ రాజధాని అని ఉంటుందే గానీ ఎక్కడా రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా, రాష్ట్ర హైకోర్టులో 2020 ఆగస్టు 19న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆ రాష్ట్రాలే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది.. కేవలం మన రాష్ట్రానికి మాత్రమే ఎందుకు వర్తిస్తోంది? ఎలా వర్తిస్తోంది? 11. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 సవరించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మరి అదే చట్టసభలో భాగమైన శాసనమండలి సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు సాగిస్తున్న అవినీతి, అక్రమాలను కడిగిపారేస్తారనే భయంతోనే కదా! 12. రాజధానికి తొలి విడత భూసమీకరణ చేసి 11 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి.. అమరావతిని అలా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు. ఆ దేశాలు ఇక్కడేమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా అమలు చేశారా? 13. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నగరాన్ని నిర్మించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రభుత్వ భవనాలు, ఉద్యోగులు క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో నగరం తనను తాను నిర్మించుకుంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై.. ఇలానే కదా మహానగరాలుగా అభివృద్ధి చెందాయి? లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించడం సాధ్యం కాదని తెలిసి కూడా భ్రమలు కల్పించడం ప్రజలను మోసం చేయడం కాదా? ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? 14. ఒక్క రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పుడు కేవలం రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? వాటిని ఎందుకు ప్రైవేటుపరం చేయాలనుకున్నారు? కమీషన్ల కోసమే కదా? 15. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సారవంతమైన పంట పొలాల్లో గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించింది. కమిటీ నివేదికను వక్రీకరించి లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం స్కామ్‌ల కోసమే కాదా? -
రాష్ట్రానికి చీడలా రాధాకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన పత్రిక, టీవీ చానల్ రాష్ట్రానికి పట్టిన చీడలా తయారయ్యాయని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన ‘మావిగన్’ అభివృద్ధి మోడల్‌పై ప్రజల్లో మంచి స్పందన రావడంతో తట్టుకోలేక తమ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’తో తమ అవినీతి ఆశలు కూలిపోతాయనే భయంతో వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వెంకటరామయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. అవినీతిపై ఎక్కుపెట్టిన గన్: కన్నబాబు ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని వైఎస్ జగన్ ప్లాన్–బీ సూచించగానే అధికార పార్టీ ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి ట్రోల్ చేయడంలో నిమగ్నమైంది. ‘మావిగన్’ అనేది అమరావతిలో రూ.వేల కోట్ల అవినీతిపై ఎక్కుపెట్టిన గన్లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే ‘మావిగన్’ ఆలోచన మంచిదే కదా! ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు కడుపుమంటకి పరాకాష్ట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటూనే అమరావతిలో రోడ్లు, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించలేదు? అమరావతి గేటెడ్ కమ్యూనిటీలా మారిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. టెండర్లు, డిజైన్లు, అడ్వాన్సుల పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. ఈ కారణాల వల్లే సంబంధిత బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. అవినీతికే చట్టబద్ధత తెచ్చారు: గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు ‘మావిగన్’ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ సూచించిన మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్‌పోర్టు, నేషనల్ హైవేలు.. అన్నీ ఉన్నాయి. అమరావతిలో ఇవన్నీ రూ.వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెచి్చన చట్టబద్ధత రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి. -
‘మావిగన్’ను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు వ్యూహం
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం వ్యక్తమవుతోందని, ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ఆమోదయోగ్యం కాని, ఆచరణకు నోచుకోని అమరావతిని నిర్మించాలనుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేవలం రూ.20 వేల కోట్లతో గ్రోత్ ఇంజిన్‌గా దూసుకెళుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. మావిగన్ ప్రతిపాదనను ప్రకటించిన రోజే చంద్రబాబులో వణుకు పుట్టిందని చెప్పారు. మావిగన్ ప్రతిపాదనను ప్రజలు ఆమోదిస్తుండటంతో సోషల్ మీడియాలో రూ.కోట్లు ఖర్చు చేసి విపరీతమైన పోస్టులు పెట్టారని, అపహాస్యం చేయడంతోపాటు బూతులు కూడా మాట్లాడారన్నారు.నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఎక్కువ రోజులు నిలువలేకపోయిందన్నారు. తర్వాత చంద్రబాబు ఇదే అంశంపై మంత్రులతో ప్రెస్‌మీట్ పెట్టించారన్నారు. అయినా సంతృప్తి చెందని చంద్రబాబు పచ్చ మీడియాను రంగంలో దింపాడన్నారు. ప్రభుత్వాన్ని జాకీలతో పైకిలేపేందుకు జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నాడన్నారు. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలవి ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్పాకరంగా, బాధాకరంగా ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదన్నారు. కండకావరంతో కొవ్వెక్కి రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడినా.. తమ నాయకుడు వైఎస్ జగన్ మాత్రం శాంతియుతమైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయాలని తమకు చెప్పారన్నారు. రాధాకృష్ణ నాలుక కోసి.. ఉప్పూకారంతో ఊరగాయ పెడతారు స్త్రీలను దూషిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణను ఏ మహిళ అయినా మెట్టుతో కొట్టదా అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ఆడబిడ్డలైతే రాధాకృష్ణ ఇంటికెళ్లి నాలుక కోసి ఉప్పుకారం వేసి ఊరగాయ పెడతారన్నారు. చంద్రబాబు ఎంతటి నీతిబాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో ప్రజలు గమనించాలని కోరారు. కేవలం వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా అన్నారు. ‘రాధాకృష్ణా.. నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా. నీలా మేం మాట్లాడితే సరిపోతుందా. ఇవే మాటలు నీ భార్య దగ్గర మాట్లాడితే నీ భార్య కూడా నిన్ను చెప్పుతో కొడుతుంది. మేం నీలా మాట్లాడలేం. జర్నలిజం ముసుగులో ఇలాంటి అక్షర వ్యభిచారం చేయొద్దు అని రాధాకృష్ణకు అతడి ఇంట్లోని మహిళలు గడ్డిపెట్టాలి’ అని రాచమల్లు కోరారు. -
జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...
-
పిచ్చి మొక్కలు.. వర్ష్పాలు వస్తే నీళ్లు తోడటం... ఇదే రాజధాని అభివృద్ది...
-
జగన్ మావిగన్.. ఇది కదా అసలైన విజన్
-
MAVIGUN ప్లాన్ భేష్.. వైఎస్ జగన్ పై ఆర్థిక నిపుణుల ప్రశంసలు
-
జగన్ MAVIGUNపై TDP ట్రోల్స్.. ఇచ్చిపడేసిన KS ప్రసాద్
-
మహా నగరాలతో మావిగన్ పోటీ
-
YS జగన్ విజన్ MAVIGUN.. ఇదే జరిగితే దేశంలోనే నెంబర్ 1గా ఏపీ ఎలాగంటే?
-
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ కో విష ప్రచారం చేయడంతో అది అమలు కాలేదు. దీంతో ప్లాన్ బీ కింద మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) 110 కిమీల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ వైఎస్ జగన్ చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలికవసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి మౌలిక వసతులూ లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.రెండు కోట్లు చొప్పున రూ.రెండు లక్షల కోట్లు కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ కోసం వ్యయం చేయడం కంటే అందులో పది శాతం వ్యయంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడేలా ఈ ట్రైసిటీ అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రాంతాలు నగరాలుగా వేగంగా ఏవిధంగా ఎదిగాయో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.ప్లాన్–ఏపై విష ప్రచారంతో ప్లాన్–బీవైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతం ఎలా ఉండాలన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని తలంచారు. మౌలికసదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతి కంటే వేగంగా తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి రాజధానిని రూపుదిద్దాలని భావించారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్ణయంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రంతో తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎన్నికల్లో కుటిలత్వంతో గెలిచి మళ్లీ తన స్వలాభం, కేవలం 29 గ్రామాల పరిధిలో కొందరి ప్రయోజనాల కోసం అమరావతి రాగం అందుకుని మళ్లీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మోసం చేసే మహాపాతకానికి పూనుకున్నారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్–బీగా అన్ని వసతులతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మూడు నగరాల సమాహారంతో అత్యంత వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. ఇది సరైన సమయోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు. వేగంగా పోర్టు సిటీలు అభివృద్ధిదేశంతో పాటు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో పోర్టులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబై నగరాలు పోర్టుల ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. చైనాలో పోర్టు వలన షెన్జెన్ నగరం వేగంగా కీలక గ్రోత్ ఇంజిన్‌గా ఏ విధంగా ఎదిగిందో ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పోర్టు ఉన్న విశాఖ నగరం కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇప్పుడు మావిగన్‌ను రాజధాని కారిడార్‌గా ప్రకటిస్తే అంతకంటే వేగంగా వృద్ధి చెందే సత్తా ఈ ప్రాంతానికి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మచిలీపట్నం వద్ద రూ.5,155.77 కోట్లతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికనగరానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తున్నారు.ఇతర మౌలిక వసతులకు కొదవలేదుఇటు గలగల పారే కృష్ణా నదితోపాటు అటు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతం జలసిరులతో తులతూగుతోంది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్, పోలవరంలోని 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా రాజధానికి కావాల్సినంత విద్యుత్ లభ్యత రానుంది. అదే ఎటువంటి మౌలిక వసతులూ లేని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మావిగన్ కారిడార్‌కు అందులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు.. పదేళ్లలోనే అంతర్జాతీయ మహారాజధానిగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. నాలుగు కార్పొరేషన్లు– 60 లక్షల జనాభామావిగన్ నమూనాలో ఏకంగా నాలుగు కార్పొరేషన్లు , రెండు మున్సిపాల్టీలు ఉండటమే కాకుండా 60 లక్షలకుపైగా జనాభా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్‌గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల మేర రెండు ఆరులైన్ల జాతీయ రహదారులు, విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, గుంటూరులోనూ రైల్వే జంక్షన్, అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం బాగా కలిసొచ్చే అంశమని, అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. మావిగన్‌తో అందరికీ మేలురాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అద్భుతంగా ఉంటుంది. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు మంచి జరుగుతుంది. రాజధానిలో కొందరే భూములు కొనటం, అమ్మడం ద్వారా పేదలకు మేలు కానీ, ఉపాధి కానీ ఉండదు. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గన్నవరం అత్యంత వాస్తవిక ఆలోచనమావిగన్ అనేది అత్యంత వాస్తవిక ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మచిలీపట్నం – విజయవాడ– గుంటూరు మధ్య రాజధాని ఆలోచన అత్యద్భుతం. ఈ మూడు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. కేవలం సీఎం చంద్రబాబు చెబుతున్న దాంట్లో కేవలం పది శాతం పెట్టుబడితో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనంతపురం -
జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి
-
అందరి నోట 'మావిగన్ మాటే'
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. రాజధాని సంగతి దేవుడెరుగు.. 12 ఏళ్లలో కనీసం రోడ్లయినా వేయలేని పరిస్థితులలో రోడ్లు, కరెంటు, నీటివసతి, డ్రైనేజీ లకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడమంటే సాధ్యమయ్యే పనేనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12 ఏళ్లుగా కనీసం రోడ్లు వేయలేకపోవడం, ప్లాట్లు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ జరిగే పనేనా అని జనం చర్చించుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రోడ్లు కూడా లేవు. మరో 20 ఏళ్లలో కూడా పూర్తి చేసే పరిస్థితులు లేవు. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలను కలుపుతూ హైవే ఉంది. ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. కనుక రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేయనక్కరలేదని ఆర్థికవేత్తలంటున్నారు. అందులో 10శాతం చాలు ఈ ప్రాంతాన్ని మహానగరంలా అభివృద్ధి చేయడానికి అని వారు పేర్కొంటున్నారు. అందువల్ల జగన్ ప్రస్తావించిన ప్లాన్ బీ మంచిదే కదా అని ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చేది అప్పులు, వడ్డీలకే చాలడం లేదని చంద్రబాబే చెబుతున్న నేపథ్యంలో రాజధానికి రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పటికి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేయడమంటే భ్రమల్లో ముంచడమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమం ఆగిపోయి ప్రజలు విలవిల్లాడుతున్నారు..సూ్కళ్లు, హాస్పిటల్స్‌ను పట్టించుకునే నాథుడే లేడు. పథకాలన్నీ ఆగిపోయాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణసాధ్యం కాని ఆలోచనలు చేయడం సబబేనా! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది బూటకమే..రాజధాని అమరావతికి తొలి విడత రైతుల నుంచి సమీకరించిన భూమి.. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53,748 ఎకరాలని.. వాటిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దానితో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచే సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వల్లె వేస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవని.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో రైతుల నుంచి 44,676.64 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మరో 50 వేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే 20,494.57 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన, తేవాలని నిర్ణయించిన అప్పులే రూ.47,387 కోట్లు. రాజధానిలో నివాస స్థలం చదరపు గజం రూ.50 వేల చొప్పున పలుకుతోందని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. రాజధాని ప్రధాన ప్రాంతం(కోర్ కేపిటల్ ఏరియా)లో అంటే రాజధాని నడిబొడ్డున.. వెలగపూడిలో సచివాలయం సమీపంలో సర్వే నెంబరు 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను(25 వేల చదరపు గజాలు) కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసి 2025, ఏప్రిల్ 2న మంగళగిరి సబ్ రిజిష్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోనే నివాసం నిర్మిస్తున్నారు. ఈలెక్కన గజం ధర రూ.7,500 చొప్పున కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే ఎకరం ధర రూ.3.63 కోట్లే. దీన్ని బట్టి చూస్తే.. లక్ష ఎకరాల్లో రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఖర్చు చేసే రూ.2 లక్షల కోట్లను వడ్డీతో కలిసి చెల్లించాలంటే ఎన్ని వేల ఎకరాలను విక్రయించాల్సి ఉంటుంది..మహానగరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా అనుకూలం..మచిలీపట్నం వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడ ఆరు వరుసల జాతీయ రహదారి.. విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 20 లక్షలు.. గుంటూరు చుట్టుపక్కల 10 లక్షలు.. మచిలీపట్నం చుట్టుపక్కల 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం. ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్‌ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడటం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని, వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్‌కు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.. (చంద్రబాబు సమీకరించిన భూముల్లో సదుపాయాల కోసం అంచనా వేసిన రూ. 2 లక్షల కోట్లలో ఇది కేవలం 10శాతమే) ఆ పదేళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచిచూడక్కరలేకుండా.. ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు.స్కామ్‌ల కోసం భ్రమలు కల్పిస్తారా?రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాల కాంట్రాక్టు విలువను పరిశీలిస్తే చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకూ చెల్లిస్తున్నారు. పైగా ఇసుక ఉచితం. కూతవేటు దూరంలో పుష్కలంగా ఇసుక దొరుకుతుంది. కానీ.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇసుక కొనుగోలు చేసి.. జీఎస్టీ వంటి పన్నులు చెల్లిస్తూ ఫైవ్ స్టార్ సదుపాయాలతో.. ఇటాలియన్ మార్బుల్స్‌తో చదరపు అడుగు కేవలం రూ.4,500కే నిర్మిస్తున్నారని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ఆరు వరసల జాతీయ రహదారి కిమీకు సగటున రూ.20 కోట్లకు నిర్మిస్తుంటే.. అమరావతిలో అదే రోడ్లకు రూ.53 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణం సమీప భవిష్యత్తులో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా.. ప్రజలకు భ్రమలు కల్పిస్తూ.. స్కామ్‌ల కోసం అమరావతికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చెందడానికే వందేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు సర్కారే చెప్పడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తుండటం గమనార్హం.మావిగన్ ప్రతిపాదన ఓ అద్భుతంరాష్ట్ర రాజధాని ప్రాంతం, దాని అభివృద్ధి విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సూచన అద్భుతం. రాష్ట్ర రాజధాని ప్రాంతం అభివృద్ధిపై కీలక ప్రభావం చూపుతుంది. కనీస వనరులు లేని ప్రాంతంలో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని అభివృద్ధి చేయటం సాధ్యం కాని పని. అదే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ రాజధాని ప్రాంతంగా ఆలోచిస్తే జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉన్న ప్రాంతాలు సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తాయి. రియల్ వ్యాపారం పుంజుకుంటుంది. పోర్టు ద్వారా నిత్యం వస్తు రవాణా సాగుతుంది. ఈప్రాంతానికి తగిన ప్రాధాన్యం దక్కుతుంది. – నర్రా రమేష్‌బాబు, రియల్ వ్యాపారి, కంకిపాడు, కృష్ణాజిల్లాతీర ప్రాంత రాజధానులే మహానగరాలుగా ఎదిగాయిసముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న రాజధాని నగరాలే మెట్రో నగరాలుగా అభివద్ధి చెందాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన విధంగా పలు జాతీయ రహదారుల కలయికతో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మచిలీపట్నంలో ఉన్న నౌకాశ్రయం, విజయవాడ విమానాశ్రయం జాతీయ రహదారులు ఈ ప్రాంతం పెద్ద నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జగన్ ముందుచూపుతో ప్రకటించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా సానుకూలంగా స్పందించి అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. – బందెల డేవిడ్ థామస్ నోబుల్, రైల్వే సలహా మండలి సభ్యుడు, మచిలీటప్నంమావిగన్తో సమన్యాయంరాజధాని లేని రాష్ట్రానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ సమన్యాయం చేస్తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలను కలుపుతూ రాజధానిగా ప్రకటించడం వలన ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేకుండా పరిపాలన సాగించవచ్చు. రాష్ట్రానికి మధ్య ప్రాంతం కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. – జి.శాంతమూర్తి, ఇంటిలెక్చు్యవల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరురాష్ట్రానికి సరైన రాజధాని మావిగన్మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ జాతీయ రహదారితో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఉండటంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రాజధానికి భూములు ఇచ్చి, తీవ్ర నిర్వేదంతో ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరం. ప్రతిపాదిత మావిగన్‌ను రాజధానిగా విస్తరించేందుకు లక్షల కోట్ల నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు, గుంటూరు -
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్‌ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
‘అసెంబ్లీలో చంద్రబాబు తుగ్లక్ తీర్మానం చేశారు’
హైదరాబాద్: అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తుగ్లక్ తీర్మానం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిభ్రమించే అమరావతి రాజధాని బిల్లును శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 2వ తేదీ) హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి మీడియాతో మాట్లాడారు ఎస్వీ సతీష్‌రెడ్డి. ‘అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. అమరావతిపై మండలిలో చంద్రబాబు ఎందుకు తీర్మానం పెట్టలేదో చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు ఎందుకు హైప్ చూపిస్తున్నారో చెప్పాలి. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది.అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు ఏం అవసరం ఉంది. తెలంగాణ సచివాలయం కట్టడానికి రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కమీషన్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పనులు చేయిస్తున్నారు. అమరావతి, పోలవరంను చంద్రబాబు, లోకేష్ ఏటీఎంల వాడుతున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 సంవత్సరాల్లో అమరావతి నుంచి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. చంద్రబాబుకు దమ్ము ధైర్మం ఉంటే ఆల్ పార్టీ సమావేశం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు..అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీ, అవినీతికే తాము వ్యతిరేకమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సతీష్‌రెడ్డి. ‘చంద్రబాబు పిలుస్తున్న టెండర్లలో పారదర్శకత లేదు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తే చూస్తూ ఊరుకోం. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండటం లేదో చెప్పాలి?, అమరావతిలో చంద్రబాబు చేసే దోపిడీకి వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్(MAVIGUN)పై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. -
‘వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్‌లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు...వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది...అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్‌రెడ్డి దుయ్యబట్టారు. -
భ్రమలు కల్పిస్తూ.. రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నావ్
ఆచరణాత్మక ఆలోచన.. మావిగన్చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు. ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్‌గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి రెండు అక్షరాలు ఎంఏ, విజయవాడలోంచి తొలి రెండు అక్షరాలు వీఐ, గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకుని ‘మావిగన్’ (MAVIGUN) అని పేరుపెట్టండి. గన్ అంటే బాగుండదు.. జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేకానీ రూ.2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఎంత వరకు కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు (మానస పుత్రిక) అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? చంద్రబాబు డబ్బా కొట్టినట్టు అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయ్యిందా? ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి అదిగో.. ఇదే అమరావతి అంటారు. ఇప్పుడు అమరావతి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయా?కనీసం భూములు ఇచ్చిన రైతులకు హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి సౌకర్యాల కల్పనకు ఎకరానికి కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. ఇలా అమరావతి బడ్జెట్‌ను ఎందుకు పెంచాల్సి వస్తోంది? నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంత సుదీర్ఘ సమయంలో రూ.2 లక్షల కోట్ల వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది.భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మార్చలేరా? చట్టాలు చేసిన తర్వాత చట్ట సవరణలు చేయలేరా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, తన అవినీతిని కప్పిపుచ్చుకునే డ్రామా చేస్తున్నారు.2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇక్కడ కాపురం పెట్టారా? ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయి? 2019 వరకు హైదరాబాద్‌కు షటిల్ సర్వీసు చేశారు. ఒకవైపు సీఎంగా ఉంటూ హైదరాబాద్‌కు వెళ్లి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా 2024 ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్ మొత్తం హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు అక్కడే. అదీ చంద్రబాబు తీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకైతే వారానికి నాలుగు రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ ఎప్పుడుంటాడో తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం. మమ్మల్ని తిట్టడానికే అసెంబ్లీ. నిజానికి మా ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేసేవి. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు తన స్కామ్‌ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానిది.. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి క్యాపిటల్(రాజధాని)ను సీఎం చంద్రబాబు దేశంలో అతి పెద్ద స్కామ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్‌ల రాజధాని అని అభివర్ణించారు. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రాజధానికి చట్టబద్ధత పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించి నాణానికి రెండో పార్శ్వాన్ని సాక్ష్యాధారాలతో ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 12 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం రూ.8 వేల కోట్లే రాజధాని కోసం ఖర్చు చేశారని.. ఈ లెక్కన కనీస సదుపాయాలు కల్పించడానికే దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పుటికి ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతోందో.. లేక రూ.10 లక్షల కోట్లకు చేరుతుందో అన్నారు. అప్పు తెచ్చిన నిధులు.. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు ఒక్క అమరావతికే ఖర్చు పెడితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని, ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, మంచి మాటేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో.. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వివరించారు. సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం మేం ప్రతిపాదించిన ప్లాన్ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు బట్టబయలవుతాయని.. దేవుడు, ప్రజలు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అప్పుడు బెస్ట్ కేపిటల్.. ఇప్పుడు మున్సిపాలిటీనా? ⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన (బెస్ట్), బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్‌ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ అని ఊదరగొట్టిన వ్యక్తి, ఈ రోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలు కావాలని చెప్పడం స్కాములు చేయడానికే!⇒ ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది. వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పారా చంద్రబాబు? ఐదున్నర గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో వీటికి సమాధానం చెప్పలేదు. ⇒ కేవలం జగన్‌ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరుతో పట్టపగలు చేస్తున్న దోపిడీపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు డ్రామా చేశారు. ఒకవైపు అసెంబ్లీని పిలుస్తారు.. మరోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్(శాసనమండలి)ను పిలవరు. కౌన్సిల్‌ను పిలిస్తే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని మా సభ్యులు బయట పెడతారని, చంద్రబాబు బండారాన్ని కడిగి పారేస్తారని భయం.రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం డ్రామా⇒ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నిజాయితీ లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే కేవలం దోపిడీ, అవినీతి చేయడమే. రకరకాలుగా దోపిడీ కోసం డ్రామా చేస్తాడు. విజన్, సంపద సృష్టి అంటాడు. కొత్త కొత్త పేర్లతో డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించి స్కాము(కుంభకోణం)లతో దోచేస్తున్నారు. అమరావతిలో గత వారం శాసనసభ తీర్మానం డ్రామాలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి.⇒ వాస్తవానికి రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాజధానిపై ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొంది.⇒ మన కళ్ల ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది. ఎందుకీ డ్రామా? రాజధానిపై రాష్ట్రాలకే హక్కు ఉన్నప్పుడు చంద్రబాబు డ్రామా చేస్తూ రైతులను, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.స్కాముల కోసం చట్ట సభలనూ వదలట్లేదు⇒ చంద్రబాబు హైకోర్టు, అసెంబ్లీని కూడా స్కాముల కోసం వదలట్లేదు. దుబారా, విచ్చలవిడి దోపిడీ కోసం చట్టసభలను వాడేస్తున్నారు. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు పరిమితం చేయలేదు. ఏ పని చూసినా దోపిడీ కనిపిస్తోంది. రోడ్లు, మురుగు నీటి కాలువలు, సీవరేజీ ప్లాంట్, కొండవీటి వాగు వరద మళ్లింపు, లే అవుట్ డెవలప్మెంట్, అర్కిటెక్చర్ డిజైన్ల ఫీజుల్లో అవినీతికి పాల్పడ్డారు.రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?⇒ రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్లు కాకుండా భవనాల నిర్మాణానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్క అమరావతిలో కేవలం మౌలిక వసతులకే ఇంత ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై అప్పులు తెచ్చి.. స్కాములు చేయడంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.⇒ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు, హాస్పిటళ్లను పట్టించుకునే నాథుడు లేదు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాదితో కలిపితే రూ.10 వేల కోట్లు అవసరం అయితే బడ్జెట్లో విదిల్చింది స్వల్పమే. ప్రభుత్వంపై నెట్వర్క్ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం నిలిపివేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్‌ను పట్టించుకోవట్లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను నిలిపేశారు.⇒ మా హయాంలోని పథకాలు రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే కార్యక్రమాలన్నీ గతించాయి. చివరికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు మోసాలుగా తేలాయి. ఉద్యోగులకు రూ.36 వేల కోట్లు బకాయిలున్నాయి. చంద్రబాబు తన జీవితాంతం అమరావతిలోనే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రెయిన్లు కడతారా? వాటిని కట్టడానికి జీవితాంతం అప్పులు చేస్తారా? అంత వరకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఇవన్నీ అడుగుతామనే అసెంబ్లీలో తీర్మానం అంటూ కౌన్సిల్‌ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్టు డ్రామాలు చేశారు. నాయకులుగా ఆచరణాత్మక ఆలోచన చేయాల్సిన ధర్మం మనపై ఉంది. అంతేగానీ స్కాములకు స్టాంపు వేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు.ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లే!⇒ వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఈ ప్రాంతానికే కాదు.. ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే అమరావతిలో ఒక ఎకరా అభివృద్ధికి (రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి వసతి) మాత్రమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక భవనాల ఖర్చు అదనం. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికే దిక్కులేదు. రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.⇒ చంద్రబాబు 12 ఏళ్ల కిందట చెప్పిన లెక్క ప్రకారం రాజధానిలో లక్ష ఎకరాల్లో సాధారణ మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.2 లక్షల కోట్లు రూ.4 లక్షల కోట్లు అవుతుందో.. రూ.10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు.⇒ విడిపోయిన రాష్ట్రానికి ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? 2014–19 మధ్య కేవలం రూ.5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అప్పుల ద్వారా తెచ్చిందే. ఈ రెండేళ్లలో ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ (మొత్తం చేసిన, చేయడానికి నిర్ణయించిన) అప్పులు రూ.47 వేల కోట్లు. ఇందులో డ్రా చేసింది రూ.13 వేల కోట్లు. వీటిల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చింది రూ.5,500 కోట్లు. ఇక్కడ 10 శాతం అడ్వాన్సులుగా ఇవ్వడం.. అందులో 8 శాతం కమీషన్లు తీసుకోవడం.⇒ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు పెట్టారు. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం కిలోమీటరుకు రూ.170 కోట్లు పెడుతున్నారు. మా హయాంలో బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లైవర్ పూర్తిగా నిర్మించాం. దీనికి కిలోమీటరకు రూ.35 కోట్లు ఖర్చు అయ్యింది. చంద్రబాబు ఏమైనా బంగారు బిస్కెట్లు పెట్టి కడుతున్నారా?⇒ అమరావతిలో మిగిలిపోయిన ఆరు లేన్ల రోడ్లు వేయడానికి కిలోమీటర్‌కు రూ.53 కోట్లు వెచ్చిస్తున్నారు. అదే జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరుకు రూ.20 కోట్లు సగటు ఖర్చు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ఎదురుదాడి చేసి అమరావతికి వ్యతిరేకం అంటారు.⇒ మా హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. పని చేసి బిల్లు పెడితే డబ్బులిచ్చాం. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మార్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చారు. ముందే డబ్బులిచ్చి అందులో కమీషన్లు ఎత్తేస్తున్నారు. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. మరో రూ.960 కోట్లు దారి మళ్లించారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది రూ.2,500 కోట్లు, రూ,5,335 కోట్లు. మొత్తంగా దాదాపు రూ.8 వేల కోట్లు మాత్రమే. కేవలం రోడ్లు, కరెంట్, నీళ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట ఇప్పటి వరకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలింది ఎప్పటికి చేస్తారు?⇒ అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లీడర్లుగా ఉంటూ స్కాముల కోసం.. సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు అవసరం అని తెలిసినా, అసాధ్యమని కళ్లముందే కనిపిస్తున్నా.. రైతులను, ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు అప్పులు తెచ్చి, అమరావతి పేరు చెప్పి.. స్కాములు చేసి దోచేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ దోపిడీ డైవర్షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పేరుతో డ్రామాలు చేశారు.రాజధాని అమరావతి నిర్మాణాలకు అనూహ్యంగా రేట్లు పెంచడంపై ది హిందూ పత్రికలో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ జగన్ 2018లో ఇచ్చిన వాళ్లకే ఇప్పుడు మళ్లీ పనులు⇒ రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో.. 2024లో ఆ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ ఆ పనులకు టెండర్లు నిర్వహించి.. అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్లలో చంద్రబాబు గూడుపుఠాణి, మాఫియా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి, మళ్లీ రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్లీ పాత వాళ్లకే కట్టబెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్‌కు ఇసుక ఫ్రీ, కరెంటు చార్జీల్లో రాయితీలు, జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ మినహాయింపులు అన్నీ ఇస్తున్నా సరే చదరపు అడుగుకు ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?⇒ కేపిటల్‌గా అమరావతి రియాల్టీ సంగతి పక్కన పెడితే.. దేశంలో అతిపెద్ద స్కాముకు చంద్రబాబు నిజంగా కేపిటల్‌గా మార్చేశారు. ఇక్కడ వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్) అవినీతి సాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన రెసిడెన్షియల్ ప్లాట్స్ చదరపు అడుగుకు రూ.4,500 మించట్లేదు. ఇందులో ఇసుక ఉచితం లేదు.. ఎటువంటి రాయితీలు లేవు. కానీ, రాజధానిలో అన్ని రకాల రాయితీలు ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తున్నారు.⇒ అమరావతిలో చంద్రబాబు సాగిస్తున్న దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు. సచివాలయంలో టవర్–1, 2లకు బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో ఖరారు చేసిన కాంట్రాక్టు విలువ రూ.932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ రూ.1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో పెంచిన రేటుకు 4.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్‌కు నజరానా రూపంలో జీఎస్టీ, పన్నుల వంటి మినహాయింపుల ద్వారా రూ.257 కోట్లు లబ్ధి. మొత్తంగా రెండు టవర్ల నిర్మాణ వ్యయం రూ.1,762 కోట్లకు చేరింది. గతంలో కంటే ఏకంగా రూ.830 కోట్లు పెరిగింది. పైగా అçప్పటి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీనే ఇప్పుడు పనులు చేసేది.⇒ ఇక టవర్ 3, 4 పనులను 2018లో రూ.784 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.1,247 కోట్లకు పెంచేశారు. దానిపై మళ్లీ 4.5 శాతం అదనంగా కాంట్రాక్టర్‌కు ఇస్తున్నారు. రాయితీలు మరో రూ.241 కోట్లు. మొత్తంగా చూస్తే రూ.1,545 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ ఎల్అండ్టీ. ఇప్పుడూ వాళ్లే. ఈ పనులు అన్నింటికీ ఇసుక ఫ్రీ.⇒ జీఏడీ టవర్ చూస్తే బేస్మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 49 అంతస్తుల నిర్మాణానికి 2018లో రూ.554 కోట్లు కాంట్రాక్టు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.844 కోట్లకు పెంచేశారు. ఆ పెంచిన టెండర్ల రేటుపై 4.53 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. రాయితీల రూపంలో మరో రూ.163 కోట్లు లబ్ధి. మొత్తం రూ.1,046 కోట్లకు చేరింది. అప్పుడు కాంట్రాక్టర్ ఎన్సీసీ. ఇప్పుడూ వాళ్లే.⇒ ఈ ఐదు టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఇస్తే.. మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లిఫ్టులు, ఫైర్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అన్నీ కలుపుకుంటే ఐదు టవర్లకు రూ.6,671 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్‌లో మౌలిక వసతుల (డ్రెయినేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) కోసం రూ.1,053 కోట్లు చెల్లిస్తోంది. ఎక్కడైనా ప్లాట్లు కట్టే సమయంలో ఇవన్నీ అందిస్తేనే ప్రజలు అందులో చేరతారు. ఇక్కడ కాంట్రాక్ట్ విలువ కంటే వీటికి అదనంగా ఖర్చు చేస్తున్నారు.⇒ దీని బిల్డప్ ఏరియా 52.20 లక్షల ఎస్ఎఫ్టీ. అంటే ఎస్ఎఫ్టీకి రూ.14,795 ఖర్చు చేసింది. ఇందులో అదనపు మౌలిక వసుతులు తీసేస్తే ఎస్ఎఫ్టీకి రూ.12,779 అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అన్నీ కలుపుకుని ఎస్ఎఫ్టీ రూ.4,500కు చేస్తుంటే ఇక్కడ రూ.వందల కోట్ల మినహాయింపులు, ఇసుక ఉచితంగా ఇచ్చినా నిర్మాణాలకు రూ.14 వేల కోట్లకుపైగా అవుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.⇒ ఒకవైపు ఇంత డబ్బులు ఖర్చు చేసి టవర్లు కడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో రూ.1,100 కోట్లు వృథా చేశారు. అవి ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ డబ్బులన్నీ గంగలో పోసినట్టే కదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 10 లక్షల ఎస్ఎఫ్టీలో రూ.615 కోట్లతో సచివాలయం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.970 కోట్లు మాత్రమే అయ్యింది. అందులో 1,272 మంది కూర్చునేలా కట్టారు. పార్లమెంట్‌ను దేశం మొత్తం చూస్తోంది. ఆ స్థాయిలో వాళ్లు కడితే.. ఇప్పుడు కట్టే మన అసెంబ్లీ రూ.1,449 కోట్లు అవుతుంది. అంటే, పార్లమెంట్‌ను దాటేశాం.. కేసీఆర్ నంబర్‌కు డబుల్ చేసేశాం. ఇక హైకోర్టు కోసం మరో రూ.1,480 కోట్లు. ఐదు టవర్లు కాకుండా ఈ రెండూ అదనంగా కట్టేవి.


