బీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఈ దాడితో రెండ్రోజుల వ్యవధిలో సుమారు 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేక కథనాల్ని ప్రసారం చేస్తున్నారనే నెపంతో లెబనాన్ టీవీ ఛానెల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడి చేసింది.ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దళాల మధ్య వైమానిక దాడులపై మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ టీవీ ఛానల్ న్యూస్ రూమ్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్‌పై అప్పటికే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. న్యూస్ రూమ్‌లో న్యూస్ ప్రసారం చేస్తున్న మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ టీవీ ఛానల్ ఎడిటర్–ఇన్–చీఫ్ జర్నలిస్ట్ ఫాది బౌడియాపై రాకెట్ దాడి చేసింది. ఫాది బౌడియా ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన వెనుక నుంచి రాకెట్ దూసుకొచ్చింది. ఈ దాడిలో బౌడియాకు తీవ్ర గాయాలయ్యాయి.
ఫుటేజీలో, బౌడియా పేలుడు తీవ్రతతో అరుస్తూ.. హాహాకారాలు వ్యక్తం చేస్తూ ప్రాణ భయంతో భీతిల్లిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. పేలుడు కారణంగా అతనికి గాయాలైనట్లు నివేదికలు ధృవీకరించాయి.
A video shows journalist Fadi Boudiya being thrown off balance while he was live on air in Lebanon.
Boudiya is the editor-in-chief of Miraya International Network and has reportedly been injured in the attack.
Video Credit: @eye.on.palestine#thecurrent #lebanon pic.twitter.com/YdHQNoyxk9— The Current (@TheCurrentPK) September 24, 2024
చదవండి : హిబ్జుల్లా కమాండర్ హతం
Comments
Please login to add a commentAdd a comment