
లండన్: సామాజిక మాధ్యమ దిగ్గజమయిన ఫేస్‌బుక్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆర్కిమెడిస్ సంస్థను బ్యాన్ చేసింది. ఆర్కిమెడిస్‌కు చెందిన 256 ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌లను తొలగించామని ఫేస్‌బుక్ బుధవారం ప్రకటించింది. కొన్ని పార్టీలను ఎన్నికల్లో గెలిపించేందుకు ఈ గ్రూప్ పెద్ద ఎత్తున నిర్వహించిన అసత్య ప్రచారం, ఫేస్‌బుక్ పాలసీను లెక్కచేయక పోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. అయితే, ఆర్కిమెడిస్ సంస్థ నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు.
2016 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రదర్శించిన వైఖరి కారణంగా ఫేస్‌బుక్ సర్వత్రా విమర్శలపాలైంది. ఆ తర్వాత నుంచి ఎన్నికల్లో జరిగే ధోరణులపై విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించే క్రమంలో తప్పుడు సమాచారాన్ని షేర్ చేయకుండా ఫేస్‌బుక్ జాగ్రత్తలు తీసుకోంటుంది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ తన దృష్టిని లాటిన్ అమెరికాతోపాటు పలు ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయ ఆసియాలపై కేంద్రీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment