కీవ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై ఉక్రెయిన్‌కు లాభమా? అనే ప్రశ్నకు వోలోడియర్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో తాను ట్రంప్‌తో మాట్లాడినట్టు జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నవంబర్‌లో ఎన్నికల తర్వాత చూడాలి అని అన్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నపై జెలెన్ స్కీ స్పందించారు. అనంతరం, జెలెన్ స్కీ మాట్లాడుతూ.. అమెరికాలో నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తర్వాత దీనిపై ఆలోచిస్తాం. అయితే, ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి ట్రంప్ టీమ్ నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.
కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న యుద్ధ సమయంలో ట్రంప్ బృందంతో నేను ఫోన్‌లో మాట్లాడాను. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నాము. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని ఆ సమయంలో కోరాము. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందనే సందేశం ఇచ్చారు. యుద్ధాన్ని ఆపడానికి మరియు ఉక్రెయిన్ స్వతంత్రంగా, యూరోపియన్ దేశంగా ఉండటానికి ప్రయత్నిస్తామని అన్నారని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ టీమ్ మాత్రమే ఇలా చెప్పిందని గుర్తు చేశారు.
మరోవైపు.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన జెలెన్ స్కీ తెలిపారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్‌కు నూతనంగా మిలటరీ సాయం అందిస్తామని జో బైడెన్ భరోసా ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు నూతన సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నా అంటూ బైడెన్ ప్రకటించడం విశేషం. ఆ సాయం విలువ రూ.వెయ్యి కోట్లు ఉంటుందని తెలిపిన పెంటగాన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment