ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం, వెనక్కి తగ్గని దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ, భారత ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్ చారిత్రక పర్యటన... ఇవి మాత్రమే మనకు కనిపించే దృశ్యాలు. యుద్ధ ప్రభావం దేశంపై సరే, కుటుంబంపై ఎలా ఉంటుంది? వైవాహిక జీవితంపై ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది ఉక్రెయిన్ ప్రథమ మహిళ, జెలెన్‌స్కీ భార్య ఒలెనా...
భర్త క్షేమంగా ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. భర్తను ఏ రోజు మృత్యువు కాటేస్తుందో అనే భయం మాత్రం భార్యకు క్షణ క్షణం నరకాన్ని చూపిస్తుంది. అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొని తట్టుకొని గట్టిగా నిలబడించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనా. ఉక్రెయిన్ భూభాగంలో గత రెండున్నర సంవత్సరాల యుద్ధ విషాదాలలో, జీవన్మరణ సమయాలలో వారి వివాహ బంధం పేకమేడలా కుప్పకూలి ΄ోవాల్సిన పరిస్థితి.
‘ఈ యుద్ధం మీ వివాహబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందా?’ అని అడిగిన ప్రశ్నకు ఒలెనా జెలెన్‌స్కీ చెప్పిన సమాధానం...‘రెండు దశాబ్దాల మా వివాహ బంధం గతంతో ΄ోలిస్తే మరింత దృఢమైంది. ఒకరికి ఒకరు అండగా నిలబడ్డాం’ అన్నది.
‘యుద్ధప్రభావం కుటుంబ జీవితంపై ఉంటుందా?’ అని అడిగిన ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంటుంది’ అని చెప్పింది ఒలెనా.
యుద్ధ ఉద్రిక్తతల వల్ల గతంలో మాదిరిగా వారు తీరిగ్గా మాట్లాడుకునే రోజులు ΄ోయాయి. తన కుమార్తె ఒలెంక్సాండ్రా, కుమారుడు కైరీలోతో ΄ాటు ఒలెనా తన భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
‘ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదు. మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఒక్కటే సరి΄ోదు. విశ్వాసం ముఖ్యం. నేను నా భర్త నిజాయితీని విశ్వసించక΄ోతే అ΄ారమైన ప్రేమ పంచినప్పటికీ అది వృథా అవుతుంది’ అంటుంది ఒలెనా.
‘యుద్ధంలో మునిగితేలుతున్న దేశంలో ఏ వ్యక్తి అయినా సాధారణ జీవితం గడపలేరు. నిరంతరం మానసిక ఒత్తిడి అనేది సాధారణం’ అంటుంది.
గత నెలలో కీవ్ శివార్లలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. తన సొంత పిల్లలపైనే దాడి జరిగినట్లు తల్లడిల్లి ΄ోయింది ఒలెనా.
‘యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ అలిసి΄ోతారు. మిణుకు మిణుకుమనే ఆశ ఉజ్వలంగా వెలగాలనుకుంటారు. అయితే దీనికి ఎంతో సాహసం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కావాలి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా రాక్షసంగా దాడులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుందేమిటి? అని నా భర్త ముందు ఎప్పుడూ కళ్లనీళ్లు పెట్టుకోలేదు. న్యాయం జయిస్తుంది అన్నట్లే మాట్లాడాను’ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటుంది ఒలెనా.
ఒలెనాకు తన దేశ పౌరుల ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెప్పడం అంటే ఇష్టం.
ధైర్యం మంచిదేగానీ అన్నిసార్లూ కాక΄ోవచ్చు. ప్రమాదపు ఊబిలో దించవచ్చు. తిరుగులేని ధైర్యంతో ముందుకు వెళ్లిన జెలెన్‌స్కీపై ఎన్నోసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో ఒలెనా మానసిక పరిస్థితి మాటలకందనిది. అయినా సరే, ప్రతికూల ఆలోచనలపై దృష్టి పెట్టేది కాదు. ‘అంతా మంచే జరుగుతుంది. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ఒకటికి పదిసార్లు అనుకునేది.
‘నిర్మొహమాటంగా చె΄్పాలంటే నా భర్త ధైర్యసాహసాలను చూసి నేను గర్విస్తున్నాను’ అంటుంది ఒలెనా.
యుద్ధ విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఒలెనా... ‘యుద్ధంలో మనం అత్యంత విలువైన వాటిని కోల్పోతాం’ అంటుంది.
అయితే ఆమె కోల్పోనిది మాత్రం ధైర్యం. తన కుటుంబానికే కాదు దేశ ప్రథమ మహిళగా తనకు ఆ ధైర్యం ఎంతో ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment