లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ తీవ్ర ప్రాణ, నష్టాన్ని చవిచూస్తోంది. మరోవైపు.. చాలా దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ను బ్రిటన్ భారీ సాయాన్ని అందించినున్నట్టు స్పష్టం చేసింది.
కాగా, రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు 10,000 డ్రోన్లు అందిస్తామని బ్రిటన్ తెలిపింది. అయితే, బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో డ్రోన్ల కోసం ఉక్రెయిన్‌కు 256 మిలియన్ డాలర్ల ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది. దానికి అదనంగా మరో 160 మిలియన్ డాలర్లను ఈ డ్రోన్ల కోసం కేటాయించారు.
🇬🇧#Britain is set to provide over 10,000 drones to #Ukraine, as reported by European Pravda, citing British Defense Secretary Grant #Shapps.
— KyivPost (@KyivPost) March 7, 2024
During his visit to Kyiv, he announced that the UK will allocate £325 million to acquire more than 10,000 drones for of Ukraine.
📷: AFP pic.twitter.com/hhL1smfiVz
ఈ ఆయుధ ప్యాకేజీలో 1,000 కమికేజ్ (వన్‌వే అటాక్) డ్రోన్లు ఉండనున్నాయి. ఇవి నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలవు. యూకే అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు నల్ల సముద్రంలో రష్యా నౌకాదళంపై సమర్థంగా దాడి చేస్తున్నట్లు షాప్స్ ఈ సందర్భంగా తెలిపారు. కొద్దిరోజులుగా రష్యా నౌకాదళంపై అనూహ్య దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సైతం నల్లసముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సముద్ర డోన్లు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో అది తీవ్రంగా దెబ్బతింది.
Comments
Please login to add a commentAdd a comment