ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. | PM Modi Arrives In Ukraine To Hold Delegation Level Talks With Volodymyr Zelensky, Tour Updates In Telugu | Sakshi
Sakshi News home page

PM Modi Ukraine Visit Updates: ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన..

Published Fri, Aug 23 2024 12:58 PM | Last Updated on Fri, Aug 23 2024 1:27 PM

PM Modi Arrives In Ukraine Tour Updates

కీవ్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్నారు. రష్యా సేనల దాడిలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత్‌ ఏ పక్షం వహించదని.. కేవలం శాంతికి మాత్రం వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టినట్టు తెలిపారు.

కాగా, ప్రధాని మోదీ.. పోలండ్‌లో గురువారం పర్యటన ముగించుకుని రైలు మార్గంలో ఉక్రెయిన్‌కు బయల్దేరారు. ఆయన దాదాపు 10 గంటలు ప్రయాణించి కీవ్‌కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌ నుంచి ఆయన కాన్వాయ్‌ బయల్దేరి బస చేయనున్న ప్రదేశానికి వెళ్లింది. కీవ్‌లోని భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్‌ వద్ద మోదీకి భారత జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లోని ఇస్కాన్‌ బృంద సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. ఇక, ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచారు.

ఇదిలా ఉండగా.. దాదాపు ఏడు గంటలపాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా నేడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ భేటీ కానున్నారు. స్థానిక ఏవీ ఫొమిన్‌ బొటానికల్‌ గార్డెన్‌లోని మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రధాని నివాళి అర్పించనున్నారు. ఇక, 1991లో సోవియట్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. కాగా, ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్‌స్కీ భేటీ అయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement