అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదే పదే అవే పొరపాట్లు చేస్తూ మీడియాకు చిక్కుతున్నాడు. పాపం వృద్ధాప్యం కారణంగానే ఇలా జరుగుతున్నప్పటికీ.. ఆయన తీరుపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ అంతర్ఝాతీయ వేదికపైనా ఆయన నోరు జారి కెమెరా కంటికి చిక్కారు.
బుధవారం లుథియానా విల్నియస్‌లో నాటో సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ టంగ్ స్లిప్ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr).. పేరును ఉచ్ఛరించబోయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir..) అనబోయారు. వెంటనే తన పొరపాటును గుర్తించి సవరించుకున్న ఆయన.. ఆ తర్వాతి లైన్‌లో సరైన మాటే అనేశారు. ఆ టైంలో పక్కనే జెలెన్‌స్కీ కూడా ఉండడం గమనార్హం.
🚨🌎 Biden calls ‘Zelensky’ - VLADIMIR 🤡🚨
— Concerned Citizen (@cotupacs) July 12, 2023
Simply unbelievable. pic.twitter.com/Iqo2omXIrj
Vladimir.. Volodymyr వేర్వేరుగా కనిపించే దగ్గరి పదాలే. ఈ రెండింటికీనూ ‘ప్రపంచాధినేత.. శాంతి పాలకుడు’ అనే ద్వంద్వార్థాలు ఉండడం గమనార్హం. బహుశా ఆ కన్ఫ్యూజన్‌లోనే ఆయన అలా అని ఉంటారు. అయినప్పటికీ.. బైడెన్ వైరల్ అవుతుండడంతో ‘పాపం జెలెన్‌స్కీ’ అనుకుంటున్నారంతా.
ఇదిలా ఉంటే.. బైడెన్ కెమెరా సాక్షిగా ఇంతకు ముందు ఎన్నో తప్పిదాలు చేశారు. ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే తొలిసారేం కాదు. ‘‘పుతిన్ కీవ్‌ను యుద్ధ ట్యాంకర్లతో చుట్టుముట్టొచ్చు. కానీ, ఇరాన్ ప్రజల జీవితాల్ని మసనబార్చలేరంటూ పొంతన లేకుండా మాట్లాడి విమర్శల పాలయ్యారు. ఇక పోయిన నెలలో అయితే పుతిన్ ఇరాక్ యుద్ధంలో(ఉక్రెయిన్ యుద్ధం అనబోయి..) ఓడిపోయాడంటూ ప్రకటించి అందరినీ నోర్లువెళ్లబెట్టేలా చేశాడాయన.
🚨 Biden calls Zelensky ‘Vladimir’ during NATO remarks pic.twitter.com/hsNXZOvJXt
— Trending News (@Trendings911) July 13, 2023
Comments
Please login to add a commentAdd a comment