48 గంటల్లో నాలుగు దేశాలు
సైనిక, ఆర్థిక సాయం కోసం జెలెన్‌స్కీ సుడిగాలి పర్యటన
ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే మద్దతు దూరమవుతుందని భయం
లండన్: ఒక వైపు రష్యా సేనల ఆక్రమణ పర్వం కొనసాగుతుండటం, మరో వైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మద్దతు దూర మవుతుందనే భయాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరప్ దేశాల్లో సుడి గాలి పర్యటన చేపట్టారు. 48 గంటల వ్యవధి లోనే లండన్, పారిస్, రోమ్, బెర్లిన్‌లను చు ట్టేశారు.
తన వద్ద ఉన్న ‘విక్టరీ ప్లాన్’పై బ్రిట న్ ప్రధాని స్టార్మర్ సహా ఆయా దేశాధినే తలకు వివరించారు. మిత్ర దేశాల నుంచి అందే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యాలోని సు దూరంలో ఉండే మిలటరీ లక్ష్యాలకు నష్టం కలిగించడం.. తద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాను ఇరుకునపెట్టడం జెలెన్‌స్కీ ‘విక్టరీ ప్లాన్’లక్ష్యం. అయితే, బ్రిటన్ మాత్రమే తన వద్ద ఉన్న స్టార్మ్ షాడో దీర్ఘ శ్రేణి క్షిపణులను అందజేయడానికి సంసిద్ధత తెలిపింది.
అమెరికా, జర్మనీ సహా ఇతర మి త్ర దేశాలు మాత్రం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు ఇవ్వడమంటే రష్యాతో ముఖా ముఖి యుద్ధానికి దిగడమనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధంలో గెలుపును సొంతం చేసుకోవడం ఇప్పటివరకు జరగలేదని కూడా బ్రిటన్ అధికారులు అంటున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు సమకూర్చడంపై చర్చించామని నాటో చీఫ్ మార్క్ రుట్ వెల్లడించారు. అయితే, అంతిమ నిర్ణయాన్ని ఆయా సభ్యదేశాలకే వదిలివేశామన్నారు. దీంతోపాటు, శనివారం బెర్లిన్‌లో జరగాల్సిన ఉక్రెయిన్ మిత్రదేశాల సమావేశం వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశంలో మిల్టన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment