Not support
-
Russia-Ukraine war: లండన్, పారిస్, రోమ్, బెర్లిన్..!
లండన్: ఒక వైపు రష్యా సేనల ఆక్రమణ పర్వం కొనసాగుతుండటం, మరో వైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మద్దతు దూర మవుతుందనే భయాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరప్ దేశాల్లో సుడి గాలి పర్యటన చేపట్టారు. 48 గంటల వ్యవధి లోనే లండన్, పారిస్, రోమ్, బెర్లిన్లను చు ట్టేశారు. తన వద్ద ఉన్న ‘విక్టరీ ప్లాన్’పై బ్రిట న్ ప్రధాని స్టార్మర్ సహా ఆయా దేశాధినే తలకు వివరించారు. మిత్ర దేశాల నుంచి అందే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యాలోని సు దూరంలో ఉండే మిలటరీ లక్ష్యాలకు నష్టం కలిగించడం.. తద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాను ఇరుకునపెట్టడం జెలెన్స్కీ ‘విక్టరీ ప్లాన్’లక్ష్యం. అయితే, బ్రిటన్ మాత్రమే తన వద్ద ఉన్న స్టార్మ్ షాడో దీర్ఘ శ్రేణి క్షిపణులను అందజేయడానికి సంసిద్ధత తెలిపింది. అమెరికా, జర్మనీ సహా ఇతర మి త్ర దేశాలు మాత్రం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు ఇవ్వడమంటే రష్యాతో ముఖా ముఖి యుద్ధానికి దిగడమనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధంలో గెలుపును సొంతం చేసుకోవడం ఇప్పటివరకు జరగలేదని కూడా బ్రిటన్ అధికారులు అంటున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు సమకూర్చడంపై చర్చించామని నాటో చీఫ్ మార్క్ రుట్ వెల్లడించారు. అయితే, అంతిమ నిర్ణయాన్ని ఆయా సభ్యదేశాలకే వదిలివేశామన్నారు. దీంతోపాటు, శనివారం బెర్లిన్‌లో జరగాల్సిన ఉక్రెయిన్ మిత్రదేశాల సమావేశం వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశంలో మిల్టన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. -
ఏడాది పూర్తయినా ఇంకా పోరాటమే...
వాషింగ్టన్: అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఆమె వ్యవహారదక్షతపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడితో ఆమె సఖ్యతపై ప్రశ్నలు ఓవైపు, ఉపాధ్యక్ష పదవికి సరైన పరిశీలన లేకుండానే ఎంపిక చేశారన్న ప్రత్యర్థుల ఆరోపణలు మరోవైపు.. శ్వేతసౌధం నుంచి సరైన మద్దతు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్ల మధ్య ఆమె ఏడాది పాలన సాగింది. సాధారణ రోజుల్లోనే ఉపాధ్యక్ష బాధ్యతలో రాణించడం చాలా కష్టం... కరోనా మహమ్మారి సమయంలో అది మరింత సంక్లిష్టంగా మారింది. అధ్యక్షుడికి అంతర్గతంగా సలహాలు, సూచనలు ఎన్ని చేసినా, రోజువారీ ఘటనలపై ఆమె స్పందనపై విమర్శలొస్తున్నాయి. ఓటింగ్ హక్కుల బిల్లును ఆమోదించడం, మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసలను నిరోధించి, పరిష్కార చేయడం వంటి కీలక బాధ్యతలను బైడెన్, కమలాహారిస్‌కు అప్పగించారు. వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను ముందుకు తీసుకెళ్లడం, స్పేస్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం వంటివి ఆమె ముందున్నాయి. వీటన్నింటిలో ముఖ్యంగా వలసలనే రిపబ్లికన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె సరిగా పనిచేయకపోవడంవల్లే వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రగతిశీలమైన ధిక్కార గొంతుగా భావించిన ఆమె మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతేడాది గ్వాటెమాల, మెక్సికోలో పర్యటన సందర్భంగా వలసదారులనుద్దేశించి ‘‘ఎవ్వరూ రావొద్దు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై యునైటెడ్ లాటిన్ అమెరికన్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ బాధ్యతల నిర్వహణపై డిసెంబర్లో ఓ ప్రజాభిప్రాయ సేకరణ జరపగా ఆమెకు మద్దతుగా 44శాతం ఓట్లు, వ్యతిరేకంగా 54శాతం ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడికి సైతం దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. హ్యారిస్‌ను చిత్రీకరించడంలో మీడియా ఆమె స్టైల్మీదనే శ్రద్ధ పెట్టిందని డెమొక్రాటిక్ వ్యూహకర్త కరేన్ ఫిన్నే అభిప్రాయపడ్డారు. మధ్యంతర ముప్పు తప్పదా!? జో బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. కరోనా, పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, దేశీయ విధానాలు, విదేశీ ఒప్పందాల విషయంలో ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని పరిష్కారమయ్యాయి. కొన్ని ప్రగతిలో ఉన్నాయి. ఇంకొన్నింటినీ నిలబెట్టుకోలేకపోయారు. వీటన్నింటిలోనూ ఇప్పుడు అతిపెద్ద ముప్పు కోవిడ్–19. అమెరికాలో 61 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని సైతం ఛేదించే దశలో ఉన్నారు. అయినా అది చూపిన ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. బైడెన్‌ను ఆమోదించే వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. దీన్ని పరిష్కరించలేకపోతే మధ్యంతరం ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు విశ్లేషకులు. -
ఎన్ఆర్సీకి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం
కడప అర్బన్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో కొందరు ముస్లిం మైనార్టీలు ఎన్ఆర్సీ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్ఆర్సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు. -
అవిశ్వాసానికి అన్నాడీఎంకే మద్దతు లేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వరని అన్నాడీఎంకే పార్లమెంటు సభాపక్ష నేత పి.వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆ రెండు పార్టీలూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాయని, ఆ అంశంతో తమకేమీ సంబంధం లేదు కాబట్టి తీర్మానాన్ని బలపరిచేది లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ తమ మద్దతు కోరిందని, అయితే మద్దతివ్వరాదని నిర్ణయించామన్నారు. అవిశ్వాసానికి అన్నాడీఎంకే ఎంపీలు మద్దతిస్తారని ప్రకటించిన అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ పళనిస్వామిపై ఆ పార్టీ వేటు వేసింది. -
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వం: ఐఎన్టీయూసీ
రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులను ఓడించాలని ఐఎన్టీయూసీ సీమాంధ్రులకు పిలుపునిచ్చింది. శనివారం విశాఖపట్నంలో ఆ సంస్థ నేతలు తమ్మినేని నర్సింగరావు, ఎమ్ రాజశేఖర్‌లు విలేకర్లతో మాట్లాడారు. అభివృద్ధికి నమూనాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని వారు సీమాంధ్రులకు హితవు పలికారు.