అవిశ్వాసానికి అన్నాడీఎంకే మద్దతు లేదు | AIADMK will not support no-confidence motion | Sakshi
Sakshi News home page

అవిశ్వాసానికి అన్నాడీఎంకే మద్దతు లేదు

Published Sun, Mar 18 2018 3:57 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

AIADMK will not support no-confidence motion - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వరని అన్నాడీఎంకే పార్లమెంటు సభాపక్ష నేత పి.వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆ రెండు పార్టీలూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాయని, ఆ అంశంతో తమకేమీ సంబంధం లేదు కాబట్టి తీర్మానాన్ని బలపరిచేది లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ తమ మద్దతు కోరిందని, అయితే మద్దతివ్వరాదని నిర్ణయించామన్నారు. అవిశ్వాసానికి  అన్నాడీఎంకే ఎంపీలు మద్దతిస్తారని ప్రకటించిన అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ పళనిస్వామిపై ఆ పార్టీ వేటు వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement