
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ తాజాగా ఎక్స్‌సీ40 కాంపాక్ట్ ఎస్‌యూవీలో మరో రెండు కొత్త వేరియంట్స్‌కు బుకింగ్స్ ప్రారంభించింది. ఇందులో ఎక్స్‌సీ40 డీ4 మొమెంటమ్ రేటు రూ. 39.9 లక్షలుగాను, డీ4 ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్ ధర రూ.43.9 లక్షలుగాను (ఎక్స్ షోరూం) ఉంటుందని వోల్వో కార్స్ ఇండియా ఎండీ చార్లెస్ ఫ్రంప్ తెలిపారు.
ఈ నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని చెప్పారాయన. మరోవైపు, ఆర్–డిజైన్ వేరియంట్ రేటును రూ. 42.9 లక్షలకు పెంచినట్లు ఆయన తెలిపారు. జూలై 4న ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 39.9 లక్షలకు అందించినట్లు, ఇప్పటిదాకా 200 యూనిట్లకు ఆర్డర్లు వచ్చినట్లు ఫ్రంప్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment