న్యూఢిల్లీ: స్వీడన్ లగ్జరీ కార్ కంపెనీ, ఓల్వో కార్స్ భారత్‌లో ఎస్‌యూవీ ఎక్స్‌సీ60లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.55.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఏడాది 2,000 కార్లు విక్రయించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గత ఏడాది అమ్మకాలతో పోల్చితే ఇది 25 శాతం అధికం.
అధికంగా అమ్ముడయ్యే మోడల్...
ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కారును తయారు చేశామని ఓల్వో ఆటో ఇండియా ఎండీ, చార్లెస్ ఫ్రంప్ తెలిపారు. ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే కాకుండా, భారత్‌లో కూడా అత్యధికంగా అమ్ముడయ్యే తమ మోడల్ ఇదేనని వివరించారు. తమ మొత్తం భారత అమ్మకాల్లో ఈ కారు వాటా మూడోవంతని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19గా ఉన్న తమ డీలర్ల సంఖ్యను రెండేళ్లలో రెట్టింపు చేయనున్నామని వివరించారు. ఈ కారు...మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ, ఆడి క్యూ5, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, జాగ్వార్ ఎఫ్–పేస్‌లకు గట్టిపోటీనివ్వగలదని అంచనా.
కారు ప్రత్యేకతలు..
ఈ కారును 2.0 లీటర్ డీ5 డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని చార్లెస్ తెలిపారు. ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే ఈ కారులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, మసాజ్, ఫోర్–కార్నర్ ఎయిర్ సస్పెన్షన్, 8 గేర్లు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, బౌవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయని తెలిపారు. పాదచారులను, సైక్లిస్ట్‌లను గుర్తించేలా అత్యంత ఆధునికమైన భద్రత ఫీచర్లతో, స్టీర్ అసిస్ట్ ఫంక్షనాలిటీతో కూడిన సేఫ్టీ ఫీచర్స్‌తో ఈ కారును రూపొందించామని చార్లెస్ వివరించారు.
ఓల్వో ‘ఎక్స్‌సీ 60’.. కొత్త వేరియంట్
Published Wed, Dec 13 2017 12:33 AM | Last Updated on Wed, Dec 13 2017 12:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment