
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లోకి వోల్వో ఎలక్ట్రిక్ బస్‌లను ప్రవేశపెడుతోంది. దేశీ విపణిలోకి ఇప్పటికే హైబ్రిడ్ బస్‌లను తెచ్చింది. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బస్‌లకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ కమల్ బాలి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 3,000కు పైగా ఎలక్ట్రిక్ బస్‌లను విక్రయించామన్నారు.
‘ప్రభుత్వ రంగ రోడ్డు రవాణా సంస్థలతో మా భాగస్వాములు మాట్లాడుతున్నారు. అద్దెకు ఈ బస్‌లను తిప్పేలా మేం ప్రోత్సహిస్తున్నాం’ అని చెప్పారు. భారత్‌లో తమ గ్రూప్ ఇప్పటి వరకు రూ.3,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ప్రతి మూడేళ్లకు కొత్త పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment