చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వోల్వో బస్సులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బాకరాపేట వద్ద ఘాట్ రోడ్డులోకి రాగానే మంటలు రావటంతో ప్రయాణికులు అప్రమత్తమై డ్రైవర్‌కు సమాచారం అందించారు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపటంతో ప్రయాణికులంతా కిందికి దిగిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.