
వోల్వో కొత్త లగ్జరీ సెడాన్ ‘ఎస్90’ @ 53.5 లక్షలు
ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో కార్స్’ తాజాగా కొత్త సెడాన్ ‘ఎస్90’ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.53.5 లక్షలు. ఇందులో డీ4-2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఎస్‌పీఏ టెక్నాలజీ, 3 డ్రైవింగ్ మోడ్‌స (ఎకో, డైనమిక్, కంఫర్ట్), డీఆర్‌ఎల్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌గన్, ఏబీఎస్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కాగా కంపెనీ ఈ ఏడాది వాహన విక్రయాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ‘గతేడాది విక్రయాలు 20 శాతం వృద్ధితో 1,400 యూనిట్లుగా నమోదయ్యారుు.
తాజా ‘ఎస్90’తో ఈ ఏడాది అమ్మకాల్లో కూడా ఇదే స్థారుు వృద్ధిని ఆశిస్తున్నాం’ అని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ టామ్ వాన్ బాన్‌సడర్ఫ్ తెలిపారు. దేశీయంగా వాహన తయారీకి సంబంధించి భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు ఆలోచనలు ప్రస్తుతం కంపెనీకి లేవని పేర్కొన్నారు. తన విభాగంలో ఎస్90 నే అతిపొడవైన ఎస్‌యూవీ అని తెలిపారు. ప్రస్తుతం 16గా ఉన్న ఔట్‌లెట్స్ సంఖ్య జనవరి నాటికి 20కి చేరుతుందని చెప్పారు. కాగా కంపెనీ తన ‘ఎస్90’తో మెర్సిడెస్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి ఏ6 వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.