పార్క్‌ చేస్తే చాలు..కారు ఇట్టే ఛార్జింగ్‌ అవుతుంది..! | Volvo Cars tests new wireless charging technology | Sakshi
Sakshi News home page

పార్క్‌ చేస్తే చాలు..కారు ఇట్టే ఛార్జింగ్‌ అవుతుంది..!

Published Sat, Mar 12 2022 9:22 PM | Last Updated on Sat, Mar 12 2022 9:23 PM

Volvo Cars tests new wireless charging technology - Sakshi

పని మీదమీరోషాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. పార్కింగ్‌లో మీ ఎలక్ట్రిక్‌ కారు పెట్టేసి మాల్‌ లోపలికి వెళ్లారు. షాపింగ్‌ చేసుకుని వచ్చేసరికి కారు ఫుల్‌గా చార్జయిందనుకోండి. అది కూడా ఎలాంటి వైర్‌ కనెక్షన్‌ లేకుండా. భళే ఉంటుంది కదా! అచ్చం ఇలాంటి వైర్‌లెస్‌ చార్జింగ్‌ కార్లపైనే వోల్వో కార్ల సంస్థ ప్రయోగాలు చేస్తోంది. కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అసలు పార్కింగ్‌ ప్లేస్‌లో పెడితే కార్లు ఎలా చార్జింగ్‌ అవుతాయి, దాని వెనకుండే మెకానిజం ఏంటి, వైర్‌లెస్‌ చార్జింగ్‌తో ఉపయోగాలేంటి... తెలుసుకుందామా.. 

కారు ఎలా చార్జ్‌ అవుతుంది?
► కారును చార్జ్‌ చేసేందుకు చార్జింగ్‌ స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన చార్జింగ్‌ ప్యాడ్‌ (బ్లూ చతురస్త్రం)పై పార్క్‌ చేయాలి. ఆ చార్జింగ్‌ ప్యాడ్‌ నుంచి కారుకు విద్యుత్‌ శక్తి అందుతుంటుంది. ఆ శక్తిని గ్రహించి బ్యాటరీని చార్జ్‌ చేయడానికి కారు భాగంలో ముందు టైర్ల దగ్గర రిసీవర్‌ ఉంటుంది. కారులో ఉండే 360 డిగ్రీ కెమెరాతో డ్రైవర్‌ కారు రిసీవర్‌ను సరిగ్గా చార్జింగ్‌ ప్యాడ్‌పైకి తీసుకురావొచ్చు. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ సిటీలో గత మూడేళ్లుగా ఈ వైర్‌లెస్‌ చార్జింగ్‌ ప్రయోగాలను వోల్వో చేస్తోంది. ఇందుకోసం వోల్వో ఎక్స్‌సీ40 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ ట్యాక్సీలను వాడుతోంది.  
►  వోల్వో వైర్‌లెస్‌ చార్జింగ్‌ శక్తి దాదాపు 40 కిలోవాట్లు. అంటే 11 కిలోవాట్ల ఏసీ వైర్డ్‌ చార్జర్‌తో పోలిస్తే 4 రెట్లు వేగంగా కారు చార్జ్‌ అవుతుంది. అలాగే 50 కిలోవాట్ల డీసీ వైర్డ్‌ చార్జర్‌తో ఎంత వేగంగానైతే కారు చార్జ్‌ అవుతుందో అంతే వేగంతో వైర్‌లెస్‌తో చార్జ్‌ చేయొచ్చు. రోజుకు 12 గంటలు, ఏడాదికి లక్ష కిలోమీటర్లు తిరిగినా వాహనం మన్నికగా ఉంటుంది. వైర్‌లెస్, ఎలక్ట్రిక్‌ కాబట్టి పర్యావరణ హితం కూడా. పైగా కేబుల్‌తో చార్జ్‌ చేసే అవసరం ఉండదు. 

వైర్‌లెస్‌ చార్జింగ్‌తో ఉపయోగాలేంటి?

ప్రస్తుతం చార్జింగే పెద్ద సమస్య
పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మార్కెట్‌లోకి ఎన్ని కొత్త వాహనాలు వస్తున్నా ప్రధాన సమస్య చార్జింగే. ఎక్కడంటే అక్కడ చార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యం లేకపోవడం వీటికి మైనస్‌. ఈ సమస్య వల్లే వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వోల్వో లాంటి కార్ల సంస్థల కొత్త చార్జింగ్‌ టెక్నాలజీలతో ఇలాంటి మైనస్‌లకు చెక్‌ పడుతుందేమో చూడాలి.

చదవండి: ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ భారీ స్కెచ్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement