2023 Toyota Innova Crysta ZX, VX Variants Price Announced, Check Here Full List - Sakshi
Sakshi News home page

ఇన్నోవా క్రిస్టాలో రెండు కొత్త గ్రేడ్‌లు

Published Thu, May 4 2023 2:47 AM | Last Updated on Thu, May 4 2023 10:36 AM

Toyota Innova Crysta ZX, VX variants' pricing revealed - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త ఇన్నోవా క్రిస్టా వాహనానికి సంబంధించి రెండు టాప్‌ గ్రేడ్‌ల (జెడ్‌ఎక్స్, వీఎక్స్‌) ధరలను టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకేఎం) ప్రకటించింది. ఇందులో జెడ్‌ఎక్స్‌ గ్రేడ్‌ ధర రూ. 25.43 లక్షలు కాగా, వీఎక్స్‌ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 23.79–23.84 లక్షలుగా (ఎక్స్‌ షోరూం) ఉంటుందని తెలిపింది.

వీటిలో 7 ఎయిర్‌బ్యాంగ్‌లు, ముందు..వెనుక పార్కింగ్‌ సెన్సార్లు, స్మార్ట్‌ ఎంట్రీ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. దీనితో ప్రస్తుతం మొత్తం నాలుగు గ్రేడ్‌లలో (జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్‌ఎక్స్‌) కొత్త ఇన్నోవా క్రిస్టా లభిస్తున్నట్లవుతుందని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ సూద్‌ తెలిపారు. రూ. 50,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా డీలర్ల దగ్గర బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement