
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ మరోసారి ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ప్రత్యేకించి యువతను లక్ష్యించి... 200సీసీ సెగ్మెంట్లో సరికొత్త ప్రీమియం బైక్‌ను సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఎక్స్‌ట్రీమ్ 200ఆర్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ టూవీలర్‌ను యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ఢిల్లీలో దీని ఎక్స్–షోరూం ధర రూ.89,900. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త బైక్ ద్వారా అమ్మకాలు గణనీయంగా పెరిగి మార్కెట్ వాటా బలపడుతుందని భావిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. 200సీసీ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడంలో భాగంగా ఎక్స్‌పల్స్ 200 వంటి పలు మోడళ్లను విడుదలచేయనున్నామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment