
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపె నీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా 2018 ప్యాషన్ ప్రో, ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధర లు వరుసగా రూ.53,189, రూ.54,189గా ఉన్నాయి.
అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 100–110 సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ బైక్స్‌ను ఆవిష్కరించింది. వీటిల్లో బీఎస్–4 నిబంధనలకు అనువైన 110 సీసీ ఇంజిన్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.