
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 805 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 772 కోట్ల లాభంతో పోలిస్తే సుమారు 4 శాతం అధికం. మరోవైపు, తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 7,031 కోట్ల నుంచి రూ. 7,416 కోట్లకు పెరిగింది.
వ్యయాలు సైతం 5.75 శాతం పెరిగి రూ. 5,945 కోట్ల నుంచి రూ. 6,287 కోట్లకు చేరాయి. హీరో మోటోకార్ప్.. 2017–18కి గాను రూ. 2 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 55 మేర మధ్యంతర డివిడెండు ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కూడా తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించినట్లు సంస్థ ఎండీ పవన్ ముంజల్ తెలిపారు. బీఎస్‌ఈలో మంగళవారం హీరో మోటోకార్ప్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 3,543 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment