‘హీరో’తో ఒప్పందం ఖరారు | sealed the deal with hero company | Sakshi
Sakshi News home page

‘హీరో’తో ఒప్పందం ఖరారు

Published Wed, Sep 17 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

sealed the deal with hero company

చిత్తూరు జిల్లాలో 600 ఎకరాలు కేటాయింపు
 
హైదారబాద్: ఏపీలోని చిత్తూరు జిల్లా లో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రముఖ మోటార్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రభుత్వంతో అవగాహనా ఒప్పం దం కుదుర్చుకుంది. లేక్‌వ్యూ అతిథి గృహం లో సీఎం చంద్రబాబు సమక్షంలో సంస్థ జనరల్ మేనేజర్ రాకేష్‌వశిష్ట, ప్రభుత్వ అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశా రు. చిత్తూరు జిల్లా సత్యవీడు మండలంలో ని మాదన్నపాలెం గ్రామంలో హీరో కంపెనీ తన పరిశ్రమను నెలకొల్పుతుంది. ప్రభుత్వం 600 ఎకరాలను కేటాయిస్తూ సంబంధిత లేఖను పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ హీరో జీఎం రాకేష్‌వశిష్టకు అందజేశారు. ఇక్కడి ప్రధాన పరిశ్రమలో రూ. 1,600 కోట్లు పెట్టుబడులు పెడతామని రాకేష్ ఈ సందర్భంగా తెలిపారు. దీనికి అనుబంధ పరిశ్రమల్లో మరో రూ. 1,500కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు.

 ఇదిలావుంటే.. చిత్తూరు జిల్లాలోనే ఎస్‌ఆర్ పురం మండలం చిన్నతయ్యూర్, కొక్కిరాలకొండ గ్రామాల్లో డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) యూనిట్‌ను నెలకొల్పేందుకు 1,103 ఎకరాల భూమిని కేటాయిస్తూ సీఎం లేఖను సంబంధిత ప్రతినిధులకు అందజేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement