
హీరో మోటోకార్ప్ ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్
హైదరాబాద్: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ఏపీ, తెలంగాణ, కేర ళ, కర్నాటక రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లుఅర్జున్ తమ కంపెనీ వాహనాలకు ప్రచారం కల్పిస్తే దక్షిణ భారతదేశంలో కంపెనీ మార్కెట్ బలపడుతుందని మోటోకార్ప్ ఒక ప్రకటనలో పేర్కొంది. అతి త్వరలో అల్లు అర్జున్‌తో కలిసి 125 సీసీ గ్లామర్ బైక్‌తో ఒక ప్రకటనను రూపొందిస్తామని తెలిపింది.