మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’ | Hero MotoCorp forays into 125-cc scooter segment with Destini 125 | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’

Published Tue, Oct 23 2018 12:49 AM | Last Updated on Tue, Oct 23 2018 12:49 AM

Hero MotoCorp forays into 125-cc scooter segment with Destini 125 - Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. దేశీ మార్కెట్‌లో ‘డెస్టినీ 125’ పేరిట సరికొత్త స్కూటర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ.54,650–రూ.57,500గా ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో విక్రయాలు ప్రారంభం కాగా, దేశవ్యాప్త అమ్మకాలు వచ్చే 3–4 వారాల్లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్‌ ప్రోడక్ట్‌ ప్లానింగ్‌ హెడ్‌ మాలో లీ మాసన్‌ మాట్లాడుతూ.. ‘125–సీసీ విభాగానికి చెందిన స్కూటర్‌ మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. ఏడాది ప్రాతిపదికన 75 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ఈ విభాగంలో బహుళ బ్రాండ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ ఏడాది చివరినాటికి మరో స్కూటర్‌నూ విడుదలచేయనున్నాం’’ అని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement