హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు త్వరలో కొత్త పెట్రోలింగ్ బైక్ లు రానున్నాయి. హోండా కంపెనీ ప్రతినిధులు పెట్రోలింగ్ బైక్‌ల నమూనాను సిద్ధంచేసి డీజీపీ జేవీ రాముడికి చూపించారు. డీజీపీ డిజైన్ ను అప్రూవ్ చేసినట్లు తెలిసింది. త్వరలో తెల్లటి హోండా డ్రీమ్ నియో బైక్‌లను ఆంధ్రా ట్రాఫిక్ పోలీసులకు ఇవ్వనున్నారు.
తెలంగాణా ప్రభుత్వం హోండా సీబీజెడ్ ఎక్స్‌ట్రీమ్ వాహనాలను అందిస్తే, ఆంధ్రా ప్రభుత్వం హోండా డ్రీమ్ నియో బైక్‌లను ఇవ్వనుంది. హోండా సీబీజెడ్ ఎక్స్‌ట్రీమ్ ధర దాదాపు రూ. 80 వేలుగా ఉంటే డ్రీమ్ నియో ధర రూ.55 వేలు. పికప్ తక్కువగా ఉండే బైక్‌లు అందిస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు ఉసూరుమంటున్నారు.