సాక్షి, న్యూఢిల్లీ: సూపర్ బైక్ మేకర్ డుకాటీ తన కొత్త స్క్రాంబ్లర్ 1100 ను ఇండియాలో విడుదల చేసింది. ఇప్పటి వరకు తన బైకులను లాంచ్ చేసిన మాదిరిగానే, కొత్త డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రారంభించింది. డుకాటీ స్క్రాంబ్లర్1100 బైకును స్టాండర్డ్, స్పెషల్, స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లలో విడుదల చేసింది.
స్టైలింగ్ పరంగా, 803 సీసీ స్క్రాంబ్లర్ ను కొత్త స్క్రాంబ్లర్ 1100 పోలి ఉంటుంది. ముందుగా వచ్చిన మోడళ్ల కంటే ఇది చూడడానికి కాస్త స్టైలిష్, దృఢంగా కనిపిస్తుంది. బైకు నడిపేవారికి అవసరమైన సమాచారాన్ని చూపించడానికి కొత్త ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడా దీనికి అమర్చారు. ఇక ధరల విషయానికి వస్తే రూ. 10.91 లక్షలు ( ఎక్స్ షోరూమ్ )గా కంపెనీ నిర్ణయించింది. స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ ధర రూ. 11.12 లక్షలు ( ఎక్స్ షోరూమ్ ), స్క్రాంబ్లర్ స్పోర్ట్స్ ధర రూ. 11.42 లక్షలు ( ఎక్స్ షోరూమ్ )గా ఉంది.
డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ప్రత్యేకతలు
ఎల్ - ట్విన్ ఇంజన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, 1,079 సీసీ, 85 బీహెచ్ పీ శక్తి, 88 ఎన్ఎమ్ టార్క్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మూడు రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ వంటివి స్క్రాంబ్లర్ 1100 ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కొత్త స్క్రాంబ్లర్ 1100 కు ఫ్రంట్‌లో రెండు డిస్క్ బ్రేకులను, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌ను, మోనోషాక్ సస్పెన్షన్ వ్యవస్థ ను వెనుక వైపు అమర్చింది.
Comments
Please login to add a commentAdd a comment