భారతదేశంలో టెస్లా అరంగేట్రం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ప్రయత్నాలన్నీ సఫలీకృతమై గుజరాత్ రాష్ట్రంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024' (2024 Vibrant Gujarat Global Summit)కు మాత్రం 'మస్క్' హాజరు కాలేదు.
నిజానికి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 వేదికగా టెస్లా చర్చలు జరగనున్నట్లు జరుగుతాయని చాలామంది భావించారు, కానీ టెస్లా అధినేత ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాహుల్ గుప్తా' మస్క్ ఈ సమ్మిట్‌కు హాజరు కానప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం రాష్ట్రం పలుకుతోందని స్పష్టం చేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ కంపెనీ కూడా ఇండియాలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ గుజరాత్‌ను మొదటి ఎంపిక చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుజరాత్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చదవండి: వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్
ఎలోన్ మస్క్ 2024లో భారతదేశంలో టెస్లా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు టెస్లా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని. 2023లోనే యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ సమావేశమై టెస్లా ఫ్యాక్టరీ గురించి చర్చలు జరిపారు. మొత్తం మీద మస్క్ టెస్లా ఫ్యాక్టరీని ఈ ఏడాది భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment