
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దీపావళి శోభ కనువిందు చేస్తుంది. కొత్త కొత్త వస్తువుల కొనుగోలుతో ఇటు షాపింగ్ మాల్స్, అటు వాహనాల షోరూంలు కళకళలాడుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కార్ల తయారీసంస్థలు పలు దీపావళి ఆఫర్లను ప్రకటించేశాయి. దేశంలో రెండో అతిపెద్ద కార్ల సంస్థ హ్యుందాయ్ కూడా తన వాహనాలపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లేమిటో ఓసారి చూద్దాం..
హ్యుందాయ్ ఈఆన్ : ఈఆన్ వాహనంపై హ్యుందాయ్ రూ.60వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. భారత్‌లో అత్యంత చిన్న, సరమైన కారు మోడల్ ఏది? అంటే అది ఈఆన్ కారు మోడలే. నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లను వంటి ఇతర ప్రయోజనాలను కూడా హ్యుందాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తోంది. ఈఆన్ ప్రారంభ ధర రూ.2.69 లక్షలు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 : 2013లో లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.4.29 లక్షలు. ఈ కారు అన్ని పెట్రోల్ మోడల్స్‌పై రూ.80వేలు, డీజిల్ మోడల్స్‌పై రూ.90వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది హ్యుందాయ్. దీనిలోనే నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనాలు కలిసి ఉండనున్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌సెంట్ : ఈ కారు హ్యుందాయ్ సబ్‌కాంపాక్ట్ సెడాన్. ఈ ఏడాది ప్రారంభంలో దీన్ని లాంచ్ చేశారు. ఎక్స్‌సెంట్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లపైనా రూ.50వేల వరకు ప్రయోజనాలు కంపెనీ అందిస్తోంది.
హ్యుందాయ్ ఐ20, ఐ20 యాక్టివ్ : ఐ20 లేదా ఐ20 యాక్టివ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ రూ.25వేల వరకు తగ్గింపును అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment