
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఉన్న ప్లాంటులో కోటి కార్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ మార్కును సొంతం చేసుకుని ఫ్యాక్టరీ నుంచి వెలుపలికి వచ్చిన ప్రీమియం ఎస్‌యూవీ ఆల్కజార్‌పై తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సంతకం చేశారు. కొరియా వెలుపల భారత్‌లో 1998లో హ్యుందాయ్ ఈ తయారీ కేంద్రాన్ని స్థాపించింది. ఇప్పటివరకు దేశంలో రూ.29,500 కోట్లకుపైగా వెచ్చించినట్టు సంస్థ వెల్లడించింది.
ఇక్కడ చదవండి: 3 నెలల్లో రూ.25.46 లక్షల కోట్ల సంపద సృష్టి