హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.
ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్‌తో రూ.1931కు స్టాక్ మార్కెట్‌లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్‌లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..
గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్‌లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్‌పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment