listing day
-
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్‌తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్‌పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
లిస్టింగ్ రోజే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూల హవా నెలకొంది. అయితే ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ రోజునే అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఏప్రిల్–జులై మధ్య కాలంలో 52 శాతం మంది ఇన్వెస్టర్లు తొలి రోజునే అలాట్ అయిన షేర్లను విక్రయించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ పేర్కొంది. మరో 20 శాతం మంది లిస్టయిన వారం రోజుల్లోపే షేర్లను వొదిలించుకున్నట్లు తెలియజేసింది. మోతీలాల్‌కు చెందిన బ్రోకింగ్, పంపిణీ విభాగం చేసిన విశ్లేషణ ప్రకారం ఐపీవో క్లయింట్లలో 64 శాతం మంది సగటున కనీసం రెండు ఇష్యూలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో 5.7 లక్షల మంది ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూల బాట పట్టగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో 5.1 లక్షల మంది మాత్రమే వీటికి సబ్స్క్రయిబ్ చేశారు. రాష్ట్రాల వారీగా మొత్తం ఐపీవో క్లయింట్లలో దాదాపు 70 శాతం మంది గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంపెనీలు సైతం క్యూ కట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్–జులైలో 36 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో 17 ఇష్యూలు మాత్రమే నమోదయ్యాయి. 61 శాతం మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. గ్లెన్‌మార్క్ లైఫ్సైన్సెస్కు అత్యధికంగా 68 శాతం మంది క్లయింట్లు అప్లై చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించడం ద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఏడాది చివరికల్లా 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్- లిస్టింగ్ భళా
ముంబై, సాక్షి: గతేడాది మళ్లీ కళకళలాడిన ప్రైమరీ మార్కెట్లో భాగంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ హుషారుగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 315తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 436 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 36 శాతం ప్రీమియంకాగా.. వెనువెంటనే రూ. 490 వరకూ ఎగసింది. ప్రస్తుతం 6.5 శాతం లాభంతో రూ. 465 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 436 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలోలోనూ రూ. 430 వద్ద లిస్టయ్యింది. రూ. 493 వరకూ జంప్‌చేసింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 66.66 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. 10 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. తద్వారా కంపెనీ మొత్తం రూ. 300 కోట్లు సమకూర్చుకుంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 215 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. కంపెనీ తాజాగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. చదవండి: (ఈ చిన్న షేరు గెలాప్ వెనుక?!) ప్రాజెక్టుల కోసం ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పేర్కొంది. వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. (2020: ఐపీవో నామ సంవత్సరం) మునిసిపాలిటీలతో.. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
బెక్టర్స్ ఫుడ్.. బంపర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ప్రీమియం బిస్కట్ల కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 288కాగా.. ఎన్ఎస్ఈలో రూ. 500 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 74 శాతం(రూ. 212) ప్రీమియంకాగా.. ప్రస్తుతం రూ. 585 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 600 వద్ద గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో రూ. 501 వద్ద లిస్టయ్యింది. ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తడంతో 198 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (2020: ఐపీవో నామ సంవత్సరం) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం
ముంబై, సాక్షి: అటు నిపుణులు, ఇటు ఇన్వెస్టర్లను నివ్వెరపరుస్తూ కేవలం మూడు రోజుల్లోనే అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌కింగ్ షేరు మూడు రెట్లు రిటర్నులు అందించింది. ఇటీవల రూ. 60 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బర్గర్ కింగ్ తొలి రోజు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. బీఎస్ఈలో ఏకంగా 91 శాతం ప్రీమియంతో రూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రెండు రోజులుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో ఈ షేరు రూ. 33 ఎగసి రూ. 199 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఇష్యూ ధరతో పోలిస్తే 232 శాతం లేదా 3.3 రెట్లు అధికంగా లాభపడింది! ఇందుకు ఈ కౌంటర్లో కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడం ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) మూడేళ్లుగా ఈ ట్రెండ్ రూ. 1,000 కోట్లలోపు పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బలమైన కంపెనీలు మూడేళ్లుగా తొలి వారంలో భారీగా లాభపడుతూ వస్తున్నట్లు టార్గెట్ ఇన్వెస్టింగ్‌కు చెందిన కల్రా పేర్కొన్నారు. ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంటే ఈ మేనియా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ట్రేడర్లు, లేదా ఇన్వెస్టర్లకు కంపెనీ వేల్యుయేషన్స్ గుర్తుకురావని వ్యాఖ్యానించారు. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేరు సైతం ఇదేవిధంగా లిస్టింగ్‌లో పటిష్ట లాభాలు ఆర్జించినట్లు ప్రస్తావించారు. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2014 నవంబర్‌లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బర్గర్‌కింగ్ తాజాగా 261 రెస్టారెంట్లకు విస్తరించింది. వీటిలో 8 సబ్ఫ్రాంచైజీలున్నాయి. 17 రాష్ట్రాలు, 57 పట్టణాలలో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. రానున్న కాలంలో వ్యాపార విస్తరణ ద్వారా కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు ఏంజెల్ బ్రోకింగ్‌కు చెందిన కేశవ్ లహోటీ పేర్కొన్నారు. అయితే క్యూఎస్ఆర్ విభాగంలో జూబిలెంట్ ఫుడ్ వాటా 21 శాతంకాగా.. మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ 11 శాతం, కేఎఫ్‌సీ 10 శాతం, సబ్వే 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆలస్యంగా అడుగుపెట్టిన బర్గర్‌కింగ్ 5 శాతం వాటాతో వేగంగా విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత ఐదేళ్లలో బర్గర్‌కింగ్ అమ్మకాలు 56 శాతం జంప్‌చేయగా.. వెస్ట్‌లైఫ్ 17 శాతం, జూబిలెంట్ 12 శాతం చొప్పున వృద్ధి చూపాయి. బర్గర్‌కింగ్ 2020 మార్చికల్లా రూ. 835 కోట్ల ఆదాయం సాధించింది. -
గ్లాండ్ ఫార్మా.. గ్రాండ్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న హెల్త్ కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ ఎక్స్ఛేంజీలలో 14 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,500తో పోలిస్తే.. ఎన్ఎస్ఈలో రూ. 210 లాభంతో రూ. 1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 1,850 వరకూ జంప్‌చేసింది. ఇది 23 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం రూ. 1,717 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ రూ. 1,701 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ. 1850- 1701 మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి తొలి గంటలోనే 3.2 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! చైనీస్ పేరెంట్.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్ ఫార్మా రూ. 1,500 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించింది. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. బ్యాక్ గ్రౌండ్ ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది. -
రూట్ మొబైల్ లిస్టింగ్.. అధరహో
ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్.. బిగ్‌బ్యాంగ్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 350 కాగా.. బీఎస్ఈలో ఏకంగా రూ. 708 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 102 శాతం(రూ. 358) లాభంకాగా.. ప్రస్తుతం రూ. 641 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 735 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 626 వద్ద కనిష్టానికీ చేరింది. ఈ నెల 11న ముగిసిన రూట్ మొబైల్ ఇష్యూ 73 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. గత వారం లిస్టయిన ఐటీ సేవల కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ మరింత అధికంగా 111 శాతం ప్రీమియంతో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన విషయం విదితమే. యాంకర్ నిధులు పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూట్ మొబైల్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితరాలున్నాయి. ఐపీవో ద్వారా రూట్ మొబైల్ మొత్తం రూ. 600 కోట్లను సమీకరించింది. నిధులను రుణ చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ వివరాలు రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్ మొబైల్ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. -
రెండు దశాబ్దాలలో.. రికార్డ్ లిస్టింగ్స్
పబ్లిక్ ఇష్యూ ధర రూ. 116 కాగా.. గురువారం(17న) రూ. 351 వద్ద లిస్ట్‌కావడం ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. దశాబ్ద కాలంలో ఇది(111 శాతం) అత్యధిక లాభంకాగా.. ఇంతక్రితం డీమార్ట్ రిటైల్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ 102 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు రెట్టింపు సంపదను పంచిన కంపెనీలలో డీమార్ట్ రెండో ర్యాంకుకు చేరింది. ఐటీ రంగ దిగ్గజం అశోక్ సూతా ప్రమోట్ చేసిన హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో 151 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ కావడం ద్వారా కూడా రికార్డును సాధించిన విషయం తెలిసిందే. కాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో భారీ ప్రీమియంతో లిస్టయిన జాబితాను పరిగణిస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ మూడో కంపెనీగా నిలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 100 కోట్లకుపైగా నిధులను సమీకరించిన కంపెనీలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదిక వివరాలు చూద్దాం... టాప్-5 2017 మార్చిలో వచ్చిన డీమార్ట్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 299కాగా.. 102 శాతం ప్రీమియంతో రూ. 604 వద్ద లిస్టయ్యింది. ఇదే విధంగా 2019 అక్టోబర్‌లో రూ. 320 ధరలో ఐపీవోకి వచ్చిన పీఎస్‌యూ.. ఐఆర్సీటీసీ కౌంటర్లో రూ. 644 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 101 శాతం లాభంకాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే.. 150 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా ఇంద్రప్రస్థ గ్యాస్ కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఐపీవో ధర రూ. 48తో పోలిస్తే తొలి రోజు రూ. 120 వద్ద నమోదైంది. ఈ బాటలో టీవీ టుడే నెట్వర్క్ రూ. 95 ధరలో ఐపీవో చేపట్టగా.. 121 శాతం లాభంతో రూ. 210 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ ప్రారంభమైంది. జాబితాలో గత రెండు దశాబ్దాల కాలంలో పబ్లిక్ ఇష్యూ ముగిశాక భారీ లాభాలతో లిస్టింగ్ సాధించిన కంపెనీల జాబితాను చూద్దాం.. పార్శ్వనాథ్ డెవలపర్స్ ఇష్యూ ధర రూ. 300 కాగా.. 80 శాతం లాభంతో రూ. 540 వద్ద లిస్టయ్యింది. అదానీ పోర్ట్స్ రూ. 440 ధరలో ఐపీవోకిరాగా.. రూ. 770 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇది 75 శాతం ప్రీమియం. ఇక ఎడిల్వీజ్, మేఘమణి ఆర్గానిక్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, వీ2 రిటైల్, అపోలో మైక్రోసిస్టమ్స్, శోభా లిమిటెడ్ సైతం సుమారు 75 శాతం లాభాలతో లిస్ట్‌కావడం విశేషం! ఈ కాలంలో 20 వరకూ ఐపీవోలకు 100 రెట్లు అధికంగా స్పందన లభించినప్పటికీ లిస్టింగ్‌లో లాభాలు సగటున 70 శాతానికే పరిమితమైనట్లు నిపుణులు తెలియజేశారు. -
హ్యాపీయెస్ట్ మైండ్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 166 కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది రూ. 185(111 శాతం) లాభం కాగా.. ప్రస్తుతం రూ. 366 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 395 వద్ద గరిష్టాన్ని, రూ. 350 వద్ద కనిష్టాన్నీ తాకింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో ఇటీవల ఎరుగని విధంగా 151 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిన సంగతి తెలిసిందే . ఇటీవల చేపట్టిన పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ 2.33 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 351 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 702 కోట్లు సమీకరించింది. రిటైల్ విభాగంలోనే 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖాలు కావడం విశేషం! బ్యాక్‌గ్రౌండ్.. దేశీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్ సూతా 2011లో హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలలో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్ మైండ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. -
లిస్టింగ్ లో క్విక్ హీల్ కుదేలు..
సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్‌హీల్ టెక్నాలజీస్.. లిస్టింగ్ రోజున భారీగా క్షీణించింది. ఇష్యూ ధర రూ. 321తో పోలిస్తే బీఎస్ఈలో దాదాపు 20.73 శాతం నష్టపోయి రూ. 254.45 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 23.3 శాతం మేర క్షీణించి రూ. 246 స్థాయిని కూడా తాకడం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈలోనూ 20.91 శాతం పతనంతో రూ. 253.85 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,782 కోట్లుగా ఉంది. ఈ ఏడాది లిస్టయిన కంపెనీల్లో టీమ్‌లీజ్ సర్వీసెస్, ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్స్ తర్వాత క్విక్‌హీల్ మూడోది. ఫిబ్రవరి 10తో ముగిసిన ఐపీవోలో కంపెనీ రూ. 451 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర రూ. 311-321 శ్రేణిలో ఉండగా.. ఇష్యూ 11 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. చివరికి రేటును రూ. 321గా నిర్ణయించారు. మరోవైపు క్విక్‌హీల్ పూర్తి షేర్‌హోల్డింగ్ వివరాలు వెల్లడించలేదంటూ ఎన్సీఎస్ కంప్యూటెక్ సంస్థ ఎండీ మనోహర్ మలానీ సెబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.