భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ 'హ్యుందాయ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన '2023 వెర్నా' (2023 Verna) లాంచ్ చేసింది. ఈ కొత్త సెడాన్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు
ధరలు & బుకింగ్స్:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్లలో విడుదలైంది. అవి EX, S, SX, SX(O). ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ సెడాన్ కోసం ఇప్పటికే రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ కూడా 8,000 దాటినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
డిజైన్ & కలర్ ఆప్సన్స్:
కొత్త హ్యుందాయ్ వెర్నా మొత్తం ఏడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అవి టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ కలర్స్.
డిజైన్ విషయానికి వస్తే, 2023 హ్యుందాయ్ వెర్నా సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించబడింది. కావున ఇందులో విస్తృతంగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లాంప్, వెడల్పు అంతటా వ్యాపించి ఉండే డిఆర్ఎల్, కలిగి డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌పై క్రోమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. వెనుక వైపు పారామెట్రిక్ కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
2023 వెర్నా పరిమాణం పరంగా కూడా దాని ప్రత్యర్థుల కంటే పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు 1,765, వెడల్పు 1765 మిమీ, వీల్‌బేస్ 2670 మిమీ ఉంటుంది. కావున ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
(ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు)
ఇంటీరియర్ ఫీచర్స్:
హ్యుందాయ్ వెర్నా డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లపై డ్యూయల్ టోన్ బేజ్-బ్లాక్ కలర్ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది 64 కలర్ యాంబియంట్ లైటింగ్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో క్లైమేట్ కంట్రోల్ నాబ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి లేటెస్ట్ ఫీచర్లతో పాటు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది.
లేటెస్ట్ వెర్నా ఆడియో అండ్ నావిగేషన్ కోసం 10.25 ఇంచెస్ కలర్ TFT MID ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వాలెట్ మోడ్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది హిందీ, ఇంగ్లీష్ మిక్స్‌లో వాయిస్ కమాండ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
(ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!)
ఇంజిన్ & మైలేజ్:
భారతీయ విఫణిలో అడుగుపెట్టిన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో 1.5l MPi పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 143.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ & ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ IVTతో లభిస్తుంది. ఇది 18.6 కిమీ/లీ (MT), 19.6 కిమీ/లీ (IVT) అందిస్తుంది.
ఇక రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 160హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన 7 స్పీడ్ DCTతో జతచేయబడి ఉంటుంది. ఇది 20 కిమీ/లీ(MT), 20.6 కిమీ/లీ (DCT) మైలేజ్ అందిస్తుంది.
(ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు)
సేఫ్టీ ఫీచర్స్:
హ్యుందాయ్ వెర్నా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, నాలుగు డిస్క్ బ్రేక్‌లు వంటి భద్రతా ఫీచర్లతో పాటు ఆధునిక ADAS సిస్టం కూడా పొందుతుంది. కావున ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిస్ కంట్రోల్, లేన్ కీప్ వార్నింగ్, అసిస్ట్ బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
ప్రత్యర్థులు:
ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా దేశీయ మార్కెట్లో హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ సెడాన్ మీద 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment