హ్యుందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పుడు ఆల్కజార్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ లాంచ్ చేసింది. ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఆల్కజార్ కొత్త ఇంజిన్ ఆప్షన్‌తో విడుదలవ్వడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 16.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 20.25 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
హ్యుందాయ్ కంపెనీ కొన్ని వారాలకు ముందు ఈ ఆల్కజార్ 1.5-లీ టర్బో కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఈ ఇంజిన్ 159 హెచ్‌పి పవర్ 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 1.5 టర్బో మొత్తం నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇవి ఇంటిగ్రేటెడ్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ పొందుతాయి. కంపెనీ ప్రకారం, DCT గేర్‌బాక్స్ 18 కిమీ/లీ, మాన్యువల్ గేర్‌బాక్స్ 17.5 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.
(ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా)
కొత్త ఆల్కాజర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది, ఇప్పుడు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా లభిస్తాయి. ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా హెక్టర్ ప్లస్, ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment