హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ రైడ్‌ | Hyundai To Launch Six Pure Electric Vehicles In India By 2028 | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ రైడ్‌

Published Thu, Dec 9 2021 5:17 AM | Last Updated on Thu, Dec 9 2021 5:17 AM

Hyundai To Launch Six Pure Electric Vehicles In India By 2028 - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ భారత్‌లో ఎలక్ట్రిక్‌ రైడ్‌కు సిద్ధమైంది. 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్‌ మోడళ్లను రంగంలోకి దింపనుంది. వీటిలో ఒకటి వచ్చే ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగుతీయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ఆధారంగా, అలాగే అంతర్జాతీయంగా కంపెనీ అమలు చేస్తున్న ఈ–జీఎంపీ ప్లాట్‌ఫాంపైనా కొన్ని మోడళ్లను తయారు చేయనుంది.

77.4 కిలోవాట్‌ అవర్‌ వరకు సామర్థ్యం గల బ్యాటరీ పొందుపరిచే వీలుంది. 2, 4 వీల్‌ డ్రైవ్‌తోపాటు గంటకు 260 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ వాహనాల అభివృద్ధి, పరిశోధన కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈవో ఎస్‌.ఎస్‌.కిమ్‌ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి చెన్నై ప్లాంటులో చేపడతామని, బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. భారత్‌లో కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్‌ను విక్రయిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement