వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.
భారత్‌లో హ్యుందాయ్ మోటార్స్ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎంఐఎల్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ జే వాంగ్ ర్యూ తెలిపారు.
హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్‌కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్ ర్యూ వెల్లడించారు.
ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్‌లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment