ఒకే ఏరియా.. ఆరు వెంచర్లు! | one area six venchers..! | Sakshi
Sakshi News home page

ఒకే ఏరియా.. ఆరు వెంచర్లు!

Published Sat, May 14 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

ఒకే ఏరియా.. ఆరు వెంచర్లు!

ఒకే ఏరియా.. ఆరు వెంచర్లు!

సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏ డెవలపరైనా వెంచర్‌ను ప్రారంభించే ముందు ఆయా ప్రాంతంలో అమ్మకాలెలా ఉంటాయి? భవిష్యత్తు అభివృద్ధి ఉంటుం దా? కొనుగోలుదారుల పెట్టుబడికి లాభం చేకూరుతుందా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఉన్నా సరే ఒకే ఏరియాలో ఒకట్రెండు వెంచర్లను ప్రారంభించేందుకే సంశయించే ఈరోజుల్లో ఒకేసారి ఆరు వెంచర్లు..

అది కూడా ఏకకాలంలో ప్రారంభించింది సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. ‘‘సరిగ్గా ఏడాది క్రితం రాంపల్లిలోని తారక్ ఎన్‌క్లేవ్‌లో గజం రూ. 6,750 చొప్పున విక్రయించాం. ఇప్పుడక్కడ గజం రూ.10 వేలకు పైనే పలుకుతుంది. ఇది చాలదూ మా వెంచర్లు కొనుగోలుదారులకు లాభాన్ని చేకూర్చేవే అనేందుకంటున్నారు సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. సీఎండీ గురురాజ్.

 రాంపల్లిలో 15 ఎకరాల్లో సిలికాన్ మెడల్స్ అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.8 వేలు. 133-500 గజాల మధ్య ప్లాట్లుంటాయి. మొత్తం 275 ప్లాట్లు. అభివృద్ధి పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. కొనుగోలుదారులు కోరితే ఆయా స్థలంలో ఇంటి నిర్మాణం కూడా చేసిస్తాం. చ.అ. రూ.1,300.

 అనంతారంలో 14 ఎకరాల్లో హైవే కౌంటి వెంచర్‌ను చేస్తున్నాం. గజం రూ.4,500. వంద శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 180-400 గజాల మధ్య మొత్తం 210 ప్లాట్లొస్తాయి. ఈ వెంచర్‌లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది.

 భువనగిరి టౌన్‌లో 14 ఎకరాల్లో రాక్‌పోర్ట్ కాలనీని అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.4,999. మొత్తం 250 ప్లాట్లుంటాయి. 75 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది.

 కీసరలో 200 ఎకరాల్లో మామిడి ఆర్చిడ్స్ ఫాంల్యాడ్ వెంచర్‌ను చేస్తున్నాం. 5, 10, 15 గుంటల చొప్పున విక్రయిస్తాం. 5 గుంటలకు రూ.10.27 లక్షలు. ఫామ్‌లో 50 శాతం మామిడి చెట్లు, మిగతా స్థలంలో సీజన్ ఫ్రూట్స్ పండిస్తాం. మూడేళ్ల వరకు మొక్కల పెంపకం కంపెనీదే. ఈ వెంచర్‌లో రిసార్ట్ కూడా ఉంటుంది. లైఫ్ టైం మెంబర్‌షిప్ ఉచితం.

 రాయగిరి దగ్గర కూనురులో వనమాలి టౌన్‌షిప్‌ను చేస్తున్నాం. మొత్తం 150 ఎకరాలు. తొలి దశలో 60 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.3,150. హైవే ఫేసింగ్ కమర్షియల్ అయితే గజం రూ.4,050. మొత్తం 1,100 ప్లాట్లు. 133-500 గజాల మధ్య ప్లాట్ సైజులుంటాయి. వెంచర్‌లో 80 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్.ఔట్‌డోర్ గేమ్స్, జాగింగ్, మెడిటేషన్ వంటి వసతులుంటాయి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement