వరద ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
విజయవాడ: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరదల దాటికి పంట నష్టపోయిన రైతులతో పాటు ఇతర బాధితులను ఆయన పరామర్శించనున్నారు.