ఆఫ్గానిస్తాన్‌లో సంభవించిన భుకంపం పెను విషాదం మిగిలిచ్చింది. ఈ ఘటనలో దాదాపు 2400 పైగా మృతిచెందారు. భూకంపం ధాటికి ఏకంగా 12కు పైగా గ్రామాలు నేలమట్టమయ్యాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు.
ఈ క్రమంలో ఆఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల ఫీజు రూపంలో తనకు వచ్చే మొత్తం ఆదాయాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు రషీద్ ప్రకటించాడు.
"ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చిందని తెలిసి చాలా బాధపడ్డాను. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను.
అదే విధంగా భూకంప బాధితులను అదుకునేందుకు ఫండ్స్ సేకరించేందుకు త్వరలో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతానని ట్విటర్‌లో రషీద్ పేర్కొన్నాడు.
చదవండి: అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! అందుకే అనర్హత వేటు... ఇక మర్చిపోవాల్సిందే!
I learned with great sadness about the tragic consequences of the earthquake that struck the western provinces (Herat, Farah, and Badghis) of Afghanistan.
— Rashid Khan (@rashidkhan_19) October 8, 2023
I am donating all of my #CWC23 match fees to help the affected people.
Soon, we will be launching a fundraising campaign to… pic.twitter.com/dHAO1IGQlq
Comments
Please login to add a commentAdd a comment