Skyscrapers
-
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్‌లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోవెస్ట్లోనే ఎక్కువ.. షేక్‌పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు సెకండ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్‌లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.బాల్కనీలోంచి సిటీ వ్యూ.. ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్‌ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్‌లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.స్వచ్ఛమైన గాలి, వెలుతురుఅత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్‌తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.మరింత మౌలిక వసతులు కల్పించాలి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు
తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
అత్యంత స్కైస్క్రాపర్స్ ఉన్న 10 నగరాలు
-
High Rise Apartments Hyderabad: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. కానీ?!
‘హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ పదేళ్ల క్రితం ఏఎస్రావు నగర్లో మూడున్నర ఎకరాల్లో 25 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మించింది. అప్పట్లో నగరంలోని ఆకాశహర్మ్యాలలో టాప్– 5లో ఇదొకటి. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుంది. కార్పస్ ఫండ్ కింద ఫ్లాట్ రూ.లక్ష చొప్పున వసూలు చేసి రెండేళ్ల పాటు నిర్వహణ కంపెనీయే చేపట్టింది. ఇక్కడిదాకా బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నివాసితుల సంఘం ప్రాజెక్ట్‌లోని వసతులను వార్షిక నిర్వహణ చేపట్టలేకపోయింది. అపార్ట్మెంట్లు రంగులు, అంతర్గత రోడ్లు పాడైపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.4 వేల ధర పలుకుతుంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3 వేలకు మించి రీసేల్ కావటం లేదు’ సాక్షి, హైదరాబాద్: ఇదీ ఓ హైరైజ్ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి. కొనేటప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తు హైరైజ్ రిస్క్‌లను అంచనా వేయటంలో నిర్మాణ సంస్థ, కొనుగోలుదారూ విఫలం చెందిన ఘటనకు ఇదో మచ్చుతునక. అంటే.. ఆకాశహర్మ్యాలు నిర్మించొద్దని కాదు.. నిర్వహణ సరిగా చేయలేకపోయినా, దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలకు ముందస్తు పరిష్కారం చూపించలేకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. నిర్మాణ సంస్థదేముంది కట్టేసి, అమ్మేసి చేతులు దులుపుకొంటుంది అంతే. ఆ తర్వాత కష్టాలు షరామామూలే. 41 శాతం ఎక్కువ.. భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాల సంస్కృతి భారీగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన హైరైజ్ భవనాలు క్రమంగా ఇక్కడా పెరిగిపోతున్నాయి. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి రాగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. 2020తో పోలిస్తే 41 శాతం ఎక్కువ. తొందరపడితే నష్టాలే.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఒకర్ని చూసి మరొకరు హైరైజ్ నిర్మాణాలను చేపడుతున్నారు. గచ్చిబౌలి, గండిపేట, కొండాపూర్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఖాజాగూడ, పుప్పాలగూడ, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం నార్సింగి, శంకర్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో 25 నుంచి 30 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగైదు ఏళ్లలో అదనంగా 70 వేల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయంటున్నారు నిపుణులు. ఇంత భారీ స్థాయిలో సరఫరాను అందుకునే డిమాండ్ ఉందా? డిమాండ్‌కు మించి సరఫరా జరిగితే ఇన్వెంటరీ పెరిగి రియల్టీ మార్కెట్ దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలా చేయాలి.. భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్‌లోని నివాసితులు, వాహనాల సంఖ్య, జనసాంద్రతకు తగ్గట్టుగా రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించాలి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతం లోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ప్రతి అంతస్తునూ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి అంశాలను తనిఖీ చేయాలి. ఆ స్థోమత బిల్డర్‌కు ఉందా? హైరైజ్ ప్రాజెక్ట్‌లను నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా? లేదా? అనేది చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్ మధ్యలో బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత, ఇతరత్రా అంశాల గురించి ఆరా తీయాలి. - నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ ఇంపాక్ట్ ఫీజు పెంచాలి.. హైరైజ్ నిర్మాణాలను నియంత్రించాలంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు క్యాప్ పెట్టడం సరైన నిర్ణయం కాదు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తింటుంది. అపరిమిత ఎఫ్ఎస్ఐ కారణంగానే ఇతర నగరాల నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపడుతున్నాయి. హైరైజ్ భవనాలను నియంత్రించాలంటే చేయాల్సింది ఇంపాక్ట్ ఫీజును పెంచాల్సిందే. – సి.శేఖర్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్ -
Hyderabad: దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద భవనం.. స్కైస్క్రాపర్లకు పెరిగిన డిమాండ్
హైదరాబాద్ నగరంలో ఆకాశ హార్మ్యాలకి డిమాండ్ పెరిగింది. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద స్కైస్క్రాపర్ భాగ్యనగరంలో రానుంది. అదే వరుసలో మరికొన్ని బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేందుకు డెవలపర్లు పోటీ పడుతున్నారు. రెసిడెన్షియల్ కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత భాగ్యనగరంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వివరాల ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు స్కై స్క్రాపర్ల నిర్మాణం కోసం ఏకంగా 67 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇన్స్‌స్టిట్యూషన్ పర్పస్ కోసం వచ్చిన దరఖాస్తులు 4 కాగా కమర్షియల్ పర్పస్ కోసం వచ్చిన దరఖాస్తులు 23గా ఉన్నాయి. మిగిలనవీ అన్నీ రెసిడెన్షియల్ కోసమే అని గ్రేటర్ అధికారులు అంటున్నారు. 25 దాటితే సాధారణంగా 25 అంతస్థుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్కై స్క్రాపర్గా పేర్కొంటారు. అయితే వీటి నిర్మాణం చేపట్టాలంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాలి. గతంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నగరం మధ్యలో ఉండటంతో ఇక్కడ భారీ భవంతున నిర్మాణం పెద్దగా జరగలేదు. శంషాబాద్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే తొలి దశ ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. వీటికి బిజినెస్ బాగానే జరగడంతో ఇప్పుడు దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద భవన నిర్మాణ పనులు నగరంలో మొదలయ్యాయి. 57 అంతస్థులతో ఎస్ఏఎస్ క్రౌన్ సంస్థ కోకాపేటలో 57 అంతస్థులతో దక్షిణాదిన అతి పెద్ద స్కైస్ర్కాపర్ నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు సౌతిండియాలో అతి పెద్ద బహుల అంతస్థుల భవనం బెంగళూరులో ఉంది. ఆ భవనంలో 50 అంతస్థులు ఉన్నాయి. కాగా ఎస్ఏఎస్ క్రౌన్ నిర్మించే స్కై స్క్రాపర్ దాన్ని అధిగమించనుంది. మరికొన్ని - క్యాండియర్ క్రీసెంట్ సంస్థ లింగంపల్లిలో 53 అంతస్థుల స్కై స్క్రాపర్ పనులు చేపడుతోంది - మైహోం లైఫ్ హబ్ సంస్థ కోకాపేటలో 50 అంతస్థుల బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తోంది - నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హెచ్ఆర్ఐ క్యాపిటల్ సంస్థ 47 అంతస్థుల భవనం నిర్మిస్తోంది - నానక్రామ్గూడాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెన్సేషన్ హైదరాబాద్ వన్ 47 అంతస్థుల భవనం నిర్మిణం చేపట్టనుంది చదవండి: చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక -
ఆకాశాన్ని తాకే అద్భుతాలు.. ఇవి తెలుసా?
World Skyscraper Day 2021: జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని ‘బహుళ అంతస్తుల భవనాలు’ అని పిలుచుకుంటున్నాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడన్ని ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు.. కట్టడానికి సమయం, వాటి నిర్మాణం వెనుక శారీరక శ్రమ కూడా వాటిలాగే ఆకాశాన్ని అంటుతుంటాయి. అందుకే వీటికంటూ ఒక రోజు కూడా ఉంది. ఇవాళ ప్రపంచ బహుళ అంతస్తుల భవన దినోత్సవం(స్కైస్క్రాపర్ డే). ► స్కైస్క్రాపర్స్ డే ప్రధాన ఉద్దేశం.. 130 ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం కృషి చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులు, ఆర్కిటెక్టర్లను గౌరవించుకోవడం, వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం. ► మొదటి బహుళ అంతస్తుల భవవాన్ని మొదటగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ విలియమ్ లె బారోన్ జెన్నెకి గుర్తింపు దక్కింది. ► చికాగోలోని హోం ఇన్సురెన్స్ భవవాన్ని(1984).. ప్రపంచంలోని మొట్టమొదటి స్కైస్క్రాపర్గా గుర్తించారు. ► సెప్టెంబర్ 3న ప్రముఖ ఆర్కిటెక్ట్ లూయిస్ సుల్లైవన్ పుట్టినరోజు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్కైస్క్రాపర్స్ అంటారు. ► ఈయన మోడ్రనిజానికి కూడా ఫాదర్లాంటి వాడనే పేరుంది. అమెరికాలోని వెయిన్‌రైట్ బిల్డింగ్, ది క్రౌజ్ మ్యూజిక్ స్టోర్, యూనియన్ ట్రస్ట్ బిల్డింగ్, ది ప్రూడెన్షియల్ బిల్డింగ్.. ఇలా ఎన్నో బిల్డింగ్‌లను చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ► అందుకే ఈ రోజును(సెప్టెంబర్ 3ను) ‘వరల్డ్ స్కైస్క్రాపర్’డేగా నిర్వహిస్తున్నారు. ► స్కైస్క్రాపర్స్(బహుళ అంతస్తుల భవంతి) ఆధునిక యుగంలో భారీ భవనాలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. ► కనీసం వంద మీటర్ల నుంచి 150 మీటర్లు ఉంటేనే.. అది బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు.(కంపల్సరీ అనేం లేదు). కాకపోతే పది అంతస్తుల కంటే ఎక్కువ మాత్రం ఉండాలి. అన్ని వసతులూ ఉండాలి. ► ప్రపంచంలో అతిఎత్తైన బహుళ అంతస్తుల భవనం.. బుర్జ్ ఖలీఫా ► యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా కట్టడం.. ప్రపంచ వింతల్లోనూ చోటు దక్కించుకుంది. అమెరికా ఆర్కిటెక్ట్ అడ్రియాన్ స్మిత్ దీనిని రూపొందించగా.. స్కిడ్మోర్, ఓవింగ్స్, మెర్రిల్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. బిల్ బేకర్ నిర్మాణ ఇంజినీర్‌గా వ్యవహరించాడు. ఎమ్మార్ ప్రాపర్టీస్ దీని ఓనర్. బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు(2, 722 అడుగులు), 168 అంతస్తులు 12 వేల మంది ఈ బిల్డింగ్ కోసం పని చేశారు ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ భవనాన్ని కట్టించారు జనవరి 4, 2010 నుంచి ఇది ఓపెన్ అయ్యింది లిఫ్ట్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అంటే రెండు నిమిషాల్లో 124వ అంతస్తుకు చేరుకోవచ్చు. ► ప్రపంచంలో రెండో పెద్ద బహుళ అంతస్తుల భవనం.. షాంగై టవర్(చైనా). ఎత్తు 632 మీటర్లు(2,073 అడుగులు)-163 అడుగులు. ఇది మెలికలు తిరిగి ఉండడం విశేషం. అమెరికన్ ఆర్చిటెక్ట్ మార్షల్ సస్రా్టబలా, చైనా ఆర్కిటెక్ట్ జన్ గ్సియాలు దీనిని డిజైన్ చేశారు. ► భారత్‌లో అతిపెద్ద భవనంగా ముంబై ‘పోలయిస్ రాయల్’కు పేరుంది. దీని ఎత్తు 320 మీటర్లు(1,050 అడుగులు)-88 అంతస్తులు. నోజర్ పంథాకీ నేతృత్వంలోని తలాటి పంథాకీ అసోషియేట్స్ ఈ భవనాన్ని రూపకల్పన చేసింది. - సాక్షి, వెబ్ స్పెషల్ చదవండి: పేన్లను పచ్చడి చేసి వ్యాక్సిన్ తయారు చేశాడు -
హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్
హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్ రికార్డ్‌లు బద్దలవుతున్నాయి. ఇప్పటివరకు నగరంలో అత్యంత ఎత్తయిన నిర్మాణం అంటే? కూకట్‌పల్లిలో 42 ఫ్లోర్ల లోధా బెల్లెజ్జా! కానీ, ఇప్పుడు? ఎస్ఏఎస్ ఇన్ఫ్రా నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ దగ్గర 4 ఎకరాల్లోని 57 ఫ్లోర్ల డైమండ్ టవర్స్. ఇదే సంస్థకు చెందిన కోకాపేటలో 4.5 ఎకరాల్లోని 45 అంతస్తుల్లో క్రౌన్. సుమధుర గ్రూప్ వేవ్‌రాక్ దగ్గర్లో ఐదున్నర ఎకరాల్లోని 44 అంతస్తుల ఒలింపస్. ఇదే సంస్థ నానక్‌రాంగూడలో 56 అంతస్తుల టవర్స్. నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ప్రాంతంలో అపర్ణా కన్స్ట్రక్షన్స్ 50 ఎకరాల్లో 50 అంతస్తుల టవర్స్... ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఆకాశానికి నిచ్చెనలా హైరైజ్ బిల్డింగ్స్ దూసుకుపోతున్నాయి. సాక్షి, హైదరాబాద్: డెవలపర్లు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రధాన కారణం.. ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే. నాలుగేళ్ల క్రితం కిస్మత్పూర్లో ఎకరం రూ.4 కోట్లు ఉండగా.. ఇప్పుడక్కడ రూ.30 కోట్లకు పైమాటే చెబుతున్నారని గిరిధారి హోమ్స్ ఎండీ కే ఇంద్రసేనా రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంత ధర పెట్టి లోరైజ్ నిర్మాణాలు చేపడితే డెవలపర్‌కు లాభముండదు. అందుకే భూముల ధరలు ఎక్కువగా ఉన్న చోట తక్కువ స్థలంలోనైనా సరే హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. కోకాపేట, ఖాజాగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలంటే.. హైరైజ్ బిల్డింగ్స్ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్ అవుతాయి. ల్యాండ్‌మార్క్ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్ కపుల్స్ ఎక్కువగా హైరైజ్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తుంటారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను పొదుపు చేయడానికి పెద్ద సైజ్ అపార్ట్మెంట్లను కొంటుంటారు. నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది. ఎందుకంటే లిఫ్టింగ్, విండ్ లోడ్ చార్జీలు, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఉత్పత్తుల వినియోగం వంటివి ఉంటాయి కాబట్టి! సాధారణ భవన నిర్మాణాలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. హైరైజ్ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను విస్తరించాలి. కట్టే దమ్ము బిల్డర్‌కు ఉందా? హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా లేదా చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్ మధ్యలో బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. గతంలో తెల్లాపూర్‌లో ఓ నిర్మాణ సంస్థ చేపట్టిన హైరైజ్ బిల్డింగ్‌లో కొనుగోలుదారుల అనుభవాలే మనకు ఉదాహరణ. అందుకే అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత ఇతరత్రా ఆర్థికపరమైన అంశాల గురించి ఆరా తీయాలి. అలాగే ఆయా నిర్మాణ సంస్థకు సాంకేతిక ప్రావీణ్యం, వృత్తి నైపుణ్యం ఎంత ఉందనేది కూడా చూసుకోవాలి. లాభాలు ఏంటంటే? ► ఎత్తయిన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ► ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ► ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్ గ్యాప్ ఉండదు. నష్టాలు ఏంటంటే? ► హైరైజ్ బిల్డింగ్వాసులు కసరత్తు, వ్యాయామం వంటి వాటి కోసం క్లబ్ హౌస్‌కు వెళ్లాలంటే బద్దకంగా ఫీలవుతుంటారు. ► ఎత్తుకు పోయినా కొద్దీ గ్రావిటీ తగ్గి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంట్లోనే యోగా, ప్రాణాయామం చేయాలి. ► సర్వీస్, ప్యాసింజర్ లిఫ్ట్‌లను వేర్వేరుగా నిర్వహణ చేయాలి. ► సాధారణ భవనాలలో కంటే హైరైజ్‌లో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉంటుంది. -
30, 35, 42 నింగిని తాకే నిర్మాణాలు
• 30.. ఆపైన అంతస్తుల్లో నివాసానికి కస్టమర్ల మొగ్గు • నిర్మాణానికి సిద్ధంగా 50కి పైగా ప్రాజెక్ట్‌లు 20, 25, 30, 42.. ఇవి కేవలం అంకెలేం కావు.. నగరంలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల్లోని అంతస్తులు. ఒకప్పుడు 15 ఫ్లోర్ల భవనాలంటేనే అమ్మో అనిచూసే నగరవాసులిప్పుడు.. ఏకంగా 30 ఆపైన అంతస్తుల్లో నివాసానికే సై అంటున్నారు. దీంతో బిల్డర్లు ఎత్తై భవనాల నిర్మాణాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో భాగ్యనగరం ఆకాశహర్మ్యాలకు వేదికవుతోంది. సాక్షి, హైదరాబాద్ : స్థలాల లభ్యత క్రమంగా తగ్గుతుండటమే ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఈ తరహా నిర్మాణాలు కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో ఎప్పుడో మొదలయ్యాయి. కానీ, హైదరాబాద్‌లో ఎత్తై నిర్మాణాలకు బీజం పడింది మాత్రం 2006లోనే అని చెప్పాలి. ఎందుకంటే ఫ్లాట్ల విస్తీర్ణం, రోడ్డు వెడల్పును బట్టి నగరంలో ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని చేపట్టేందుకు వీలుగా 86 జీవోను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. అనుమతులూ త్వరగానే.. ఏటా నగరంలో ప్రభుత్వ విభాగాలు 8-10 వేలకు పైగా నిర్మాణాలకు అనుమతులిస్తున్నాయి. వీటిలో చిన్నా చితక నిర్మాణాలతో పాటు అపార్ట్మెంట్లు, ఆకాశహర్మ్యాలుంటాయి. నగరంలో ఇప్పటివరకు 20 అంతస్తుల భవంతులు తక్కువే. ఎత్తై భవనాల నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీ అనుమతితో పాటు అగ్నిమాపక ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), విమానాశ్రయ విభాగాల నుంచి కూడా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని రకాల అనుమతులు రావటానికి చాలా సమయం పట్టేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఒకే ఒక్క ఎన్ఓసీ విధానం, సత్వర అనుమతులకు ఆన్లైన్ విధానం తీసుకురావటం వంటి నిర్ణయాలు తీసుకోవటంతో నిర్మాణదారులు కూడా ఎత్తై నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 20 అంతస్తులకు మించినవి.. ప్రస్తుతం నగరంలో 20 అంతస్తులకు మించిన భవనాలను నిర్మించేందుకు 50కి పైగా ప్రాజెక్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇవి ఎక్కువగా పశ్చిమ ప్రాంతాల్లోనే వస్తున్నాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ, ఖాజాగూడ, కూకట్పల్లి, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు ఊపందుకున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హైటెక్ సిటీ సమీపంలో మరీనా స్కైస్ పేరిట 31 అంతస్తుల్లో, గచ్చిబౌలిలో సుమధుర సంస్థ అక్రోపొలిస్ పేరిట 31 అంతస్తుల్లో నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి. ఇవే కాకుండా లోధా గ్రూప్ 42, ల్యాంకోహిల్స్ 36, సాకేత్ ఇంజనీర్స్ 25, మంజీరా 23, మంత్రి 24 అంతస్తుల్లో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ. దీంతో స్థలం ఉన్న చోట్ల సాధ్యమైనంత ఎత్తులో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాల్లో స్థలాల లభ్యత ఎక్కువే కానీ, కొనుగోలుదారుల ఆసక్తి మేరకు ఆయా ప్రాంతాల్లోనూ 60 మీటర్ల కంటే ఎత్తై నిర్మాణాలొస్తున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే.. ఇదిలా ఉంటే ఆకాశహర్మ్యాలు నిర్మించాలంటే నిర్మాణానికి తగ్గట్టుగానే పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని బిల్డర్లు చెబుతున్నారు. స్థలాల కొరత ఉన్న మహానగరాల్లో ఈ నిర్మాణాలే పరిష్కారమార్గమని సూచిస్తున్నారు. ఎత్తై నిర్మాణాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఉండేలా నిర్మాణంలో నాణ్యత పాటించడం ఆవశ్యకం. మరోవైపు ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు 6వ అంతస్తు పైనుంచి ప్రతి చ.అ.కు రూ.10-15 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 10 అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది. ఎత్తులో నివాసముంటే.. ⇔ ఆకాశహర్మ్యాల్లో నివాసముంటే అనుకూల, ప్రతికూలాలున్నాయి. ⇔ పై అంతస్తుల్లో నివసించే వారు బాల్కనీలోంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ⇔ గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి. ⇔ పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ⇔ పర్యావరణ సమస్యలు, ధ్వని కాలుష్యం ఉండదు. ⇔ పై అంతస్తులో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగం పెరిగి.. బిల్లూ పెరుగుతుంది. ⇔ తరచూ ఇళ్లు మారేవారికి సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉంటుంది. -
మరో 24 ఆకాశ హర్మ్యాలు..
శరవేగంగా బహుళ అంతస్తుల నిర్మాణం ఏడాదిలో పెరిగిన రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. మరికొన్ని ఆకాశహర్మ్యాలు రాబోతున్నాయి. సుమారు 16 బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, ఎనిమిది వాణిజ్య సముదాయాలు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కొంతకాలంగా స్తబ్దతగా ఉండిపోయిన రియల్ ఎస్టేట్ రంగం తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరణకు విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, ఐటీ కంపెనీల నిర్మాణం, తదితర నిర్ణయాలతో తిరిగి జీవం పోసుకుంటుంది. నగర శివారులోని ఆదిభట్లలో టాటా ఏరోస్పెస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమ నిర్మాణం, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండ చిత్రనగరి నిర్మాణం తదితర ప్రకటనలు స్థిరాస్తి రంగంలో కదలికలు తెచ్చాయి. నగరానికి నాలుగు వైపులు పారిశ్రామిక అభివృద్ధి బీజం పడటంతో భూములకు, ఫ్లాట్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త నిర్మాణ సంస్థలు నగరానికి తరలి వస్తున్నాయి. జీహెచ్ఎంసీకి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతుల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. నాలుగు మాసాల్లోనే సుమారు 9,807 దరఖాస్తుల అందినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గతేడాది కాలంలో రిజిస్ట్రేషన్ల దస్తావేజుల సంఖ్య బాగా పెరిగింది.సుమారు 3,19,579 దస్తావేజుల నమోదైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా నిర్మించే బహుళ అంతస్తుల భవన సముదాయాలు, యూనిట్లు (ఫ్లాట్స్) 1) జీ+7, ఆశోక్ నగర్, లింగంపల్లి, హైదరాబాద్. 9 2) జీ+14, ఖాజా గుడా , శేరిలింగంపల్లి 165 3) జీ+8 (నాలుగు బ్లాక్స్) నల్లగండ్ల, శేరిలింగంపల్లి 261 4) జీ+19(2 బ్లాక్) కూకట్పల్లి, బాలనగర్ 374 5) జీ+35 (7 టవర్స్) రాయదుర్గం, శేరిలింగంపల్లి 1760 6) జీ+13,(6 బ్లాక్స్) మాదాపూర్, శేరిలింగంపల్లి 298 7) జీ+15 (2 బ్లాక్స్) ఫతేనగర్, బాలనగర్ 576 8) జీ+12 (7 బ్లాక్హ్), గోపనపల్లి, శేరిలింగంపల్లి 760 9) జీ+7 ఖాజాగూడ, శేరిలింగంపల్లి 73 10) జీ+9 (4టైప్స్) ఖానామెట్, శేరిలింగంపల్లి 76 11) జీ+3 (4బ్లాక్స్) నల్లగండ్ల, శేరిలింగంపల్లి 92 12) జీ+14(3 టవర్స్)రాజ్‌భవన్ రోడ్, సొమాజిగూడ. 141 13) జీ+9 (3బ్లాక్హ్) నానక్‌రామ్‌గూడ , శేరిలింగంపల్లి 176 14) జీ+23 (3 బ్లాక్హ్) షేక్‌పేట, టౌలిచౌకి, హైదరాబాద్ 506 15) జీ+31 (3 బ్లాక్ ) నానక్ రామ్‌గూడ 564 16) జీ+31 (4 టవర్స్), మూసాపేట, కూకట్పల్లి 2398 వాణిజ్య భవన సముదాయాలు 1) జీ+ మూసాపేట,బాలనగర్, కూకట్పల్లి 2) జీ+6 గచ్చి బౌలి, శేరిలింగంపల్లి, 3) జీ+8, కుత్బుల్లాపూర్, 4) జీ+జీ+21(2 టవర్స్) పన మక్తా 5) జీ+13 టౌలిచౌకి 6) జీ+11 గచ్చిబౌలీ, శేరిలింగంపల్లి, 7) జీ+11 నానక్‌రామ్‌గూడ , శేరిలింగంపల్లి, 8) జీ+4 మౌలాలీ, మల్కాజిగిరి -
సాగర్ చుట్టూ హైఫై టవర్స్..