
మరో 24 ఆకాశ హర్మ్యాలు..
శరవేగంగా బహుళ అంతస్తుల నిర్మాణం
ఏడాదిలో పెరిగిన రియల్ ఎస్టేట్
మళ్లీ పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం
సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. మరికొన్ని ఆకాశహర్మ్యాలు రాబోతున్నాయి. సుమారు 16 బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, ఎనిమిది వాణిజ్య సముదాయాలు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కొంతకాలంగా స్తబ్దతగా ఉండిపోయిన రియల్ ఎస్టేట్ రంగం తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరణకు విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, ఐటీ కంపెనీల నిర్మాణం, తదితర నిర్ణయాలతో తిరిగి జీవం పోసుకుంటుంది. నగర శివారులోని ఆదిభట్లలో టాటా ఏరోస్పెస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమ నిర్మాణం, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండ చిత్రనగరి నిర్మాణం తదితర ప్రకటనలు స్థిరాస్తి రంగంలో కదలికలు తెచ్చాయి. నగరానికి నాలుగు వైపులు పారిశ్రామిక అభివృద్ధి బీజం పడటంతో భూములకు, ఫ్లాట్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త నిర్మాణ సంస్థలు నగరానికి తరలి వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీకి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతుల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. నాలుగు మాసాల్లోనే సుమారు 9,807 దరఖాస్తుల అందినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గతేడాది కాలంలో రిజిస్ట్రేషన్ల దస్తావేజుల సంఖ్య బాగా పెరిగింది.సుమారు 3,19,579 దస్తావేజుల నమోదైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కొత్తగా నిర్మించే బహుళ అంతస్తుల భవన సముదాయాలు, యూనిట్లు (ఫ్లాట్స్)
1) జీ+7, ఆశోక్ నగర్, లింగంపల్లి, హైదరాబాద్. 9
2) జీ+14, ఖాజా గుడా , శేరిలింగంపల్లి 165
3) జీ+8 (నాలుగు బ్లాక్స్) నల్లగండ్ల, శేరిలింగంపల్లి 261
4) జీ+19(2 బ్లాక్) కూకట్‌పల్లి, బాలనగర్ 374
5) జీ+35 (7 టవర్స్) రాయదుర్గం, శేరిలింగంపల్లి 1760
6) జీ+13,(6 బ్లాక్స్) మాదాపూర్, శేరిలింగంపల్లి 298
7) జీ+15 (2 బ్లాక్స్) ఫతేనగర్, బాలనగర్ 576
8) జీ+12 (7 బ్లాక్హ్), గోపనపల్లి, శేరిలింగంపల్లి 760
9) జీ+7 ఖాజాగూడ, శేరిలింగంపల్లి 73
10) జీ+9 (4టైప్స్) ఖానామెట్, శేరిలింగంపల్లి 76
11) జీ+3 (4బ్లాక్స్) నల్లగండ్ల, శేరిలింగంపల్లి 92
12) జీ+14(3 టవర్స్)రాజ్‌భవన్ రోడ్, సొమాజిగూడ. 141
13) జీ+9 (3బ్లాక్హ్) నానక్‌రామ్‌గూడ , శేరిలింగంపల్లి 176
14) జీ+23 (3 బ్లాక్హ్) షేక్‌పేట, టౌలిచౌకి, హైదరాబాద్ 506
15) జీ+31 (3 బ్లాక్ ) నానక్ రామ్‌గూడ 564
16) జీ+31 (4 టవర్స్), మూసాపేట, కూకట్‌పల్లి 2398
వాణిజ్య భవన సముదాయాలు
1) జీ+ మూసాపేట,బాలనగర్, కూకట్‌పల్లి
2) జీ+6 గచ్చి బౌలి, శేరిలింగంపల్లి,
3) జీ+8, కుత్బుల్లాపూర్,
4) జీ+జీ+21(2 టవర్స్) పన మక్తా
5) జీ+13 టౌలిచౌకి
6) జీ+11 గచ్చిబౌలీ, శేరిలింగంపల్లి,
7) జీ+11 నానక్‌రామ్‌గూడ , శేరిలింగంపల్లి,
8) జీ+4 మౌలాలీ, మల్కాజిగిరి