నగరంలోని షేక్పేట్లో నిర్మాణ దశలో ఉన్న ఓ ఐదంతస్థుల భవనం అమాంతం కూలిపోయింది. గ్రౌండ్ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమై పక్కనే ఉన్న భవంతిపై 1,2,3 ఫ్లోర్లు వాలిపోయాయి.
హైదరాబాద్: నగరంలోని షేక్పేట్లో నిర్మాణ దశలో ఉన్న ఓ ఐదంతస్థుల భవనం అమాంతం కూలిపోయింది. గ్రౌండ్ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమై పక్కనే ఉన్న భవంతిపై 1,2,3 ఫ్లోర్లు వాలిపోయాయి. కేవలం ఒకే అంతస్థుకు అనుమతి ఉన్నా ఐదంతస్థుల వరకు నిర్మాణం చేపట్టడంతో భవనం కూలిపోయిందని భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చెప్పారు. భవనం కూలిపోయిన వెంటనే అక్కడికి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక ఎమ్మార్వో చంద్రకళ వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ.. విస్తీర్ణాన్ని మించి నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా భవంతి కూలిపోయిందని చెప్పారు.
ధ్వంసమైన బిల్డింగ్ను ఈ రాత్రికే డిమాలిష్ చేసేందుకు అధికారులను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయని, అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. బిల్డింగ్ అనుమతిపై జీహెచ్ఎంసీ అధికారులు చూసుకుంటారని ఎమ్మార్వో చంద్రకళ అన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బందిగా ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.