ఓ పాత భవనం కుప్పకూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. స్థానిక నిమ్మకాయల వీధిలో వేణు అనే వ్యాపారికి చెందిన 60 ఏళ్ల క్రితం నాటి మూడంతస్తుల పాత భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది.
తిరుపతి: ఓ పాత భవనం కుప్పకూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. స్థానిక నిమ్మకాయల వీధిలో వేణు అనే వ్యాపారికి చెందిన 60 ఏళ్ల క్రితం నాటి మూడంతస్తుల పాత భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. భవనం కింది భాగంలో ఓ మొబైల్ షాపు ఉండగా, పై అంతస్తులో రెండు కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు.
అయితే, కూలడానికి ముందే భవనం గోడలకు నైులు ఇస్తుండడంతో అందులోని వారు భయంతోబయటకు వచ్చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అయితే, మొబైల్ షాపులో విలువైన వస్తువులు ఉండడంతో, సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని అంటున్నారు.