భవనం కూలిన ఘటనలో బాలిక మృతి | building collapsed in tirupati girl died | Sakshi
Sakshi News home page

భవనం కూలిన ఘటనలో బాలిక మృతి

Published Wed, Apr 27 2016 8:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

భవనం కూలిన ఘటనలో బాలిక మృతి

భవనం కూలిన ఘటనలో బాలిక మృతి

చిత్తూరు: తిరుపతి నగరంలో బుధవారం తెల్లవారు వేకువజామున ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందగా మరో బాలిక తీవ్ర గాయాలపాలైంది.

స్థానిక ఇసుక వీధిలో డ్రెయినేజి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందుకోసం తవ్విన కాలువ ఒక భవనం పునాదికి ఆనుకుని ఉంది. దీంతో ఆ భవనం పునాదులు కదిలి ఒక్కసారిగా కూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న గ్రీష్మ(14), నిహారిక(15) తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే బాలికలను ఆస్పత్రికి తరలించారు. నిహారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. గ్రీష్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో భవన శిథిలాలను తొలగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement