భవనం కూలి ఒకరి మృతి
Published Fri, Dec 25 2015 2:17 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50) అనే కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో ఐదుగురు గాయపడ్డారు. బేస్మెంట్ నుంచి మట్టిని తొలగిస్తుండగా అకస్మాత్తుగా భవనం కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
Advertisement
Advertisement