విశాఖ సిటీ: ఈ ఫొటోలో చిన్నారిని చూడండి.. ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని ఎలా చూస్తోందో!.. నిన్నమొన్నటి వరకు అక్కడున్న గుడిసెలు, గుడారాలు మాయమై ఖాళీ ప్రదేశం వెక్కిరిస్తుంటే.. నిన్నటి వరకు అక్కడున్న తన ఇల్లు ఏమైందబ్బా.. అన్నట్లుంది కదూ!!.. కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట ఫ్లైవోవర్ రెండు దశాబ్దాలుగా 76 కుటుంబాలకు ఆవాసంగా మారింది. సంచారజాతులకు చెందిన వీరిలో కొందరికి మదీనాబాగ్‌లో ఇళ్లు ఇచ్చామని చెప్పి ఎన్నికల్లో నాయకులు ఓట్లు దండుకున్నారు. కానీ అధికారులు మాత్రం వారికి ఇళ్లు అప్పగించలేదు. పైగా ఉన్న పళంగా మంగళవారం పోలీసు పటాలంతో తరలివచ్చి గుడిసెలు, గుడారాలను నేలమట్టం చేశారు. ఫలితంగా ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి.
ఎక్కడికీ వెళ్లలేక ఖాళీ ప్రదేశంలోనే పిల్లాపాపలతో కాలం వెళ్లదీస్తుంటే.. నిన్నటివరకు నీడినిచ్చిన గూళ్లలో తమను పొదివిపట్టుకొని ప్రేమ పంచిన తల్లిదండ్రులు ఎందుకింత దీనంగా ఉన్నారో?.. నీడనిచ్చిన గూడు ఇప్పుడెందుకు కనిపించడంలేదో??.. అర్థం కాక ఇలాంటి చిన్నారులు అయోమయం చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment