Watch: Bihar Professor Collapses On Stage Dies Of Heart Attack, Video Goes Viral - Sakshi
Sakshi News home page

మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్‌.. గుండెపోటుతో మృతి

Published Sun, Oct 23 2022 2:52 PM | Last Updated on Sun, Oct 23 2022 6:46 PM

Bihar Professor Collapses On Stage Dies Of Heart Attack - Sakshi

పాట్నా: అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాంటి సంఘటనే బిహార్‌లోని ఛాప్రా జిల్లాలో జరిగింది. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌.. వేదికపై మాట్లాడుతూనే కుప్పుకూలిపోయారు. గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మారుతి మనాస్‌ ఆలయం చీఫ్‌ సెక్రెటరీగా ఉన్న ప్రొఫెసర్‌ రనంజయ్‌ సింగ్‌..  ఆలయంలో శనివారం జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు రావటంతోనే మరణించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: హైవేపై కరెన్సీ నోట్ల వర్షంతో ఎగబడిన జనం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement