retired professor
-
వయసు@ 70..సోలో ట్రావెలర్
‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్ ప్రోఫెసర్ జైపూర్‌వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్‌గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. ‘‘ఫసిపిక్లోని గాలా పాగోస్ దీవుల నుండి అట్లాంటిక్ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్‌లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. కల వెనకాల రహస్యం నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్‌కి సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్లతో పాటు నెలల తరబడి బెడ్‌రెస్ట్‌లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. ప్రేమ వారసత్వం కాలేజీలోప్రోఫ్రెసర్గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్ ఫ్రెండ్ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. దృష్టి కోణాన్ని మార్చింది మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్ క్రిస్మస్కి క్రూయిజ్ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను. మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్‌లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్ ఏవీ ఉండవు. అడుగడుగునా ఉత్సుకత నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్ పర్యటన. నార్తర్న్ లైట్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాక్ హోమ్ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్‌లో ప్రతి వ్యక్తికీ వాష్‌రూమ్‌కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్ లాంటిది. అక్కడి బాత్రూమ్లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు అది లాక్ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్రూమ్లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్ వరకు ట్రాన్స్ –సైబీరియన్ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్బోర్న్లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్. -
లేటు వయసులోనూ నీట్ రాశారు..69 ఏళ్ల వయసులో పేదల కోసం..
సాక్షి, విశాఖపట్నం: పేదలకు వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో 69 ఏళ్ల వయసులోనూ ఎంబీబీఎస్ చేసేందుకు సంకల్పించారు విశ్రాంత ప్రొఫెసర్ డీకేఏఎస్ ప్రసాద్. సేవాభావం ముందు వయసు ఎప్పుడూ చిన్నదేనంటున్న ప్రసాద్ విజయనగర్‌లోని కేంద్రీయ విద్యాలయం కేంద్రంలో ఆదివారం నీట్ పరీక్ష రాశారు. ఎంబీఏ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన ప్రొఫెసర్ ప్రసాద్ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. కరోనా సమయంలో అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పారు. హోమియో వైద్యంపై కొంత అవగాహన ఉన్న ప్రొఫెసర్ ప్రసాద్ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. హోమియో మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఎంతో అభిమానం, అభిరుచి గల వైద్య వృత్తిని కొనసాగించాలంటే ఆయనకు పట్టా లేదు. ఎంబీబీఎస్ చదవకుండా వైద్య వృత్తి చేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన నీట్‌కు దరఖాస్తు చేశారు. వయో పరిమితి ఎత్తివేయడంతో.. నీట్ పరీక్ష రాయడానికి ఇప్పుడు వయసు నిబంధనలేవీ లేవు. గతంలో 21 సంవత్సరాలలోపు వయసు వారికి మాత్రమే నీట్ పరీక్షకు అనుమతి ఉండేది. నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేయడంతో.. వైద్యుడు కావాలన్న ఆకాంక్షను తీర్చుకునే గొప్ప అవకాశం ప్రొఫెసర్ ప్రసాద్‌కు లభించింది. ఆయన దరఖాస్తు చేసిన వెంటనే హాల్‌టికెట్ రాగా.. ఆదివారం పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష బాగా రాశానని.. తనకున్న అనుభవం వల్ల పరీక్షలో ర్యాంక్ సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్పారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన తరుణంలో.. తాను పట్టా తీసుకుంటే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో పరీక్ష రాశానన్నారు. చదవండి: ఉన్నత విద్యే లక్ష్యం -
మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. గుండెపోటుతో మృతి
పాట్నా: అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాంటి సంఘటనే బిహార్‌లోని ఛాప్రా జిల్లాలో జరిగింది. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ప్రొఫెసర్.. వేదికపై మాట్లాడుతూనే కుప్పుకూలిపోయారు. గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మారుతి మనాస్ ఆలయం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ప్రొఫెసర్ రనంజయ్ సింగ్.. ఆలయంలో శనివారం జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు రావటంతోనే మరణించినట్లు వెల్లడించారు. VIDEO: हनुमान जयंती पर मंच से दे रहे थे भाषण, अचानक आया हार्ट अटैक; रिटायर्ड प्रोफेसर की मौत pic.twitter.com/cX8ehsxvyh — NDTV India (@ndtvindia) October 23, 2022 ఇదీ చదవండి: హైవేపై కరెన్సీ నోట్ల వర్షంతో ఎగబడిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్! -
విషాదం: రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల క్షణికావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఢిల్లీ యూనివర్సిటీకి రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులు బలవంతంగా ఊపిరి తీసుకున్నారు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేర్‌టేకర్ అజిత్ వారి ఇంటి బెల్ మోగించినపుడు వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధిత దంపతుల కుమార్తె అంకితకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. (Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి) పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గోవింద్‌పురిలోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లోని తమ నివాసంలో రాకేష్ కుమార్ జైన్ (74), అతని భార్య ఉషా రాకేష్ కుమార్ జైన్ (69) స్టీల్ పైపునకు ఉరివేసుకుని కనిపించారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ సమయం మంచానికే పరిమితమై ఉండడంతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసు కున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌నుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గతేడాది యూపీలోని గోండాకు వెళ్తుండగా జైన్ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమయంలో రాకేష్ జైన్‌కు వెన్నులో తీవ్ర గాయం కాగా, ఉషాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతో ఇద్దరూ మంచాన పడ్డారు. అయితే చికిత్స అనంతరం కేర్ టేకర్ సాయంతో కోలుకుని ఇపుడిపుడే కొద్దిగా నడుస్తున్న తరుణంలో ఈ దంపతులు తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిల్చింది. -
79 ఏళ్లుగా కరెంట్‌తో పనిలేకుండా
ముంబై : నేటి కాలంలో రోజంతా కాదు కదా కనీసం ఓ అరగంట కూడా కరెంట్ లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. పల్లేల్లో అయితే పర్లేదు.. కానీ నగరవాసికి ఒక్క నిమిషం కరెంట్ లేకపోయినా ఊపిరాడదు. కానీ పూణెకు చెందిన ఓ రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్ తన జీవితాంతం కరెంట్‌తో పని లేకుండానే గడిపేస్తున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. వివరాలు.. హేమా సనే(79) అనే బోటనీ ప్రొఫెసర్ పూణెలోని బుధ్వార్ పేత్‌లోని ఓ చిన్న ఇంటిలో ఏళ్లుగా కరెంట్ లేకుండా జీవిస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవన విధానాన్ని చూసి చాలా మంది నన్ను పిచ్చిదాన్నిగా భావిస్తారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ఇలా జీవించడమే నాకు ఇష్టం. ఆహారం, బట్టలు, ఇళ్లు ఇవే మనిషి కనీస అవసరాలు. పూర్వం కరెంట్ ఉండేది కాదు. తర్వాత వచ్చింది. కానీ కరెంట్ అవసరం లేకుండానే నేను జీవించగల్గుతున్నాను’ అని చెప్పారు. కొన్ని పక్షులు, ముంగిస, ఓ కుక్క వీటినే తన ఆస్తులుగా చెప్పుకుంటారు హేమా సనే. అంతేకాక ఇవన్ని ప్రకృతి సంపద అని.. తాను వాటిని రక్షిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు తాను ఈ పక్షుల కువకువలతో మేల్కొంటానని.. నక్షత్రాల కాంతిలో రాత్రుళ్లు గడుపుతానని పేర్కొన్నారు. ఈ ఇంటిని అమ్మి వేరే ఇంటికి మారమని సలహా ఇస్తే.. మరి ఈ చెట్లను, పక్షులను ఎవరూ చూస్తారని తిరిగి ప్రశ్నిస్తారు హేమా సనే. కరెంట్ లేకుండా మీరు జీవించగల్గుతున్నారని ప్రశ్నించగా.. కరెంట్ ఉండి మీరు ఎలా బతుకుతున్నారో.. విద్యుత్ లేకుండా నేను కూడా అంతే సౌకర్యంగా జీవిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాక తన జీవన విధానం ద్వారా తాను ఎవరికి ఎలాంటి సందేశం ఇవ్వడం లేదన్నారు. జీవితంలో మీ మార్గాన్ని మీరే కనుగొనండి అని బుద్ధుడు చెప్పిన సందేశాన్నే నేను అవలంభిస్తున్నాను అని హేమా సనే తెలిపారు. హేమా సనే సావిత్రిబాయి పూలే పూణె యూనీవర్సిటీ నుంచి బోటనీలో పీహెచ్డీ చేశారు. అనంతరం పుణెలోని గార్వెర్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా చాలా ఏళ్లు విధులు నిర్వహించారు. బోటనీ మరియు పర్యావరణంపై ఆమె అనేక పుస్తకాలను రచించారు. ఇవన్ని ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నేటికి కూడా ఆమె కొత్త పుస్తకాలను రాయడం కొనసాగిస్తున్నారు. ఆమెకు తెలియని పక్షులు, చెట్లు ఈ పర్యావరణంలో లేవంటే అతియోశక్తి కాదు. -
లేటు వయసులో ఘాటు ప్రేమలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు.. అయితే కళ్లు మాత్రమే కాదు వయసు కూడా లేదనేలా రెండు జంటలు వ్యవహరించాయి. పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన రెండు ప్రేమజంటలు తమిళనాడులోనే తలదాచుకోవడం, వరుసగా రెండు సంఘటనలు చోటుచేసుకోవడం కాకతాళీయమైనా విచిత్రమే. అంతేగాక రెండు సంఘటనల్లోనూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యవార్లే విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించడం శోచనీయం. 40 ఏళ్ల టీచర్, 15 ఏళ్ల విద్యార్థితో పరార్ ఆమె టీచర్, అతడు పదోతరగతి విద్యార్థి. పవిత్రమైన గురుశిష్య సంబంధాన్ని అపవిత్రంగా మార్చివేసి ప్రేమ మోజులో పారిపోయి తమిళనాడులో తలదాచుకుని ఉన్నారు. కేరళ రాష్ట్రం ఆలప్పుళా సమీపం సేర్తళాముగమ్మా అనే ప్రాంతంలోని ప్రయివేటు ఇంగ్లిషు మీడియం పాఠశాలలో 300 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థి, అదే పాఠశాలలోని 40 ఏళ్ల ఉపాధ్యాయురాలు సన్నిహితంగా మెలగసాగారు. పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని చెరిపివేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెకు విద్యార్థి మాటలు ఎంతో ఆనందాన్ని ఇవ్వడంతో ఇటీవల ఖరీదైన సెల్‌ఫోన్ కూడా కొనివ్వగా ఇళ్లకు వెళ్లిన తరువాత కూడా ఇరువురూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈనెల 23 వ తేదీన విద్యార్థి అకస్మాత్తుగా ఇంటి నుంచి పారిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో సదరు ఉపాధ్యాయిని సైతం కనపడక పోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయినట్లు నిర్ధారించుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని వర్కలాలో ఉన్నట్లు పోలీసులు వెళ్లగా ఈలోగా వారు తప్పించుకున్నారు. ఇంకా వారికోసం గాలిస్తున్న తరుణంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ఉన్నట్లు బుధవారం సమాచారం అందింది. కేరళ పోలీసులు హుటాహుటిన గురువారం కన్యాకుమారికి చేరుకోగా అప్పటికేవారు జారుకున్నారు. కన్యాకుమారి నుంచి మదురై, ఊటీ, కొడైక్కెనాల్ పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చని అంచనావేసి గాలింపు ముమ్మరం చేశారు. ‘మాది వాంఛలు లేని పవిత్ర ప్రేమ’ పంజాబ్ రాష్ట్రం నుంచి పారిపోయి రామేశ్వరంలో పోలీసులకు బుధవారం పట్టుబడిన చిత్రమైన ప్రేమజంట ‘తమది కామవాంఛలు లేని పవిత్ర ప్రేమ’ అని పోలీసులు, పెద్దలతో వాదించిన విషయం గురువారం బయటపడింది. వివరాల్లోకి వెళ్లితే.. పంజాబ్ రాష్ట్రంలోని అపోకర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జయ్‌కృష్ణన్ (65) తన వద్ద ట్యూషన్ వచ్చే మగత్ (20) అనే విద్యార్థినిపై మమకారం పెంచుకున్నాడు. భార్య చనిపోగా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను కలిగి ఉన్న జయ్‌కృష్ణన్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో మగత్ను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు. రిటైరైన తరువాత కూడా మగత్కు ఆర్థిక సహకారం చేయడం, ఇంటికి పిలిపించుకుని మరీ ట్యూషన్లు చెప్పడం, ఇద్దరూ కలిసి భోంచేయడం పరిపాటిగా తయారై ప్రేమగా మారింది. ఈనెల 11వ తేదీన జయకృష్ణన్ రూ.25వేల తన పింఛన్ సొమ్ముతోపాటు ఇంటిలోని నగదును తీసుకురాగా ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ రెండురోజుల క్రితం తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు. తండ్రి, కుమార్తెలమని చెప్పి ప్రయివేటు అతిథిగృహంలో రూము తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్, రామేశ్వరం పోలీసులకు బుధవారం వారు పట్టుబడ్డారు. ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో ఏడాది క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకుని రహస్య కాపురం సాగిస్తున్న విషయం బయటపడింది. ఎన్నాళ్లీ దొంగకాపురం, స్వేచ్ఛగా కలిసి జీవిద్దామనే ఆలోచనతోనే పంజాబ్ నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడ్డారు. ‘మాది పవిత్ర ప్రేమ’ :జయకృష్ణన్, మగత్ మాది పవిత్రమైన ప్రేమ.. తప్పుపట్టే పని మేం చేయలేదని వారిద్దరూ పోలీసుల వద్ద సమర్థించుకున్నారు. ‘‘శారీరక సుఖం కోసం మగత్ను పెళ్లి చేసుకోలేదు, భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న నాపై మగత్ అత్యంత అభిమానం చూపించింది. ఇదే మాఇద్దరి మధ్య ప్రేమకు కారణం’’ అని జయకృష్ణన్ చెప్పాడు. ‘‘చిన్నవయసు నుంచే నా పట్ల చూపిన ఆదరణే జయకృష్ణన్ అంటే విలువపెంచేలా చేసిందని మగత్ తెలిపింది. కాలక్రమేణా నాకు తెలియకుండానే ఆయనంటే ప్రేమ ఏర్పడింది. నా ప్రేమ తప్పని తెలిసినా ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. బతికితే అతనితోనే బతుకుతాను, భర్తను నా నుంచి విడదీయవద్దు’’అని పోలీసుల వద్ద మగత్ పెద్దగా విలపించింది. పంజాబ్‌కు వెళ్లడం ఇష్టం లేదని, అక్కడికి వెళితే తమని చంపేస్తారని, తాను మేజర్‌ను కావడం వల్ల ఎవరితోనైనా జీవించే హక్కు తనకుందని మగత్ పోలీసుల వద్ద వాదించింది. అయితే వారిద్దరినీ పంజాబ్ పోలీసులకు అప్పగించాలని రామేశ్వరం కోర్టు తీర్పు చెప్పడంతో విధిలేక తిరుగు ప్రయాణమయ్యారు. -
గోల్డ్‌మెడల్ కోసం 44 ఏళ్లు ఆగాడు!
లక్నో: అనిల్‌కుమార్ సింగ్ నలభై నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా నిరీక్షించారు. ఈ 44 ఏళ్ల కాలంలో ఆయన తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి.. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి.. రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది.. పదవీ విరమణ కూడా చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తన ప్రతిభకు బహుమానంగా దక్కాల్సిన గోల్డ్‌మెడల్‌ను ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో ఆయన చేతికందింది. సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) చలువతో 44 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. 1971లో లక్నో యూనివర్సిటీలో ఇనార్గానిక్ కెమెస్ట్రీలో అనిల్‌కుమార్ సింగ్ అత్యధిక మార్కులు సాధించారు. కెమెస్ట్రీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు యూనివర్సిటీ ప్రతి ఏటా ఎం రామన్ గోల్డ్‌మెడల్ అందజేస్తుంది. అయితే 1971లో ఏవో కారణాలతో స్నాతకోత్సవాన్ని నిర్వహించలేదు. దీంతో ఆ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడళ్లు, బహుమానాలు అందలేదు. అయితే, యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన అనిల్‌కుమార్ తనకు జరిగిన అన్యాయంపై పోరాడారు. అనేకసార్లు యూనివర్సిటీ పాలకసిబ్బందికి వినతిపత్రాలు ఇచ్చారు. తన ప్రతిభకు బహుమానంగా గోల్డ్‌మెడల్ ప్రదానం చేయాల్సిందిగా కోరారు. 1971లో ఆయనకు అత్యధిక మార్కులు వచ్చాయన్న విషయాన్ని అంగీకరించిన లక్నో వర్సిటీ మాత్రం.. ఏదైనా సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే.. ఆ ఏడాది ఇవ్వాల్సిన గోల్డ్‌మెడళ్లు తర్వాత ఇవ్వడం కుదరదని మెలిక పెట్టింది. దీనిపై సుదీర్ఘ కాలం పోరాడిన అనిల్‌కుమార్ సింగ్ 2007లో యూనివర్సిటీ నుంచి మార్కుల షీట్‌తోపాటు ఆయనకు గోల్డ్‌మెడల్ అర్హత ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సాధించారు. ఆ తర్వాత ఆర్టీఐ ద్వారా యూనివర్సిటీ చట్టంలోని సెక్షన్ 15.05ను ప్రస్తావిస్తూ మరో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయన దరఖాస్తుకు ఎట్టకేలకు వీసీ ఆమోదం తెలిపడంతో అనిల్‌కుమార్ సింగ్ తన ప్రతిభకు తగిన బహుమానాన్ని అందుకున్నారు. 44 ఏళ్ల నిరీక్షణ అనంతరం శనివారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేతులమీదుగా గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. తన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించడం ఆనందం కలిగిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా రమేష్
దేశంలో ఒక్కరికే దక్కిన అవకాశం వృత్తి-విద్యకు అనుసంధానంగా రెండేళ్ల పరిశోధనలు కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఘంటా రమేష్ కు అరుదైన గౌరవం దక్కింది. యూజీసీ ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేయూ విద్యావిభాగంలో రెండేళ్ల పాటు ఆయన వృత్తి-విద్యకు అనుసంధానంగా పరిశోధనలు చేయనున్నారు. విద్యావిభాగంలో దేశవ్యాప్తంగా రమేష్ ఒక్కరే ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా నియమితులు కావడం విశేషం. దీం తో ఆయనకు వృత్తికి, విద్యకు అనుసంధానం చేసే ఒకేషనలైజేషన్ అంశాలకు సం బంధించి విస్తృత పరిశోధనలు చేసే అవకాశం లభించింది. రెండేళ్ల పాటు ఆయన నెలకు రూ.50వేల చొప్పున కాంటింజెన్సీ ఫెలోషిప్‌ను యూజీసీ నుంచి అందుకుంటారు. కేయూలో ఉద్యోగ విరమణ కాకతీయ యూనివర్సిటీలో విద్యావిభాగంలో ప్రొఫెసర్ పనిచేసిన ఘంటా రమేష్ గత ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. అదే ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీ య ఉర్దూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్.. ఆ యూనివర్సిటీ పరిధిలో మూడు బీఎడ్ కళాశాలలు, రెండు ఎంఈడీ కళాశాలల స్థాపనకు విశేష కృషి చేశారు. అంతకుముందు రమేష్ ఒకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంశంపై కొంతకాలం క్రితం లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన అనేక దేశాల విద్యావేత్తలతో వృత్తివిద్యపై విస్తృతంగా చర్చలు జరిపారు. విద్యారంగంలో విశేషమైన కృషి ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర అనే మారుమూల గ్రామంలో జన్మించిన ఘంటా రమేష్ కాకతీయ యూనివర్సిటీలో విద్యావిభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ హన్మకొండలోనే స్థిరపడిపోయారు. ఆయన ఉద్యోగం చేసిన సమయంలో అనేక బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా పలు అవార్డులు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతం లో అమెరికా ప్రభుత్వం నుంచి పుల్‌బ్రైట్ విజిటింగ్ ఫెలోగా అవార్డు పొందిన రమేష్ కేయూ విద్యావిభాగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎన్ఈ) ఉన్నతీకరణకు విశేష కృషి చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈడీలో కామన్ సిలబస్, అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన చేసి పలువురి ప్రశంసలు అం దుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) దక్షిణ ప్రాంత కమి టీ సభ్యుడిగా, యూజీసీ, న్యాక్, రాష్ట్ర జాతీయ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిన రమేష్ విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. రాష్ట్రంలో నాలుగు సార్లు ఎడ్‌సెట్ సమర్థవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన ఆది వాసీల విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ నేతృత్వంలో బీఈడీ కళాశాలను ఏర్పాటుచేయడంలో కూడా రమేష్‌దే కీలకపాత్ర. విద్యా విభాగంలో మూడు దశాబ్దాల కు పైగా సేవలందించిన ఆయనకు 1997 లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు, 2009 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్ సంస్థ నుంచి జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. వయోజన విద్యలో విశేషమైన కృషి చేసినందుకు 2010లో భారత ప్రభు త్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుం చి ఉత్తమ రాష్ట్ర రిసోర్స్ సెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. యువతకు ఉపాధి లభించేలా పరిశోధనలు గతంలో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు వెళ్లినప్పుడు అనేక దేశాల విద్యావేత్తలతో చర్చించే అవకాశం లభించింది. ఆ అనుభవం ఇప్పుడు నా పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రభుత్వాలు ఒకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నా అనుకున్న స్థాయిలో విజయవంతం కావడం లేదు. వృత్తివిద్య అనేది ఉపాధికి మార్గంగా ఉండాలి. ఉన్నత విద్యను కూడా వృత్తికి అనుసంధానం చేసి విద్యార్థుల్లోకి తీసుకెళ్లేలా పరిశోధనలు చేసి వాటి ఫలితాలను అమలు చేస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ మేరకు రెండేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నాం. - ఘంటా రమేష్