చౌటుప్పల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్–వరంగల్ 163 జాతీయ రహదారిపై శనివారం కూడా వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజామునుంచి అర్ధరాత్రి వరకు వాహనాలు బారులుతీరుతూ వెళ్లాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా 12 టోల్‌బూత్‌లను తెరిచారు.
శనివారం 80వేల పైచిలుకు వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఉన్న 12 టోల్ కౌంటర్లకు 8 కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. ఈ మార్గంలో శనివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్లు జీఎమ్మార్ అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు బారులుతీరాయి. సుమారు 30వేలకు పైగా వాహనాలు ఈ టోల్ గుండా ప్రయాణించాయి.
Comments
Please login to add a commentAdd a comment